మహేంద్ర కపూర్

భారతీయ గాయకుడు

మహేంద్ర కపూర్ (ఆంగ్లం :Mahendra Kapoor) (జనవరి 9, 1934, అమృత్‌సర్, పంజాబ్ - సెప్టెంబరు 27 2008, ఒక భారతీయ నేపథ్య గాయకుడు.

మహేంద్ర కపూర్
MAHENDRA KAPOOR
MAHENDRA KAPOOR
వ్యక్తిగత సమాచారం
జననం (1934-01-09)1934 జనవరి 9
ప్రాంతము అమృత్‌సర్, భారతదేశం
మరణం 2008 సెప్టెంబరు 27
సంగీత రీతి నేపథ్య గేయాలు
వృత్తి గాయకుడు
వాయిద్యం నేపథ్య గాయకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1956–1999

దాదాపు ఐదు దశాబ్దాలు క్రియాశీలకంగా వుండి, అనేక ప్రాంతీయ భాషలలో కొన్ని వేలకు పైగా పాటలు పాడాడు. ఇతని పాటలలో 'చలో ఎక్ బార్ ఫిర్ సే అజ్‌నబీ బన్ జాయేఁ హమ్ దోనోఁ' (గుమ్రాహ్), 'నీలే గగన్ కే తలే' (హమ్‌రాజ్) ముఖ్యమైనవి. మనోజ్ కుమార్ కొరకు పాడిన పాట "మెరే దేశ్ కీ ధర్తీ" (ఉప్‌కార్) దేశభక్తి గీతం, ఇటు మనోజ్ కుమార్ కు అటు మహేంద్ర కపూర్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది.[1]

ముహమ్మద్ రఫీ, మహేంద్ర కపూర్ గొంతు ఒకేలా అనిపిస్తుంది. కొన్ని పాటలైతే ముహమ్మద్ రఫీ పాడారా లేక మహేంద్ర కపూర్ పాడారా అనే సందిగ్దం కలుగుతోంది.

సెప్టెంబరు 27, 2008 న గుండెపోటుతో మరణించాడు. ఇతనికి, భార్య ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నాడు.[2]

ప్రఖ్యాత పాటలు మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు