మహ్మద్ జాహిద్

పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్

మహ్మద్ జాహిద్ (జననం 1976, ఆగస్టు 2) పాకిస్తాన్ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, కుడిచేతి ఫాస్ట్ బౌలర్ గా రాణించాడు.

మహ్మద్ జాహిద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహ్మద్ జాహిద్
పుట్టిన తేదీ (1976-08-02) 1976 ఆగస్టు 2 (వయసు 48)
గగ్గు మండి, పంజాబ్, పాకిస్తాన్
ఎత్తు190 cమీ. (6 అ. 3 అం.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబౌలర్, కోచ్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 144)1996 నవంబరు 28 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2003 జనవరి 2 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 115)1996 డిసెంబరు 8 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2002 నవంబరు 30 - జింబాబ్వే తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 5 11
చేసిన పరుగులు 7 15
బ్యాటింగు సగటు 1.39 7.50
100లు/50లు 0/0 0/0
అత్యధిక స్కోరు 6* 7*
వేసిన బంతులు 792 512
వికెట్లు 15 10
బౌలింగు సగటు 33.46 39.10
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0
అత్యుత్తమ బౌలింగు 7/66 2/20
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/–
మూలం: ESPNCricinfo, 2017 ఫిబ్రవరి 4

1996లో న్యూజిలాండ్‌పై పదకొండు వికెట్లు తీసి, అంతర్జాతీయ అరంగేట్రంలోనే పది వికెట్లు తీసిన మొదటి పాకిస్థానీ క్రికెటర్ గా రికార్డు సాధించాడు.[2]

కెరీర్

మార్చు

2003 జనవరి వరకు ఆడటం కొనసాగించాడు. 1996లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో 11 వికెట్లు తీశాడు. ఇందులో రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులకు 7 వికెట్లు ఉన్నాయి.[3] అరంగేట్రంలోనే 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి పాకిస్థానీ క్రికెటర్ గా నిలిచాడు.

ప్రస్తుతం

మార్చు

జాహిద్ లివర్‌పూల్ & డిస్ట్రిక్ట్ క్రికెట్ పోటీలో లివర్‌పూల్‌లోని సెఫ్టన్ పార్క్ క్రికెట్ క్లబ్ కోసం క్లబ్ క్రికెట్ ఆడాడు. 2014 సీజన్‌లో సౌత్ యార్క్‌షైర్ క్రికెట్ లీగ్‌లో విస్టన్ క్రికెట్ క్లబ్ తరపున కూడా ఆడాడు.[4] 2020 ఆగస్టులో లాహోర్‌లోని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హై పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో బౌలింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. 2021 ఫిబ్రవరి 24న బౌలింగ్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.

మూలాలు

మార్చు
  1. "Mohammad Yousuf, Mohammad Zahid appointed to High Performance centre as batting, bowling coaches". ESPNcricinfo.
  2. "England are Biffed". ESPN Cricinfo. 2 August 2005. Retrieved 2023-09-12.
  3. "2nd Test: Pakistan v New Zealand at Rawalpindi, Nov 28 – Dec 1, 1996". espncricinfo. Retrieved 2023-09-12.
  4. "Sefton Park CC". seftonpark.play-cricket.com.

బాహ్య లింకులు

మార్చు