మహీంద్రా విశ్వవిద్యాలయం

మహీంద్రా విశ్వవిద్యాలయం (ఆంగ్లం: Mahindra University) తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో ఉన్న ఒక భారతీయ ప్రైవేట్ యూనివర్శిటీ. ఈ విద్యా సంస్థ‌ను అత్యున్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో పారిశ్రామిక దిగ్గ‌జం మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ద్వారా 2020లో స్థాపించబడింది.[1][2][3] వ‌ర్సిటీ వ్య‌వ‌స్థాప‌కుడు ఆనంద్ మ‌హీంద్రా కాగా దీనిని మహీంద్రా ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ (MEI) స్పాన్సర్ చేస్తుంది.

మ‌హీంద్రా యూనివ‌ర్సిటీ
రకంప్రైవేట్ యూనివర్సిటీ
స్థాపితం2020; 4 సంవత్సరాల క్రితం (2020)
స్థానంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

తొలి స్నాత‌కోత్స‌వం

మార్చు

ఈ యూనివ‌ర్సిటీకి చెందిన తొలి బ్యాచ్ విద్యార్థులు త‌మ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా 2022 జులై 23న వ‌ర్సిటీ క్యాంప‌స్‌లో తొలి స్నాత‌కోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజ‌ర‌యి విద్యార్థుల‌కు ప‌ట్టాలు అంద‌జేశారు.[4] గౌరవఅతిథిగా విచ్చేసిన భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్లా తో పాటు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి ఆనంద్‌ మహీంద్రా, టెక్‌ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ, మహీంద్రా విద్యా సంస్థల ఛైర్మన్‌ వినీత్‌నాయర్‌, వర్సిటీ ఉపకులపతి మేడూరి యాజులు తదితరులు పాల్గొన్నారు.

మూలాలు

మార్చు
  1. "State Private University Telangana". University Grants Commission (India). Retrieved 3 January 2021.
  2. "Mahindra Group launches university for interdisciplinary learning". Livemint. 24 July 2020. Retrieved 3 January 2021.
  3. "Mahindra Group launches university in Hyderabad for interdisciplinary programmes". E Kumar Sharma. Business Today. 24 July 2020. Retrieved 3 January 2021.
  4. "ఆర్థికాభివృద్ధి.. ఉద్యోగ కల్పనే ప్రాధాన్యం కావాలి". web.archive.org. 2022-07-24. Archived from the original on 2022-07-24. Retrieved 2022-07-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)