ఖాన్ మొహమ్మద్

పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు

ఖాన్ మొహమ్మద్ (1928, జనవరి 1 - 2009 జూలై 4) పాకిస్తానీ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] 1952లో భారత్‌తో ఆడిన పాకిస్థాన్ తొలి టెస్టు జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[2] ఫజల్ మహమూద్‌తో కలిసి కొత్త బంతిని పంచుకున్న ఓపెనింగ్ బౌలర్‌గా 13 టెస్టుల్లో ఆడాడు. పాకిస్తాన్ మొదటి బంతిని బౌలింగ్ చేసి, టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ కు మొదటి వికెట్ ను అందించిన ఘనతను కూడా కలిగి ఉన్నాడు.

ఖాన్ మొహమ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఖాన్ మొహమ్మద్
పుట్టిన తేదీ(1928-01-01)1928 జనవరి 1
లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2009 జూలై 4(2009-07-04) (వయసు 81)
లండన్, ఇంగ్లండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 8)1952 అక్టోబరు 16 - ఇండియా తో
చివరి టెస్టు1958 మార్చి 31 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1947/48పంజాబ్
1947/48–1948/49Punjab University
1949/50Pakistan Universities
1951సోమర్సెట్
1953/54Bahawalpur
1955/56Sind
1956/57Karachi Whites
1960/61Lahore
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 13 54
చేసిన పరుగులు 100 544
బ్యాటింగు సగటు 10.00 11.57
100లు/50లు 0/0 0/1
అత్యధిక స్కోరు 26* 93
వేసిన బంతులు 3,157 10,496
వికెట్లు 54 214
బౌలింగు సగటు 23.92 23.22
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 4 16
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 1
అత్యుత్తమ బౌలింగు 6/21 7/56
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 20/–
మూలం: CricketArchive, 2009 జూలై 6

ఖాన్ మొహమ్మద్ 1928, జనవరి 1న పాకిస్తాన్, పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.[3] ఇస్లామియా కాలేజీలో చదువుకున్నాడు.

క్రికెట్ రంగం

మార్చు

1954లో లార్డ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో లెన్ హట్టన్‌ను డకౌట్ చేసాడు. ఇది ఆ కాలపు క్రికెటర్లలో అరుదైన ఘనతగా నమోదయింది.

1951లో, సోమర్‌సెట్ తరపున దక్షిణాఫ్రికాతో ఆడాడు.[4] మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీశాడు. 18 నెలల తర్వాత అక్కడ టెస్ట్ క్రికెట్ ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్‌కు తిరిగి వచ్చాడు.

చివరి సంవత్సరాలలో ఇంగ్లాండ్‌లో నివసించాడు. ప్రోస్టేట్ క్యాన్సర్‌తో 2009 జూలై 4న లండన్‌లో మరణించాడు.[5]

మూలాలు

మార్చు
  1. "Khan Mohammad Profile - Cricket Player Pakistan | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  2. "IND vs PAK, Pakistan tour of India 1952/53, 1st Test at Delhi, October 16 - 18, 1952 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  3. "Khan Mohammad Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-16.
  4. "సోమర్సెట్ v South Africans". www.cricketarchive.com. 1951-08-01. Retrieved 2008-12-06.
  5. "Former Pak pacer Khan Mohammad dies". indopia.in. 2009-07-05. Retrieved 2009-07-05.[permanent dead link]

బాహ్య లింకులు

మార్చు