జయశంకర్ భూపాలపల్లి జిల్లా

తెలంగాణ లోని జిల్లా

జయశంకర్ జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]

జయశంకర్ జిల్లా
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా స్థానం
తెలంగాణ పటంలో జయశంకర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్య పట్టణంభూపాలపల్లి
మండలాలు11
విస్తీర్ణం
 • మొత్తం6,175 కి.మీ2 (2,384 చ. మై)
జనాభా
 (2011 (ములుగుతో కూడిన పాత జిల్లా))
 • మొత్తం7,50,000
 • జనసాంద్రత120/కి.మీ2 (310/చ. మై.)
Vehicle registrationTS–25[1]
ప్రధాన రహదార్లుNH363
Websiteఅధికారిక జాలస్థలి

2016 అక్టోబరు 11న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (భూపాలపల్లి, ములుగు), 11 మండలాలు, 574 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. భూపాలపల్లి ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా ఉంటుంది.[3]. ఇప్పుడు భూపాలపల్లి జిల్లా నుండి ములుగు జిల్లాను వేరు చేయడం జరిగింది. ములుగు జిల్లాలో 9 మండలాలు ఉన్నాయి.జిల్లా విస్తీర్ణం: 6,175 చ.కి.మీ. కాగా, జనాభా: 7,05,054, అక్షరాస్యత: 60 శాతంగా ఉన్నాయి.

పటం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా

జిల్లాలోని మండలాలు

మార్చు
  • పునర్య్వస్థీకరణలో భాగంగా మొదట వరంగల్ జిల్లాలోని 13 పాతమండలాలు, కరీంనగర్ జిల్లాలోని 5 పాతమండలాలు, ఖమ్మం జిల్లాలోని 2 పాత మండలాలుతో ఈ జిల్లా ఏర్పడింది.[2]
  • ఆ తరువాత ఈ జిల్లాలోని ములుగు రెవెన్యూ డివిజను పరిధిలోని 9 మండలాలుతో ములుగు జిల్లా ఏర్పాటు చేయగా ఈ జిల్లాలో 11 మండలాలు ఉన్నవి.[4]
  1. భూపాలపల్లి మండలం
  2. ఘనపూర్‌ మండలం
  3. రేగొండ మండలం
  4. మొగుళ్ళపల్లి మండలం
  5. చిట్యాల మండలం
  6. టేకుమట్ల మండలం *
  7. మల్హర్రావు మండలం
  8. కాటారం మండలం
  9. మహాదేవ్‌పూర్ మండలం
  10. పల్మెల మండలం *
  11. ముత్తారం మండలం

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా జిల్లాలో  కొత్తగా ఏర్పడిన మండలాలు (2)

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Telangana New Districts Names 2016 Pdf TS 31 Districts List". Timesalert.com. 11 October 2016. Retrieved 11 October 2016.
  2. 2.0 2.1 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms. No. 233 Revenue (DA-CMRF) Department, Dt: 11-10-2016
  3. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-26. Retrieved 2017-11-27.
  4. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 18, Revenue (DA-CMRF) Department, Date: 16.02.2019

వెలుపలి లింకులు

మార్చు