మహమ్మద్ బాజి

భారత స్వాతంత్ర్య సమరయోధుడు
(మహమ్మద్‌ బాజి నుండి దారిమార్పు చెందింది)

మహమ్మద్‌ బాజి ఒడిశాలోని కోరాపుట్ కు చెందిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు.

మహమ్మద్ బాబి
మహమ్మద్ బాజి చిత్రం
జననం(1917-01-28)1917 జనవరి 28
మరణం2019 జూన్ 27(2019-06-27) (వయసు 102)
నవరంగపూర్‌ పట్టణం
ఇతర పేర్లుమహమ్మద్ బాజీ
విద్యపట్టభద్రుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
భారత స్వాతంత్ర్య సమరయోధుడు

జీవిత విశేషాలు

మార్చు

అతను 1917 జనవరి 28న జన్మించాడు.[1] అతని గురువు సదాశివ త్రిపాఠీ తరువాతి కాలంలో ఒడీశా ముఖ్యమంత్రిగా పనిచేసాడు.

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర

మార్చు

అతను 1931లో భారత జాతీయ కాంగ్రెస్లో చేరాడు.[2] నాగపూర్ శాఖకు అద్యక్షునిగా వ్యవహరించాడు. గాంధీని కలవాలనే సంకల్పంతో తన స్నేహితుడు లక్ష్మణ్ సాహుతో కలసి సైకిలుపై సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించి రాయపూర్ చేరుకున్నాడు. అక్కడి నుండి రైలులో వార్థాకు చేరుకొని సేవాగ్రాంకు వెళ్ళాడు.[3] వార్ధలో మహాత్మగాంధీని కలుసుకున్న బాజి అతను కోరిక మేరకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నాడు. ఆంగ్లేయుల పాలనలో కొరాపుట్‌, బరంపురం జైళ్లలో శిక్షనుభవించాడు. 1942 ఆగస్టు 25న క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 30 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 1945లో శాంతి ఉద్యమంలో పాల్గొన్నందుకు సోరాగుడాలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసారు. అక్కడ జరిగిన హింసాకాండలో అతని భుజం గాయపడింది. అతనిని కటక్ జైలుకు తరలించారు. అతను బిజూ పట్నాయక్ తో కలసి జైలు శిక్ష అనుభవించాడు. అతనిని 1947 ఆగస్టు 12న విడుదల చేసారు[4]. 1952లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి సదాశివ త్రిపాఠీతో సహా అతని స్నేహితులు ఎన్నికలలో పోటీ చేయమని కోరినా అతను పోటీ చేయలేదు. అతను గాంధేయ మార్గంలో ప్రజలకు సేవలందించాలని కోరుకున్నాడు. భారత స్వాతంత్ర్యం తరువాత 1955-67 కాలంలో అతను కోరాపుట్ జిల్లా భూదాన్ బోర్డు సలహాదారుగా ఉన్నాడు. అతను భూదాన్ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించి సుమారు నాలుగు లక్షల ఎకరాల భూమిని నిరుపేదలకు అందజేసాడు. ఈ కార్యక్రమంలో భాగంగా 14 ఎకరాల అతని స్వంత స్థలాన్ని కూడా పేదలకు పంచిపెట్టాడు.

గాంధీ మాటలని అనుసరిస్తూ మాంసాహారం తినలేదు. ఆజన్మ బ్రహ్మచారిగా ఉండి తన ఆస్తులను పేద ప్రజలకు పంచిపెట్టాడు. ప్రభుత్వ పింఛను సైతం కాదనుకుని ఆశ్రమ జీవితాన్నే గడిపాడు[5].

అతను 2019 జూన్ 27న నవరంగపూర్‌ పట్టణంలోని సునారివీధిలో తన స్వగృహంలో మరణించాడు.

మూలాలు

మార్చు
  1. Dalai, Ramachandra (2019-06-28). "Freedom fighter Mohammed Bazi no more". DNA India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-12.
  2. "naveen-condoles-the-passing-away-of-true-gandhian-mohammad-bazi". Archived from the original on 2019-08-12. Retrieved 2019-08-12.
  3. "India Together: Nine decades of non-violenceP Sainath - 16 September 2007". indiatogether.org. Archived from the original on 12 ఆగస్టు 2019. Retrieved 2019-08-12.
  4. "Mohammed Baji – Indian Freedom Fighter | Mpositive.in". Archived from the original on 2019-08-12. Retrieved 2019-08-12.
  5. "స్వాతంత్ర్య సమరయోధుడుమహమ్మద్‌ బాజి అస్తమయం". Archived from the original on 2019-08-12. Retrieved 2019-08-12.

బయటి లంకెలు

మార్చు