మహిళ క్రికెట్ ప్రపంచ కప్-2017


ఐసిసి మహిళ క్రికెట్ ప్రపంచ కప్ (ICC Women'S Cricket World Cup) అనేది మహిళల ఒక రోజు అంతర్జాతీయ (ODI) క్రికెట్‌కు సంబంధించిన ప్రధాన అంతర్జాతీయ పోటీలను సూచిస్తుంది. ఈ ప్రపంచ కప్‌ను క్రీడా పాలక సంస్థ అంతర్జాతీయ క్రికెట్ సంఘము (ICC) నిర్వహిస్తుంది, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే తుది టోర్నమెంట్‌కు ముందుగా ప్రాథమిక అర్హత పోటీలు జరుగుతాయి. ఈ టోర్నమెంట్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద, అత్యధిక మంది వీక్షించే క్రీడా కార్యక్రమంగా గుర్తింపు పొందింది. అత్యంత ముఖ్యమైన టోర్నమెంట్‌గా, ఈ క్రీడలో అత్యున్నత సాధనగా ఐ.సి.సి (ICC) దీనిని గుర్తిస్తుంది. మొదటి మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ను 1973 నుంచి ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నారు.

ICC Cricket Women's World Cup
నిర్వాహకుడుInternational Cricket Council
ఫార్మాట్One Day International
తొలి టోర్నమెంటు1973, England
తరువాతి టోర్నమెంటు2021
టోర్నమెంటు ఫార్మాట్multiple (refer to article)
జట్ల సంఖ్య08
ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లాండు
అత్యంత విజయవంతమైన వారు ఆస్ట్రేలియా (6 titles)
అత్యధిక పరుగులు ఇంగ్లాండు Tammy Beaumont (410)
అత్యధిక వికెట్లు దక్షిణాఫ్రికా Dane van Niekerk (15)
వెబ్‌సైటుOfficial site
2017 Cricket World Cup

చరిత్ర

మార్చు

ప్రపంచ కప్ అర్హత పోటీల్లో విజయవంతమైన దేశాలు పాల్గొంటాయి. ఆటల పోటిలో విజేతలుగా నిలిచిన జట్లలో ఆస్ట్రేలియా అత్యంత విజయవంతమైన జట్టుగా గుర్తింపు పొందింది, ఈ జట్టు ఆరుసార్లు ఈ టోర్నీ టైటిళ్లను గెలుచుకుంది. ఇంగ్లాండ్ మూడుసార్లు టైటిళ్లు గెలుచుకోగా, న్యూజిలాండ్ ఒక్కసారి టైటిల్‌ను సొంతం చేసుకున్నాయి.[1]

తేది-వేదిక

మార్చు

2017 మహిళ క్రికెట్ ప్రపంచ కప్ 24 జూన్23 జూలై మధ్య తేదీల్లో జరిగింది. ఈ టోర్నమెంట్‌ ఇంగ్లాండ్లో జరిగింది. ఈ టోర్నమెంట్‌లో 08 దేశాలు పాల్గొన్నాయి.

వివరాలు

మార్చు

2017 మహిళ క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరిగింధి. ఇందులో 9 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లాండ్ గెలుపొందింది. [2]

మూలాలు

మార్చు
  1. http://www.topendsports.com/events/cricket-world-cup/women/results.htm
  2. The Hindu July 24,2017(Web Page)

బయటి లింకులు

మార్చు