పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. 2014 నుండి 2019 వరకు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి 16వ లోక్‌సభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి


రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
7 డిసెంబర్ 2023 - ప్రస్తుతం

పదవీ కాలం
3 డిసెంబర్ 2023 - ప్రస్తుతం
ముందు కందాల ఉపేందర్‌ రెడ్డి
నియోజకవర్గం పాలేరు

పదవీ కాలం
2014-2019
ముందు నామా నాగేశ్వరరావు
తరువాత నామా నాగేశ్వరరావు
నియోజకవర్గం ఖమ్మం

వ్యక్తిగత వివరాలు

జననం నవంబరు 4, 1959
నారాయణపురం, కల్లూరు మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
బీఆర్ఎస్
తల్లిదండ్రులు రాఘ‌వ‌రెడ్డి, స్వ‌రాజ్యం
జీవిత భాగస్వామి మాధురి
సంతానం కుమారుడు (హర్షారెడ్డి), కుమార్తె (సప్ని).
మతం హిందూ

జీవిత విషయాలు మార్చు

శ్రీనివాస్ రెడ్డి 1959, నవంబరు 4న రాఘ‌వ‌రెడ్డి, స్వ‌రాజ్యం దంపతులకు ఖమ్మం జిల్లా, కల్లూరు మండలంలోని నారాయణపురంలో జన్మించాడు. వ్యవసాయదారుడిగా పనిచేశాడు. 1984లో కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి ఇంటర్ విద్యను, హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్యలో బిఏ డిగ్రీని పూర్తిచేశాడు.[3]

వ్యక్తిగత జీవితం మార్చు

ఈయనకు 1992, మే 8న మాధురితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు (హర్షా రెడ్డి), ఒక కుమార్తె (సప్ని) ఉన్నారు.[4]

సామాజిక కార్యక్రమాలు మార్చు

1985లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రామోదయ పథకంలో పేరువంచ మేజర్‌పై క్రాస్‌వాల్‌ నిర్మాణం చేశాడు. ఆ క్రాస్‌వాల్‌ నిర్మాణం వల్ల 450 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. అలా కాంట్రాక్టర్‌గా మారి ప్రభుత్వం తరపున అనేక నిర్మాణాలు చేశాడు.[4]

రాజకీయ ప్రస్థానం మార్చు

కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా కొనసాగుతూ, వివిధ హోదాల్లో పనిచేశాడు. 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కొంతకాలం తెలంగాణ వైకాపా అధ్యక్షుడిగా ఉన్నాడు. 2014లో జరిగిన 16వ లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీ తరపున ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి, టీడీపీ అభ్య‌ర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందాడు.[5] ఆ తరువాత తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాడు.

2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలలో, 2019 17వ లోక్‌సభ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చాడు.[6] ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను 2023 ఏప్రిల్ 10న బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసింది.[7][8] ఆయన 2023 జూలై 2న  ఖమ్మంలో తెలంగాణ కాంగ్రెస్ జనగర్జన సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా, రాహుల్ గాంధీ ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాడు.[9][10] ఆయన 2023 జూలై 14న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ (టీ-పీసీసీ) ప్రచార కమిటీ కో-ఛైర్మన్‌గా నియమితులయ్యాడు.[11]

ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో పాలేరు అభ్యర్థిగా ప్రకటించగా[12][13], పాలేరు ఎమ్మెల్యేగా గెలిచి[14], రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబరు 7న రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి[15][16], డిసెంబరు 14న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు.[17]  

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 2023 డిసెంబరు 18న మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గల ఇన్‌చార్జ్‌గా కాంగ్రెస్ పార్టీ నియమించగా,[18] డిసెంబరు 24న వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[19]

నిర్వహించిన పదవులు మార్చు

 1. 2014, సెప్టెంబరు 1 నుండి 2019 వరకు రవాణా, పర్యాటక, సంస్కృతి శాఖ స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్నాడు.
 2. ఎనర్జీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సంప్రదింపుల కమిటీలో సభ్యులుగా పనిచేశాడు.[20]

మూలాలు మార్చు

 1. The Times of India, Politics. "PONGULETI SRINIVASA REDDY : Bio, Political life, Family & Top stories". Archived from the original on 29 February 2020. Retrieved 31 July 2020.
 2. Eenadu (8 December 2023). "అమాత్య యోగం.. సాగాలి అభివృద్ధి యాగం". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
 3. "Members : Lok Sabha (Sixteenth Lok Sabha Members Bioprofile)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-21.
 4. 4.0 4.1 సాక్షి, పాలిటిక్స్ (19 May 2019). "నన్ను తీర్చిదిద్దింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి." Sakshi. Archived from the original on 22 May 2019. Retrieved 31 July 2020.
 5. "Ponguleti Srinivasa Reddy(Yuvajana Sramika Rythu Congress Party):Constituency- KHAMMAM(TELANGANA) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2021-04-18. Retrieved 2021-12-21.
 6. "Constituencywise-All Candidates". Archived from the original on 18 May 2014. Retrieved 30 July 2020.
 7. Prajasakti (10 April 2023). "బిఆర్‌ఎస్‌ నుండి జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సస్పెన్షన్‌" (in ఇంగ్లీష్). Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
 8. Eenadu (10 April 2023). "భారాస నుంచి జూపల్లి, పొంగులేటి సస్పెన్షన్‌". Archived from the original on 10 April 2023. Retrieved 10 April 2023.
 9. Sakshi (2 July 2023). "రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
 10. A. B. P. Desam (2 July 2023). "కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాహుల్ గాంధీ". Archived from the original on 5 July 2023. Retrieved 5 July 2023.
 11. Andhra Jyothy (15 July 2023). "పీసీసీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటి". Archived from the original on 15 July 2023. Retrieved 15 July 2023.
 12. Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్‌ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
 13. Eenadu (28 October 2023). "ఆచితూచి హస్తం అడుగులు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
 14. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
 15. Andhrajyothy (7 December 2023). "రేవంత్‌తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం". Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
 16. V6 Velugu (8 December 2023). "తెలంగాణ మంత్రుల ప్రొఫైల్స్". Archived from the original on 16 January 2024. Retrieved 16 January 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 17. Namaste Telangana (14 December 2023). "మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి". Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
 18. Eenadu (18 December 2023). "తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిల నియామకం". Archived from the original on 18 December 2023. Retrieved 18 December 2023.
 19. Andhrajyothy (24 December 2023). "ఉమ్మడి జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల నియమాకం". Archived from the original on 24 December 2023. Retrieved 24 December 2023.
 20. "పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి". www.oneindia.com. Archived from the original on 2021-11-03. Retrieved 2021-12-21.