మహదేవ్‌పూర్ మండలం (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)
మహదేవ్‌పూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న 11 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 32 గ్రామాలు కలవు. ఈ మండలం భూపాలపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.[1]
మహాదేవపూర్ | |
— మండలం — | |
జయశంకర్ భూపాలపల్లి జిల్లా పటంలో మహాదేవపూర్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో మహాదేవపూర్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°43′54″N 79°59′01″E / 18.731554°N 79.983666°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | జయశంకర్ భూపాలపల్లి |
మండల కేంద్రం | మహాదేవపూర్ |
గ్రామాలు | 32 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 38,489 |
- పురుషులు | 18,986 |
- స్త్రీలు | 19,503 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.55% |
- పురుషులు | 54.73% |
- స్త్రీలు | 30.27% |
పిన్‌కోడ్ | 505504 |
మండల జనాభాసవరించు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 38,489, పురుషులు 18,986, స్త్రీలు 19,503.
కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పుసవరించు
లోగడ మహాదేవపూర్ మండలం కరీంనగర్ జిల్లా, మంథని రెవిన్యూ డివిజను పరిదిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాదేవపూర్ మండలాన్ని (1+31) ముప్పది రెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
గమనిక:నిర్జన గ్రామాలు 7 (ఏడు) పరిగణనలోకి తీసుకోలేదు