మాచిరాజు దేవీప్రసాద్

మాచిరాజు దేవీప్రసాద్ (1922 - 1974) ప్రముఖ పేరడీ (వ్యంగ్య) కవి.

ఈయన ప్రకాశం జిల్లా లోని చీరాల తాలూకా సంతరావూరు గ్రామంలో జన్మించాడు. చెన్నై లోని పచ్చయప్ప కళాశాలలో బి.ఎస్.సి. చదివాడు. చదువుతున్నప్పుడే భావకవిత్వాన్ని అపహాస్యం చేస్తూ రచనలు సాగించాడు. తనది "వికట కవిత్వం" అని, ఎగతాళి చేయడం తన పని అని తానే చెప్పుకున్నాడు. సాహితీ రంగంలో తనది విదూషక పాత్ర అని విశ్వసించారు.

కొంతకాలం సెంట్రల్ ఎక్సయిజ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేశాడు. తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించాడు.

1940 - 50 లలో కృష్ణాపత్రిక, భారతి, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ పత్రికలలలో తన పేరడీ లను ప్రచురించాడు.

ఈయన 1974 అక్టోబరు 31 తేదీన పరమపదించాడు.

రచనలు

మార్చు
  • రహదార్లు (శ్రీశ్రీ దేశ చరిత్రకు పేరడీ)
  • తాత విరహం (కృష్ణశాస్త్రి కవితకు ఆక్షేపణ)
  • కచేరీ కథనం
  • కాగితాల పొదుపు
  • రాజకీయ బాధితుడు