మహమూద్ హుస్సేన్ (క్రికెటర్)

పాకిస్తానీ మాజీ క్రికెటర్

మహమూద్ హుస్సేన్ (1932, ఏప్రిల్ 2 - 1991, డిసెంబరు 25) పాకిస్తానీ మాజీ క్రికెటర్.[1] 1950లలో పాకిస్తాన్ కొత్త బాల్ బౌలర్లలో అత్యంత వేగవంతమైన బౌలర్ ఇతడు.

మహమూద్ హుస్సేన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1932-04-02)1932 ఏప్రిల్ 2
లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ1991 డిసెంబరు 25(1991-12-25) (వయసు 59)
లండన్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 12)1952 అక్టోబరు 23 - ఇండియా తో
చివరి టెస్టు1962 జూలై 5 - ఇంగ్లాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు {{{column2}}}
మ్యాచ్‌లు 27 97
చేసిన పరుగులు 336 1,160
బ్యాటింగు సగటు 10.18 10.94
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 35 50
వేసిన బంతులు 5,910 18,538
వికెట్లు 68 329
బౌలింగు సగటు 38.64 25.28
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 2 19
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 3
అత్యుత్తమ బౌలింగు 6/67 8/95
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 31/–
మూలం: CricInfo, 2019 జూలై 12

మహమూద్ హుస్సేన్ 1932, ఏప్రిల్ 2న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించాడు.[2]

క్రికెట్ రంగం

మార్చు

1952 నుండి 1962 వరకు 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఫాస్ట్ మీడియం బౌలర్ గా రాణించాడు. టెస్టు మ్యాచ్‌ల్లో 60 వికెట్లు తీశాడు. ఖాన్ మొహమ్మద్ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత ఫజల్ మహమూద్‌తో భాగస్వామి అయ్యాడు.

1952-53లో లక్నోలో జరిగిన రెండో టెస్టులో ఆరంగ్రేటం చేశాడు. ఖాన్‌కు గాయం కారణంగా మహమూద్ జట్టులోకి వచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులకు మూడు వికెట్లు (23 ఓవర్లలో) సహా నాలుగు వికెట్లు తీశాడు.[3]

1961లో న్యూ ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో మరపురాని 35 పరుగులు చేసి, పాకిస్తాన్‌ను ఓటమి నుండి కాపాడాడు.[4]

1978లో ఇంగ్లాండ్‌లో పాకిస్తాన్ జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు.

మహమూద్ హుస్సేన్ 1991, డిసెంబరు 25న లండన్ లో మరణించాడు.[1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Mahmood Hussain Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
  2. "Mahmood Hussain Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
  3. "IND vs PAK, Pakistan tour of India 1952/53, 2nd Test at Lucknow, October 23 - 26, 1952 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.
  4. "IND vs PAK, Pakistan tour of India 1960/61, 5th Test at Delhi, February 08 - 13, 1961 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-22.

బాహ్య లింకులు

మార్చు