మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం
మహావీర్ హరిణ వనస్థలి జాతీయవనం హైదరాబాద్ నగరానికి తూర్పు శివార్లలో విజయవాడ జాతీయ రహదారి 65కి ఆనుకొని ఆటోనగర్ ప్రక్కన 3,800 ఎకరాల స్థలంలో నెలకొని ఉంది. హైదరాబాదు పాలకులలో చివరి రాజైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తాను వేటాడడానికి ఏర్పాటు చేసుకున్న దట్టమైన అటవీ ప్రాంతమే ఈ వనం. దీనిని 1975 లో జైనముని మహావీరుని నిర్వాణ 2500 వ వార్షికోత్సవాన మహావీర్ హరిణ వనస్థలి పేరుతో జాతీయవనంగా ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా కృష్ణ జింకలు, నెమళ్లు, అడవి పందులు, కుందేళ్లు, వివిధ రకాల పాములు, పక్షులు, సీతా కోక చిలుకలు ఉన్నాయి. చిలుకల కొరకు ఇందులో ప్రత్యేక పార్కు ఉంది. ఇందులో అనేక ఔషధ మొక్కలు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న ప్రత్యేక వృక్షాలు దట్టమైన కారడవులను తలపిస్తాయి. పర్యటకుల వినోదంతో పాటు వసతి కొరకు ఇందులోనే వసతి గృహాలు ఉన్నాయి.
మహావీర్ హరిణ వనస్థలి జాతీయ వనం | |
---|---|
ప్రదేశం | తెలంగాణ |
విస్తీర్ణం | 14.59 కి.మీ2 (5.63 చ. మై.) |
స్థాపితం | 1975 |
వృక్షజాలం
మార్చు- గడ్డి భూములతో కూడిన పొడి ఆకురాలు అడవి
- గంధపు చెట్లు, రోజ్‌వుడ్, టేకు తదితరాలు
జంతుజాలం
మార్చు- చిరుతపులి, కృష్ణ జింక, అడవి పంది, నెమలి, ముళ్ళ పంది, పునుగు పిల్లి
- 30 జాతుల సరీసృపాలు, 120 పైచిలుకు రకాల పక్షులు