నెమలి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
నెమలి | |
---|---|
![]() | |
పురివిప్పి నాట్యమాడుతున్న నెమలి. | |
శాస్త్రీయ వర్గీకరణ | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Genus: | Pavo, Afropavo
|
జాతులు | |
పావో క్రిస్టేటస్ |
నెమలి (ఆంగ్లం : Peacock) భారత దేశ జాతీయ పక్షి. నెమలిని చూడంగానే మనకు కొట్టొచ్చినట్లు కనబడేది వాటి అందమయిన ఈకలు. మగ నెమలికి మాత్రమే ఇటువంటి పొడవాటి ఈకలు ఉంటాయి. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
ఆహారం సవరించు
నెమలి శాకాహారము, మాంసాహారము రెండిటినీ ఆహారంగా స్వీకరిస్తుంది. పూవుల రెక్కలు, మొక్క భాగాలు, విత్తనం మొలకలు, కీటకాలు, అప్పుడప్పుడూ బల్లి వంటి సరీసృపాలను మరియూ కప్పలు వంటి ఉభయచరాలను ఆహారంగా భుజిస్తాయి.[1][2]
జాతులు సవరించు
కాంగో నెమలి (ఆఫ్రోపావో కాంగోలెన్సిస్) - ఇది మధ్య ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో మనకు కనిపిస్తుంది.
భారత నెమలి (పావో క్రిస్టేటస్) - ఈ నెమలి మనకు భారత ఉప ఖండంలో తరుచుగా కనిపిస్తుంది. ఈ జాతి నెమలినే భారత, శ్రీలంక దేశాలు తమ జాతీయ పక్షిగా ఎన్నుకున్నాయి.
ఆకుపచ్చ నెమలి (పావో మ్యూటికస్) - ఇది తూర్పు మయన్మారు నుండి జావా వరకు గల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ జాతి నెమలి వేటవలన, నివాసయోగ్యమయిన ప్రాంతాలు కరువవటం వలన అంతరించే దశకు చేరుకుంటున్నాయి. అంతరిస్తుందని భావిస్తున్న ఆకుపచ్చ రంగు నెమలి ఐదు వేరు వేరు జాతుల సమ్మేళనం, కానీ ప్రస్తుతం వీటిని ఒకే జాతికి చెందిన మూడు ఉప జాతులుగా వర్గీకరించారు.
నివశించే ప్రదేశాలు సవరించు
నెమలి ఎక్కువగా గడ్డిమైదానాలలో నివసిస్తుంటాయి.
పించం - ఈకలు సవరించు
మగ నెమల్లకు అందమయిన మెరిసే నీలం-ఆకుపచ్చ లేదా ఆకుపచ్చ రంగు పించం ఉంటుంది. మగ నెమలికి వెనుక భాగంలో తోకలాగా కనిపించేది, దాని పొడావాటి ఈకలు. ఆ ఈకలకు కళ్ళు ఉంటాయి, వాటి అందమంతా అవి పురివిప్పి నాట్య మాడుతున్నప్పుడే కనిపిస్తాయి.
ఆడ నెమలి ఆకుపచ్చ, గోధుమ, బూడిద రంగులలో ఉండే పించం ఉంటుంది. మగ నెమల్ల వలె ఆడనెమలికి పొడావాటి తోక లాంటి ఈకలు ఉండవు, కానీ వీటికి ఒక కొప్పూంటుంది.
నెమలి పించాలలోని ఆ అత్బుత రంగులకు కారణం, వాటి ఈకలమీద పేర్చినట్లు ఉండే సన్నని పీచు లాంటి పదార్దాలే. అక్కడ కనిపించే వివిధ రంగులకు వాటి అమరికలోని నిడివి తేడాలే కారణం. గోధుమ రంగు ఈకలకు, ఎరుపు, నీలం రంగులు అవసరం - వీటిలో ఒక రంగు అమరిక వలన సృస్టింపబడగా, రెండొవది హద్దులలో ఉండే ఇంకో అమరిక వలన వచ్చే కాంతి పరావర్తనం వలన ఏర్పడుతుంది. ఇటువంటి పరావర్తనం వలనే నెమలి నాట్యమాడుతున్నప్పుడు వాటి పించాలు మనకు వివిధ కోణాలలో వివిధ రంగులుగా కనిపిస్తాయి.[3]
ఇతర జాతులతో అంటకట్టించటం వలన వేరు వేరు రంగుల ఈకలున్న నెమల్లు మనకు కనిపిస్తాయి. అటువంటి వాటిలో తెల్ల శరీరం కలవి చెప్పుకోతగ్గవి.
ప్రవర్తన సవరించు
దాదాపు 2000 సంవత్సరాల కాలం నుండి మనుషుల పోషణలో నెమలి ఉన్నదని భావిస్తున్నారు.[4] అయినా కూడా నెమలిలో పెంపుడు జంతువులలో కనిపించే లక్షణాలు చాలా తక్కువగా వంటపడ్డాయి. కాకపోతే వీటి నుండి ఇతర కొత్త జాతులు సృష్టింపబడ్డాయి.
సాధారణంగా నెమలి జగడాల మారి, ఇతర పసుపక్షాదులతో అంతత్వరగా కలవవు.
జతకట్టడం సవరించు
జతకట్టుటకు సిద్దపడుతున్న మగ నెమలి అరుపును వినండి.నెమళ్ళు ఎక్కువగా గుంపులు గుంపులుగా నివసిస్తుంటాయి.నెమళ్ళ గుంపును[permanent dead link] ఇంగ్లీష్ లో పార్టీ party అంటారు
హిందూ పురాణాలలో సవరించు
మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒక నెమలి ఈకను తన తలలో అలంకారంగా ధరించేవాడు. సుబ్రహ్మణ్య స్వామి నెమలిని తన వాహనంగా ఉపయోగిస్తాడు.
చిత్రమాలిక సవరించు
-
ఆడ నెమలి
-
మామూలు సమయాలలో మగ నెమలి తోక/ఈకలు.
-
నెమలి ఈకలు దగ్గర నుండి.
-
తెల్ల నెమలి.
-
భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, సియర్సోల్ రాజ్బరి యొక్క ఇత్తడి రథంపై నెమలి
మూలాలు సవరించు
- ↑ "నెమలిని పెంచుకునే విధానము". Archived from the original on 2006-04-15. Retrieved 2006-04-06.
- ↑ నెమలికి వచ్చే వ్యాధులు
- ↑ స్టీవెన్ కె. బ్లావు, నెమలి ఈకలలో రంగులు ఎలా ఏర్పడతాయో వివరించే వ్యాసం Archived 2006-06-22 at the Wayback Machine, ఫిసిక్స్ టుడే, జనవరి 2004.
- ↑ "హొనొలులు జంతు సంరక్షణాలయంవారి సైటులో నెమలి గురించి". Archived from the original on 2006-04-03. Retrieved 2006-04-07.
బయటి లింకులు సవరించు
- ప్రపంచవ్యాప్త పక్షుల టాక్సోనోమిక్ జాబితా 21/02/2003 ప్రకారం.
- నెమలి జాతుల సమాచారనిధి
- పీఫౌల్ టుడే(ఈనాటి నెమలి)
- భారత దేశంలో వివిధ పక్షుల నివాస ప్రాంతాలను గూగుల్ పటములలో చూడండి.