మాగంటి వెంకటేశ్వరరావు

ఏలూరు నుండి 16వ లోక్ సభ సభ్యులు. తెలుగుదేశం పార్టీ.

మాగంటి వెంకటేశ్వరరావు (బాబు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 భారత సార్వత్రిక ఎన్నికలలో ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున లోక్‌సభ సభ్యునిగా గెలుపొందాడు.[1] ఆయన సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రసిద్ధుడు. ఆయన కొల్లేరు ప్రాంత గ్రామాలకు త్రాగునీటిని ట్యాంకర్ల ద్వారా పంపిణీ చేస్తూంటాడు. పేద, వికలాంగ ప్రజలకు ట్రై సైకిళ్ళను కూడా అందజేశాడు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉపకార వేతనాలను కూడా అందిస్తుంటాడు. ఎం.ఆర్.సి ట్రస్టు ద్వారా వైద్య క్యాంపులు నిర్వహిస్తుంటాడు.[2]

మాగంటి వెంకటేశ్వరరావు

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2014
నియోజకవర్గం ఏలూరు

వ్యక్తిగత వివరాలు

జననం 05 ఫిబ్రవరి 1960
చాటపర్రు, పశ్చిమగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ TDP
తల్లిదండ్రులు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి, మాగంటి వరలక్ష్మీ దేవి
జీవిత భాగస్వామి శ్రీమతి పద్మావల్లి దేవి
సంతానం 2 కుమారులు, 1 కుమార్తె
నివాసం 81, కె.కె.బిర్లా లేన్

వ్యక్తిగత జీవితం

మార్చు

ఆయన శ్రీమతి పద్మావల్లి దేవిని 1981 ఫిబ్రవరి 18 న వివాహమాడాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె.[2]

రాజకీయ జీవితం

మార్చు

ఆయన మొదటిసారిగా 12వ లోక్‌సభకు 1998లో ఎన్నికైనారు. మరల 2014లో 16వ లోక్‌సభకు ఎన్నికైనారు. లోక్‌సభలో వ్యవసాయ స్టాండిగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక మంత్రిత్వశాఖ, విదేశీ వ్యవహారాల స్టాండిగ్ కమిటీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ, అడవులు, వాతావరణ మార్పులు, నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డులకు సభ్యునిగా ఉన్నాడు. ఆయన 2004 నుండి 2009 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా కూడా తన సేవలనందించాడు.మాగంటి బాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు.[2]

ఆయన 2007లో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో దెందూలూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటంతో మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మాగంటి బాబు 2009లో కాంగ్రెస్ ను వీడి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరి 2009 పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా పోటీచేసి ఓడిపోయాడు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏలూరు ఎంపీగా గెలిచి 2019 ఎన్నికల్లో ఓడిపోయాడు.

మూలాలు

మార్చు
  1. "Results". Archived from the original on 2014-05-22. Retrieved 2016-05-18.
  2. 2.0 2.1 2.2 "Members : Lok Sabha". 164.100.47.192. Archived from the original on 2016-03-06. Retrieved 2016-03-03.