మహా గణపతి దేవాలయం (ఆరిజోనా)

అమెరికా ఆరిజోనాలోని మారికోపాలో ఉన్న హిందూ దేవాలయం.

మహా గణపతి దేవాలయం, అమెరికా ఆరిజోనాలోని మారికోపాలో ఉన్న హిందూ దేవాలయం. ఫీనిక్స్ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని హిందూ భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తోంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్లూరలిజం ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్న ఈ దేవాలయం, యునైటెడ్ స్టేట్స్‌లోని అన్ని మత సంస్థల జాబితాలో చేర్చబడింది.[1]

మహా గణపతి దేవాలయం (ఆరిజోనా)
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:ఆరిజోనా
ప్రదేశం:మారికోపా
అక్షాంశ రేఖాంశాలు:32°57′20″N 112°07′08″W / 32.955630°N 112.118778°W / 32.955630; -112.118778

చరిత్ర మార్చు

అరిజోనాలో నిర్మించబడే కొత్త హిందూ దేవాలయం కోసం 1999లో కాయై ఆధీనంలోని సద్గురు శివయ్య సుబ్రహ్మణ్యస్వామి 1400 ఫౌండ్ల, 4 అడుగుల ఎత్లైన వినాయకుడి విగ్రహాన్ని బహుమతిగా ఇచ్చాడు. 2000 నవంబరులో ఆరిజోనాలోని మహా గణపతి దేవాలయం అధికారికంగా లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది, మతపరమైన సంస్థగా గుర్తింపు పొందింది.[2]

2002లో, మారికోపాలో 15 ఎకరాల భూమి, డబుల్ సైడెడ్ ట్రైలర్‌ను గున్నెల కుటుంబం సంస్థకు విరాళంగా అందించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో 500మంది భక్తులు హాజరై, వేడుకలను ఘనంగా నిర్వహించారు.[3] 2002-2007 మధ్య, ప్రాజెక్ట్ ప్రారంభ దశ కోసం 500,000 డాలర్లు సేకరించబడ్డాయి.

8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దేవాలయ నిర్మాణానికి 2007 ఆగస్టు 25న శంకుస్థాపన జరిగింది. మొదటి దశ భవనానికి 1.5 మిలియన్ డాలర్లు ఖర్చయింది. 26 అడుగుల ఎత్తుతో నాలుగు గోపురాలు నిర్మించబడ్డాయి.[4] 2008 మే నెలలో ఫేజ్ 1 పూర్తయింది, ప్రతిష్ఠించిన దేవాతామూర్తులకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. 2010లో, దేవాలయానికి అదనపు దేవతామూర్తులు, గోపురాలను నిర్మించడానికి ఆలయానికి చెందిన 1,000 మంది అనుచరులు 250,000 డాలర్లు సేకరించారు.[5]

2011లో, హిందూ దేవతలకు సంబంధించిన 4 అదనపు దేవతామూర్తులను స్థాపించారు. 2012లో భవనం లోపలి, వెలుపలి భాగంలో భారతీయ కళాకృతులను చెక్కడానికి శిల్పులను తీసుకువచ్చారు. 2014లో దేవాలయం భారతీయ కళాకృతులతో తన 4 గోపురాలను చెక్కడం పూర్తిచేసింది.[6] 2012లో చాండ్లర్‌లో జరిగిన మతపరమైన సంభాషణ, మతపరమైన వైవిధ్య కార్యక్రమానికి హాజరైన వారి కోసం ప్రార్థనను చదివారు. ఈ కార్యక్రమానికి హెన్రీ సెజుడో హాజరయ్యాడు.[7]

మూలాలు మార్చు

  1. "Maha Ganapati Temple Arizona". Harvard.edu. 2006. Retrieved 2022-03-11.
  2. "Maha Ganapati Temple of Arizona". charitynavigator. Retrieved 2022-03-11.
  3. "mana ganapati temple in arizona". hinduismtoday. 8 March 2002. Retrieved 2022-03-11.
  4. "Work begins on Temple for South Indian Hindus". tucson.com. 27 August 2007. Retrieved 2022-03-11.
  5. Rich, Micheal K. (15 August 2010). "Hindu Temple Expanding In Hidden Valley". inmaricopa. Retrieved 2022-03-11.
  6. "temple history". ganapati. Retrieved 2022-03-11.
  7. Stacie Spring (14 November 2012). "Chandler/Gilbert YMCA prayer breakfast celebrates religious diversity". eastvalleytribune. Retrieved 2022-03-11.