మహిషమర్దని దేవాలయం
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మహిషమర్దని దేవాలయం సముదాయం ఒడిషా లోని బాలాసోర్ జిల్లాలోని "బాలాసోర్ పాండి చౌక్"కు 2.5 కి.మీ దూరంలో గల షేర్ ఘర్ లో ఉంది. పురావస్తు సర్వేలో అనేక శిథిల చిత్రాలు భద్రపరచబడ్డాయి.
మహిషమర్దని దేవాలయ సముదాయం | |
---|---|
స్థానం | |
దేశం: | భారత దేశము |
రాష్ట్రం: | ఒడిషా |
జిల్లా: | బాలేశ్వర్ |
ప్రదేశం: | Shergarh |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | మహిషమర్దని |
ప్రధాన పండుగలు: | నవరాత్రి , దసరా |
ఆచారాలు
మార్చుఇందులో ప్రస్తుత పూజారులు పండా బ్రాహ్మణులకు చెందినవారు.ఈ ఆలయం ఒక సేనాపతి కుటుంబం పోషణలో ఉంది. ఇందులో దుర్గాదేవి ఎనిమిది చేతులతో మహిషాసురుడిని వధించునట్లు ఉంది. ఈ సముదాయంలో శివుని దేవాలయం కూడా ఉంది.
వాస్తుశాస్త్రం
మార్చుఈ దేవాలయం 11 వ శతాబ్దానికి చెందినది. ఇది సోమవంశీ క్షత్రియుల కాలం నాటిది. ఈ దేవాలయం 19 వ శతాబ్దంలో పునరుద్ధరింపబడింది. ఈ దేవాలయ నిర్మాణానికి కంకరను ఉపయోగించారు. శిల్పాల నిర్మాణానికి క్లోరైట్ ఉపయోగించారు. ఈ దేవాలయం పశ్చిమ ముఖంగా ఉంది. ఈ దేవాలయంలో సూర్యుడు, యితర దేవతలైన గణేశుడు, కార్తికేయుడు చిత్రాలు కూడా కనిపిస్తాయి. .
మూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు