మహాలక్ష్మి పథకం

2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్బంగా ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ఈ గ్యారంటీలలో ఒకటైన మహాలక్ష్మి పథకంలో భాగాంగా మహిళలకు నెలకు రూ. 2500, తెలంగాణ వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, సిలిండర్‌కు రూ.500 లను అందించనుంది.[1]

మహాలక్ష్మి పథకం
ప్రాంతంతెలంగాణ, భారతదేశం
వెబ్ సైటుమహాలక్ష్మి పథకం అధికారిక జాలగూడు
నిర్వాహకులు, తెలంగాణ ప్రభుత్వం

మహాలక్ష్మి పథకం ప్రయోజనాలు

మార్చు
  • మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం.[2]
  • 200 యూనిట్ల వరకూ ఇళ్లకు ఉచిత విద్యుత్
  • 500 రూపాయల సబ్సిడీ ధరతో సిలిండర్.[3]

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మార్గదర్శకాలు

మార్చు

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకార్యాన్ని 2023 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు, కొండా సురేఖ, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, డీజీపీ రవి గుప్తా తదితరులు పాల్గొన్నారు.[4]

  • తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ పల్లె వెలుగు,ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో ఉచితంగా బస్సు ప్రయాణం ఉంటుంది.
  • స్థానికత ధ్రువీకరణ కోసం గుర్తింపు కార్డులను ప్రయాణ సమయంలో కండక్టర్లకు చూపించాలి.
  • ప్రతి మహిళకు జీరో టికెట్ మంజూరు చేయబడుతుంది.
  • వయసుతో పని లేకుండా అన్నీ వయస్సుల మహిళలు, అమ్మాయిలు, బాలికలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ నిర్ణయం వర్తిస్తుంది.
  • ట్రాన్స్ జెండర్స్ కూడా ప్రయాణం ఉచితం.
  • రాష్ట్రంలోని ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. అపరిమిత కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు.
  • రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఉచితంగా ప్రయాణించి ఆ తర్వాత టికెట్‌ తీసుకోవలసి ఉంటుంది.
  • మొదటి వారం రోజులు ఎలాంటి ఐడీ కార్డు లేకుండానే ప్రయాణం
  • మహిళల ప్రయాణానికి అయ్యే ఖర్చును ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది.

500 రూపాయల సిలిండర్ మార్గదర్శకాలు

మార్చు

ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను 2024 ఫిబ్రవరి 27న సచివాయలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించాడు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పథకాలను సచివాలయంలో ప్రారంభించారు.[5]

  • ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు
  • తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అర్హులు
  • గ్యాస్ కనెక్షన్ మహిళా పేరు మీద ఉండాలి
  • గడిచిన మూడు సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం
  • సబ్సిడీ గ్యాస్ పేమెంట్ ను ప్రభుత్వం ప్రతినెలా ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపు
  • గ్యాస్ కనెక్షన్ తో బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయి ఉండాలి
  • సిలిండర్ డెలీవరీ సమయంలో లబ్ధిదారులు పూర్తి డబ్బులు చెల్లించాలి.
  • గ్యాస్ కంపెనీలు లబ్ధిదారుల ఖాతాల్లోకి సబ్బీడి డబ్బులను జమ చేస్తాయి.
  • డాక్యుమెంట్లు సరిగ్గా లేని వారికి పక్కన పెట్టిన అధికారులు. వీరికి మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశం.[6]

మూలాలు

మార్చు
  1. BBC Telugu (8 December 2023). "మహాలక్ష్మి పథకం: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి." Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  2. Eenadu (9 December 2023). "తెలంగాణలో మహాలక్ష్మి, చేయూత పథకాలు ప్రారంభం". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  3. "రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌.. జీవో విడుదల చేసిన ప్రభుత్వం". 27 February 2024. Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  4. Hindustantimes Telugu (8 December 2024). "తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్.. రేపట్నుంచే RTC బస్సుల్లో ఫ్రీగా ప్రయాణం, ఇవిగో గైడ్ లైన్స్". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  5. BBC News తెలుగు (27 February 2024). "తెలంగాణ-మహాలక్ష్మి పథకం: రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పొందడం ఎలా?". Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.
  6. The Economic Times Telugu (27 February 2024). "రూ. 500కే గ్యాస్ సిలిండర్.. రేపటి నుంచే.. మొదటగా మొత్తం డబ్బులు చెల్లించాల్సిందే." Archived from the original on 27 February 2024. Retrieved 27 February 2024.