మాథ్యూ జేమ్స్ పాట్స్ (జననం 29 అక్టోబరు 1998) ఒక ఇంగ్లీష్ క్రికెట్ ఆటగాడు . [1] పాట్స్ కుడిచేతి పేస్ బౌలరు, దిగువ వరుస బ్యాటరు. అతను డర్హామ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడతాడు. 2022 జూన్‌లో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు తరఫున టెస్టుల్లో ప్రవేశించాడు.

మాథ్యూ పాట్స్
2023 లో పాట్స్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Matthew James Potts
పుట్టిన తేదీ (1998-10-29) 1998 అక్టోబరు 29 (వయసు 26)
సండర్‌లాండ్, టైన్ అండ్ వియర్, ఇంగ్లాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 704)2022 జూన్ 2 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు2023 జూన్ 1 - ఐర్లాండ్ తో
ఏకైక వన్‌డే (క్యాప్ 265)2022 జూలై 19 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2017–presentడర్హమ్‌ (స్క్వాడ్ నం. 35)
2021–presentNorthern Superchargers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 6 1 43 11
చేసిన పరుగులు 30 3 672 56
బ్యాటింగు సగటు 7.50 16.00 14.00
100లు/50లు 0/0 0/0 0/3 0/0
అత్యుత్తమ స్కోరు 19 3* 81 30
వేసిన బంతులు 1,297 24 8,276 407
వికెట్లు 23 0 169 16
బౌలింగు సగటు 29.26 25.43 25.43
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 7 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2 0
అత్యుత్తమ బౌలింగు 4/13 7/40 4/62
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 0/– 17/– 3/–
మూలం: ESPNcricinfo, 4 June 2023

దేశీయ వృత్తి

మార్చు

పాట్స్ 2017 జూన్ 8న 2017 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో డర్హామ్ తరపున ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు. [2] 2018 మే 18న 2018 రాయల్ లండన్ వన్-డే కప్‌లో డర్హామ్ కోసం తన తొలి లిస్టు A మ్యాచ్ ఆడాడు [3] అతను 2019 టీ20 బ్లాస్ట్‌లో నార్తాంప్టన్‌షైర్‌తో జరిగిన డర్హామ్ తరపున 2019 జూలై 19 న T20 రంగప్రవేశం చేసాడు. [4]

2022 ఏప్రిల్లో, ది హండ్రెడ్ 2022 సీజన్ కోసం నార్తర్న్ సూపర్‌చార్జర్స్ అతన్ని కొనుగోలు చేసింది. [5] అదే నెలలో, 2022 కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో, పాట్స్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో లీసెస్టర్‌షైర్‌పై 6/58తో తన తొలి ఐదు వికెట్లు సాధించాడు. [6] ఒక నెల తర్వాత, పాట్స్ రెండవ ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు, మ్యాచ్‌లో మొత్తం పదకొండు వికెట్లు పడగొట్టి, గ్లామోర్గాన్‌పై డర్హామ్ 58 పరుగుల విజయాన్ని సాధించడంలో సహాయపడ్డాడు. [7]

అంతర్జాతీయ కెరీర్

మార్చు

2022 మేలో, న్యూజిలాండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో పాట్స్‌కు ఇంగ్లండ్ టెస్టు జట్టులో స్థానం లభించింది.[8] 2022 జూన్ 2న న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తరపున పాట్స్ టెస్టు రంగప్రవేశం చేశాడు. [9] పాట్స్ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 13 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. రెండవ ఇన్నింగ్స్‌లో 55 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. మొత్తం 68 పరుగులకు 7 వికెట్లు సాధించాడు. ఆ టెస్టులో ఇంగ్లండ్ విజయం సాధించింది.[10]

2022 జూలైలో, దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్ కోసం ఇంగ్లాండ్ వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) జట్టులో పాట్స్ ఎంపికయ్యాడు. [11] 2022 జూలై 19న ఇంగ్లండ్ తరపున దక్షిణాఫ్రికాపై వన్‌డే రంగప్రవేశం చేసాడు. [12]

మూలాలు

మార్చు
  1. "Matthew Potts". ESPNcricinfo. Retrieved 27 April 2017.
  2. "Specsavers County Championship Division Two, Kent v Durham at Canterbury, Jun 8-11, 2017". ESPNcricinfo. Retrieved 8 June 2017.
  3. "North Group (D/N), Royal London One-Day Cup at Chester-le-Street, May 18 2018". ESPNcricinfo. Retrieved 18 May 2018.
  4. "North Group (N), Vitality Blast at Chester-le-Street, Jul 19 2019". ESPNcricinfo. Retrieved 19 July 2019.
  5. "The Hundred 2022: latest squads as Draft picks revealed". BBC Sport. Retrieved 5 April 2022.
  6. "Matty Potts claims six wickets to boost Durham hopes against Leicestershire". ESPNcricinfo. Retrieved 17 April 2022.
  7. "Matthew Potts presses England credentials with career-best to bowl Durham to victory". ESPNcricinfo. Retrieved 15 May 2022.
  8. "James Anderson & Stuart Broad recalled by England for New Zealand Tests". BBC Sport. Retrieved 18 May 2022.
  9. "1st Test, Lord's, June 02 - 06, 2022, New Zealand tour of England". ESPNcricinfo. Retrieved 2 June 2022.
  10. "Joe Root hits century as England seal win over New Zealand in first Test". The Guardian. Retrieved 5 June 2022.
  11. "Ben Stokes rested from South Africa T20Is, Hundred". ESPNcricinfo. Retrieved 15 July 2022.
  12. "1st ODI (D/N), Chester-le-Street, July 19, 2022, South Africa tour of England". ESPNcricinfo. Retrieved 19 July 2022.