మాధవపెద్ది రామస్వామి

మాధవపెద్ది రామస్వామి లలిత సంగీత గాయకుడు, రంగస్థల నటుడు, కారమ్స్ క్రీడాకారుడు.

జీవిత విశేషాలు

మార్చు

అతను గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన బ్రాహ్మణకోడూరు గ్రామములో 1927 మే 31న శేషగిరిరావు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించాడు. 1952 నుండి 1975 వరకు ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో వందలాది పాటలకు స్వరకల్పన చేయడంతోపాటు గుర్తింపు పొందిన కవులు వ్రాసిన పాటలను స్వయంగా పాడాడు.అతను ఎన్నో కచేరీలలో పాటలు పాడటమేగాక, క్యారమ్స్ క్రీడలో తన ప్రతిభతో 1952లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో బహుమతి సాధించాడు. గుంటూరు హిందూ కళాశాలలో చాలా రోజులు పనిచేసాడు. అతను 2001 సెప్టెంబరు 8న కాలధర్మం చేసాడు.[1]

వ్యక్తిగత జీవితం

మార్చు

అతని భార్య శారద. అతనికి ఏడుగురు సంతానం. నాగలక్ష్మి, రామచంద్ర ప్రసాద్, సాయికృష్ణ, శేషగిరిరావు, లక్ష్మీ, మాధవీకృష్ణ, గురు ప్రసాద్.

అతని సహోదరులు సత్యనారాయణమూర్తి, శారదాదేవి.

మూలాలు

మార్చు
  1. ఆంధ్రజ్యోతి దినపత్రిక; 2016,నవంబరు-28; 2వపేజీ

బాహ్య లంకెలు

మార్చు
  • "JavaScript Tree Menu". madhavapeddi.com. Retrieved 2020-07-22.[permanent dead link]