మహ్మద్ తస్లీముద్దీన్
మహ్మద్ తస్లీముద్దీన్ (4 జనవరి 1943 - 17 సెప్టెంబర్ 2017) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బీహార్ శాసనసభకు ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఆ తరువాత కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం, అరారియా లోక్‌సభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మహ్మద్ తస్లీముద్దీన్ | |||
| |||
పదవీ కాలం 16 మే 2014 – 17 సెప్టెంబర్ 2017 | |||
ముందు | ప్రదీప్ కుమార్ సింగ్ | ||
---|---|---|---|
తరువాత | సర్ఫరాజ్ ఆలం | ||
నియోజకవర్గం | అరారియా | ||
పదవీ కాలం 2004 – 2009 | |||
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సహాయ మంత్రి
| |||
పదవీ కాలం జూన్ 1996 – జూలై 1996 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సిసౌనా, బీహార్, బ్రిటిష్ ఇండియా | 1943 జనవరి 4||
మరణం | 2017 సెప్టెంబరు 17 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 74)||
రాజకీయ పార్టీ | రాష్ట్రీయ జనతా దళ్ | ||
తల్లిదండ్రులు | అమ్జద్ అలీ, బీవీ సాబుజన్ | ||
జీవిత భాగస్వామి | అఖ్తరీ బేగం (m. 1949) | ||
సంతానం | 5 (ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు) | ||
నివాసం | అరారియా |
రాజకీయ జీవితం
మార్చు- 1959: సిసౌనా గ్రామ పంచాయతీ సర్పంచ్
- 1964: ముఖియా, గ్రామ పంచ్యాత్, సిసౌనా, జోకిహత్
- 1969-89, 1995-96 & 2002 - 2004: బీహార్ శాసనసభ సభ్యుడు (ఎనిమిది సార్లు)
- 1977-80: పార్లమెంటరీ కార్యదర్శి, బీహార్ ప్రభుత్వం
- 1985-1989 : జనతా పార్టీ ఉపాధ్యక్షుడు, బీహార్
- 1989: 9వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
- 1989-91: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
- 1989-97: జనతాదళ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
- 1996: 11వ లోక్‌సభకు 2వ సారి ఎన్నికయ్యాడు
- జూన్-జూలై 1996: హెచ్‌డి దేవెగౌడ మంత్రివర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
- 1996-98: హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- వక్ఫ్ బోర్డుపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడు
- రాష్ట్రీయ జనతాదళ్ ప్రధాన కార్యదర్శి
- 1998: 12వ లోక్‌సభకు 3వ సారి
- 1998-99: రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- రైల్వే కన్వెన్షన్ కమిటీ సభ్యుడు & సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక మంత్రిత్వ శాఖ
- ఫిబ్రవరి 2000: బీహార్ శాసనసభ్యుడు
- 2000-2004: హౌసింగ్ శాఖ మంత్రి
- 2004: 14వ లోక్‌సభకు 4వసారి ఎంపీగా ఎన్నికయ్యారు
- మే 2004 - 2009: కేంద్ర వ్యవసాయ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి
- 2014: 16వ లోక్‌సభకు 5వసారి ఎంపీగా ఎన్నికయ్యాడు
- 1 సెప్టెంబర్ 2014 - 17 సెప్టెంబర్ 2017: ప్రభుత్వ హామీల కమిటీ సభ్యుడు
- రసాయనాలు, ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
- గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ & తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడు
- 29 జనవరి 2015 - 17 సెప్టెంబర్ 2017: సాధారణ ప్రయోజనాల కమిటీ సభ్యుడు
మరణం
మార్చుమహ్మద్ తస్లీముద్దీన్ 2017 సెప్టెంబర్ 17న చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో అక్కడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[1][2][3]
మూలాలు
మార్చు- ↑ The Indian Express (18 September 2017). "Voice of Seemanchal Mohammed Taslimuddin dies at 74" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ Financialexpress (18 September 2017). "Who was Mohammed Taslimuddin, RJD strongman and voice of Seemanchal who died at 74 on Sunday" (in ఇంగ్లీష్). Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.
- ↑ "Veteran RJD leader and former Union minister Mohammad Taslimuddin dies at 74". 17 September 2017. Archived from the original on 1 August 2024. Retrieved 1 August 2024.