మహానాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా మే 28న తెలుగుదేశం పార్టీ చేసుకునే ఉత్సవం. మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు సంబంధించి ప్రతీ సంవత్సరం జరిగే పార్టీ కార్యక్రమం.[1] ఈ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను ఏజెండాలను వివిధ సమస్యలపై పార్టీ తీర్మాలను ప్రకటిస్తారు. ఇది మూడు రొజులు కార్యక్రమం. దీనికి రాష్ట్రం నలుమూలల నుంచి కార్యకర్తలు వస్తారు. ఈ కార్యక్రమంలోనే పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో ‘మహానాడు’ ముఖ్యమైంది. ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 వరకు మహానాడును జరుపుతుంటారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగుదేశం కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు. [2]

తెలుగుదేశం పార్టీ జెండా

పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ప్రతి ఏటా వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జన్మదినం నాడు మహానాడు కార్యక్రమాలను ఏదో ఒక నగరంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.. ఈ సమావేశాల్లో రాబోయే సంవత్సర కాలంలో పార్టీ నిర్వహించాల్సిన కార్యాచరణ ప్రణాళికను తయారవుతుంది.[3]

విశేషాలు మార్చు

1985, 1991, 1996 సంవత్సరాల్లో మహానాడును నిర్వహించలేదు. 1985, 1996 సమయాల్లో టీడీపీ అధికారంలో ఉంది. ఆ తర్వాత 2012లో కూడా టీడీపీ మహానాడును వాయిదా వేసింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.[4]

2018 లో జరిగిన మహానాడు చివరిసారి సెషన్లలో, పార్టీ అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, పట్టిసీమ ప్రాజెక్ట్, ఐటి, దాని ప్రమేయం, నీటి మెరుగుదల, రైతుల అభ్యున్నతి, రాజకీయాలలో మహిళల ప్రమేయం, సాధికారత మొదలైన వాటి గురించి చర్చించింది.[5]

ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు మార్చు

తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ వేడుకలు హైదరాబాదులో 2022 మార్చి 29న, మహానాడును విజయవాడలో 2022 మే 28న జరగనున్నాయి. ఈ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవాలు ఈ ఏడాదిపాటు వేడుకగా జరగనున్నాయి.[6]

మూలాలు మార్చు

  1. Harikrishna (2020-05-26). "రేపటి నుంచే టీడిపి మహానాడు..!ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుండి పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వనున్న చంద్రబాబు". telugu.oneindia.com. Archived from the original on 2020-06-28. Retrieved 2020-06-25.
  2. "గెలిచినా, ఓడినా... మహానాడు నిర్వహించడం కష్టమే... ఎందుకంటే". NamasteAndhra. Archived from the original on 2020-06-25. Retrieved 2020-06-25.
  3. "నేటి నుంచి మహానాడు". www.andhrajyothy.com. Retrieved 2020-06-25.
  4. "A TDP first: No Mahanadu this year". News18. 2012-07-11. Retrieved 2020-06-25.
  5. Bandari, Pavan Kumar (2020-05-26). "History Of TDP Mahanadu: A Political Transformation Of The Party From NTR To Nara Chandrababu Naidu". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2020-06-25.
  6. "హైదరాబాద్‌లో ఆవిర్భావ వేడుకలు". andhrajyothy. Retrieved 2022-03-04.
"https://te.wikipedia.org/w/index.php?title=మహానాడు&oldid=3959097" నుండి వెలికితీశారు