మానస ఎండ్లూరి
మానస ఎండ్లూరి వర్థమాన తెలుగు రచయిత్రి. ఆమెకు 2020 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.[1] ఆమె మిళింద కథలు రచనకుగాను యువ సాహితీ పురస్కారం దక్కింది. మరాఠీ నవల ‘ఓ’ ని 2015లో ‘ఊరికి దక్షిణాన’గా తెలుగులోకి అనువదించారు.[2][3]
మానస ఎండ్లూరి | |
---|---|
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
ప్రసిద్ధి | కవయిత్రి |
తల్లిదండ్రులు | ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలత |
జీవిత విశేషాలు
మార్చుఆమె నెల్లూరులో తెలుగు రచయితలైన ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలత లకు జన్మించింది. రాజమండ్రిలో పెరిగింది. ఏలూరు సెయింట్ థెరెస్సాలో ఇంగ్లీష్ లిటరేచర్, సైకాలజీలో డిగ్రీ చేసింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పీజీ చేసింది. [4] తల్లిదండ్రులు తెలుగు రచయితలు
. ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఆమె రాజమండ్రిలో పెరిగినా ఆమెకు నెల్లూరు, హైదరాబాద్ ప్రాంతాల మాండలికాలతో అనుబంధం ఎక్కువ. ఆమె తల్లిదండ్రుల నుండి పొందిన స్ఫూర్తే ఆమె సాహిత్య సృజనకు ప్రేరణ. చిన్నతనం నుండి ఆమెకు రచనలు చదవడం అబ్బింది. ఇంటికొచ్చేవారందరూ ఎక్కువగా సాహితీకారులైనందున ఇంటా బయటా ఎక్కువగా సాహిత్య చర్చలే జరిగేవి. చలం రాసిన "మైదానం" ను ఆమె తండ్రి ఏడవ తరగతిలో చదివించాడు. హైస్కూలు చదువుతున్నప్పుడు ఆమె యండమూరి నవలను చదివింది చిన్నతనంలో ఏవో హైకూలు, కవితలు రాసేది. పెరిగే కొద్దీ ప్రగతిశీల సాహిత్యం, సామాజిక అంశాలపై రచనలు చదువుతూ వచ్చింది. ఆమె తొలి కథ 'గౌతమి' 2014లో 'విహంగ' వెబ్ పత్రికలో ప్రచురితమైంది. ఆమె అనేక కథలను రాసింది.
తాను చేసే రచనల్లో వివిధ సామాజిక అంశాలను స్పృశించడం ఈ యువ రచయిత్రి ప్రత్యేకత. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు, స్వలింగ ప్రేమలు-సమస్యలు, దళిత క్రైస్తవ జీవన నేపథ్యంలో రాస్తుంది. ప్రస్తుతం ఒక బ్లాగు కూడా నడుపుతున్న ఈమె పలు అంతర్జాల పత్రికలతో పాటూ పత్రికలకు కూడా కథలు రాస్తుంది. ఆమె నా మొదటి కథ ‘గౌతమి’ విహంగ (మహిళా సాహిత్య పత్రిక) లో ప్రచురితమైంది. ఆమె తల్లి వుట్ల హేమలత బాధిత స్త్రీల పట్ల నిలవాలి అన్న ఉత్సుకతతో 2010లో "విహంగ" పత్రికను స్థాపించింది. 2019 ఫిబ్రవరి 9న ఆమె తల్లి మరణించినందున విహంగ సంపాదక బాధ్యతలు కుమార్తెగా ఆమె తీసుకుంది.[5] ఆమె పలు పురస్కారాలు అందుకుంది. సాహిత్య అకాడమీ నిర్వహించిన కథా పఠనంలో రాష్ట్రీయ, జాతీయ సదస్సుల్లో పాల్గొంది.
రచనలు
మార్చు- మిళింద కథలు[6]
కథలు
మార్చు- బొట్టు
- బొట్టుకుక్క
- దొంగ బొట్టు
- బొట్టు భోజనాలు
- కరెక్టివ్ రేప్
- అంతిమం
- అమ్మకో లేఖ
- అబద్ధం
- అదే ప్రేమ
- అర్థజీవి
- నటీనటులు
- అవిటి పెనిమిటి
- మైదానంలో నేను
- గౌతమి
- మెర్సీ పరిశుద్ధ పరిణయం
మూలాలు
మార్చు- ↑ "కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కారం అందుకున్న మానస". 19 October 2021. Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "In conversation with Manasa Yendluri, winner of Sahitya Akademi Yuva Puraskar 2020 for 'Milinda'" (in Indian English). The Hindu. 1 May 2021. Retrieved 30 December 2024.
- ↑ ETV Bharat News (28 March 2021). "'మహిళలే వాళ్ల కథలు, బాధలు చెప్పుకునే రోజులు రావాలి'". Archived from the original on 30 December 2024. Retrieved 30 December 2024.
- ↑ "అమ్మా నాన్నల అక్షర మానస | Prajasakti::Telugu Daily". www.prajasakti.com. Archived from the original on 2020-07-04. Retrieved 2020-07-04.
- ↑ "సంపాదకీయం- మానస ఎండ్లూరి |". vihanga.com. Archived from the original on 2019-12-08. Retrieved 2020-07-04.
- ↑ "మిళింద (కథలు)". lit.andhrajyothy.com. Retrieved 2020-07-04.