మహానటి (1982 సినిమా)

ఇది 1982లో కన్నడ భాషనుండి డబ్ చేసిన సినిమా.

మహానటి
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం పుట్టణ్ణ కణగాల్
నిర్మాణం బెల్లం అప్పారావు,
సి.హెచ్.వి.రాజు
తారాగణం అంబరీష్,
ఆరతి
సంగీతం ఎం.రంగారావు
నిర్మాణ సంస్థ వెంకట్ క్రిషన్ ఫిలింస్
భాష తెలుగు

మహానటి 1982 అక్టోబర్ 2వ తేదీన విడుదలైన డబ్బింగ్ సినిమా. దీనికి మూలం అంతకు ముందు సంవత్సరం విడుదలైన రంగనాయకి అనే కన్నడ సినిమా. ఈ సినిమాను అశ్వత్థ రచించిన రంగనాయకి అనే కన్నడ నవల ఆధారంగా తీశారు.

నటీనటులు మార్చు

  • అంబరీష్
  • ఆరతి
  • రామకృష్ణ
  • అశోక్
  • రాజానంద్
  • కృష్ణమూర్తి

సాంకేతిక వర్గం మార్చు

  • కథ : అశ్వత్థ
  • మాటలు: శ్రీచంద్
  • పాటలు: ఆరుద్ర
  • సంగీతం: ఎం.రంగారావు

పాటలు మార్చు

క్ర.సం. పాట పాడినవారు రచన
1 మందార పుష్పము నీవు ఆరుద్ర

కథ మార్చు

సుజాత రంగస్థల నటి. బాబాయి సంస్థకు ఆమె జీవం. సుజాత నటించే ప్రతి నాటకానికి వసూళ్ళు దండిగా ఉంటాయి. సంపన్నుల బిడ్డ నాగరాజు తండ్రిని ధిక్కరించి సుజాతను పెళ్ళి చేసుకుని పట్నంలో కాపురం పెడతాడు.తండ్రి పోయిన తరువాత నాగరాజు సుజాతను ఆధునికంగా తీర్చిదిద్దాలనుకుంటాడు. అదే సమయంలో బాబాయి నాటక సంస్థ ఆ పట్టణానికి రావడం, సుజాత వెళ్ళిన సభలో తన పుట్టుపూర్వోత్తరాలు చెప్పడమే కాకుండా నాటకంలో పాత్రపోషణ చేయడం నాగరాజుకు తల కొట్టేసినట్లవుతుంది. కొడుకుని తీసుకుని నాగరాజు వేరే పట్టణానికి వెళ్ళిపోతాడు. సుజాత పెద్ద సినిమా తార అవుతుంది. డబ్బు పేరు పుష్కలంగా లభిస్తాయి. శేఖర్ అనే కుర్రాడికి సుజాత అంటే ఇష్టమవుతుంది. సుజాతకు కుడా శేఖర్ అంటే ఇష్టమే. అయితే ఒక తల్లిలా అతనితో ప్రవర్తిస్తుంది. నాగరాజును తన కొడుకును చూపించమని సుజాత వేడుకుంటుంది. అయితే నాగరాజు అందుకు అంగీకరించడు. ఈ మానసిక ఘర్షణను తట్టుకోలేక ఆమె కోమాలోకి వెళ్ళిపోతుంది. చివరకు ఆత్మహత్యకు పాలుపడుతుంది. తను ఆరాధించే నటే తన తల్లి అని శేఖర్‌కు చివరలో తెలుస్తుంది. కానీ సుజాత తన కొడుకు శేఖరే అని తెలియని స్థితిలో మరణిస్తుంది[1].

మూలాలు మార్చు

  1. వి.ఆర్. (9 October 2020). "చిత్ర సమీక్ష: మహానటి". ఆంధ్రపత్రిక దినపత్రిక. Retrieved 12 February 2020.[permanent dead link]