మాతా మాణికేశ్వరి
మాతా మాణికేశ్వరి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట పట్టణానికి 18 కిలో మీటర్ల దూరంలో, కర్ణాటక సరిహద్దులోని మాణిక్యగిరి కొండపై దైవాంశసంభూతులుగా పూజలందుకుంటున్న అమ్మవారు.
మాతా మాణికేశ్వరి | |
---|---|
జననం | మాతా మాణికేశ్వరి 1934, జూలై 26 కర్ణాటక మల్లాబాద్ గ్రామం |
ప్రసిద్ధి | ఆధ్యాత్మిక గురువు |
మతం | హిందూ |
తండ్రి | బుగ్గప్ప |
తల్లి | ఆశమ్మ |
జీవిత విశేషాలు
మార్చు1934 జూలై 26వ తేదిన కర్ణాటకలోని మల్లాబాద్ గ్రామంలో ఆశమ్మ, బుగ్గప్పల కుమారైగా జన్మించింది. బాల్యంలో పశువుల కాపరిగా కొంతకాలం జీవితాన్ని కొనసాగించింది. ఆ సమయంలో ఆమె ఎక్కువగా ధ్యానంలోనే గడిపేదట. ఆమెది దైవిక శరీరమని తెలియక తాకినవారికి శరీరమంతా మంటలు రేగడంతో ఆమెలో ఏదో మహత్తు ఉందని ప్రజల విశ్వసించటం మొదలుపెట్టారట. 1950లో యానగుంది లోని రాందేవుని గుడిలో కొంతకాలం గడిపింది. తర్వాత 1979లో కరీంనగర్ వెళ్ళి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది, శంషాబాద్ పెద్దషాపూర్ గ్రామం లో మరో ఆశ్రమాన్ని ఏర్పాటుచేసింది. తదనంతరం తిరిగి మళ్ళీ యానగుందికి చేరుకుంది. అక్కడే ఉన్న సిద్దేశ్వరగుట్టపై ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకుంది. అక్కడి శివాలయంలో నీటితో దీపాలు వెలిగిస్తూ గడిపేదని కథనాలున్నాయి. యానగుంది తరువాత మాతా మాణికేశ్వరి పేరు మీదుగా మాణిక్యగిరిగా మారిపోయింది[1]. అమ్మ ఒక దైవంశ సంభూతురాలు అని స్థానికులు భావిస్తారు.
మాణిక్యగిరిని దర్శించిన ప్రముఖులు
మార్చు- కోట్ల విజయభాస్కరరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో మాణిక్యగిరిని దర్శించి అమ్మవారి ఆశిస్సులు తీసుకున్నారు.
- కర్ణాటక రాష్ట్ర మాజీ హోం మినిష్టర్ మల్లికార్జున ఖర్గే, ఇతర శాఖల మంత్రులు కూడా దర్శించుకున్నారు.
మూలాలు
మార్చు- ↑ ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 23