మాగుంట దయాకర్ ఒక నవలా రచయిత, చిత్రకారుడు, తెలుగు చలన చిత్ర దర్శకుడు. ఇతని అసలు పేరు ఎం.వి. సుబ్బారెడ్డి. ఇతను నెల్లూరు జిల్లా, కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో 1951 లో జన్మించాడు.

ఇతను హైదరాబాదులో “క్రియేటివ్ పెయింటింగ్ స్కూల్” అనే చిత్రలేఖన శిక్షణాలయాన్ని నడిపేవారు. రచన వ్యాసంగం పట్ల కూడా ఆసక్తి ఉన్న దయాకర్, దాదాపు 35 నవలలు కూడా రచించారు. [1] అలాగే తను రచించిన “రెండు గుండెల చప్పుడు” నవలను తానే దర్శక, నిర్మాతగా వ్యవహరించి సినిమాగా రూపొందించారు. [2] ప్రస్తుతం దయాకర్ హైదరాబాదులోని శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్నారు. [3]

రచనలుసవరించు

ఆరోతేది అర్దరాత్రి

అగ్నివర్షిణి

బాస్

సెల్ నెంబరు 202

చీకట్లో చివరి క్షణం

ఈ క్షణం చాలు

ఇండియా గేటు

కనిష్క

కిల్లర్

మానవ మృగం

మరణం శరణం గచ్చామి

నగ్న నగరం

నిమిషానికి 600 సెకెండ్లు

రక్త శాసనం

రౌద్ర

షాడో సర్కిల్

టెర్రర్ టెర్రర్

ప్రైమ్ మినిస్టర్

ది వార్ ఆఫ్ అవంతి

తెల్ల చీకటి

చిత్రలేఖనం మీద రాసిన పుస్తకాలుసవరించు

What Am I Missing In My Painting?

If You Love Your Work, It Will Lead To Failure.

Every Day Experiences of a Struggling Artist

How To Kill Your Children’ Creative Desire?

The Character Of A Creator. Do You Have It In You?

మూలాలుసవరించు

  • http://maguntadayakar.com/about-artist/
  • http://pusthakalu.com/novels/magunta-dayakar
  • http://www.cineradham.com/newsongs/song.php?movieid=2147/