ఎండ్లూరి సుధాకర్

ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ (Yendluri Sudhakar) జనవరి 21, 1959నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు .

ఆచార్య.ఎండ్లూరి సుధాకర్
Yendluri sudhakar.jpg
ఆచార్య ఎండ్లూరి సుధాకర్
జననంఎండ్లూరి సుధాకర్
జనవరి 21, 1959
నిజామాబాద్ లోని పాముల బస్తి
వృత్తికేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాదు లో ఆచార్యుడుగా , పదవీ బాధ్యతల నిర్వహణ

బాల్యంసవరించు

ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 లో నిజామాబాద్ లోని పాముల బస్తిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు . ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయి లకు ప్రథమ సంతానం . వీరికి ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు .

విద్యాభ్యాసంసవరించు

హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్ లోనే సాగింది . నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం .ఏ . ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం లో పిహెచ్ .డి చేసారు .

రచనలుసవరించు

పుస్తకం ప్రక్రియ ప్రచురణ సంవత్సరం
1.వర్తమానం కవితలు మానస ప్రచురణలు,రాజమండ్రి జూలై 1992, జనవరి 1995
2.జాషువా' నాకథ ' ఎం.ఫిల్ పరిశోధన మానస ప్రచురణలు,రాజమండ్రి జూలై 1992
3.కొత్త గబ్బిలం దళిత దీర్ఘ కావ్యం మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . సెప్టెంబరు 1998, సెప్టెంబరు 2011
4.నా అక్షరమే నా ఆయుధం డా .శరణ్ కుమార్ లింబాలే ఆత్మ కథకి అనువాదం ............. 1999,సెప్టెంబరు
5.మల్లె మొగ్గల గొడుగు మాదిగ కథలు దండోరా ప్రచురణలు,హైదరాబాదు అక్టోబరు 1999
6.నల్లద్రాక్ష పందిరి (DARKY) ఉభయ భాషా కవిత్వం జె .జె ప్రచురణలు,హైదరాబాదు జూన్ 2002
7.పుష్కర కవితలు కవితలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 2003
8.వర్గీకరణీయం దళిత దీర్ఘ కావ్యం మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . బ్లాక్ డే, డిసెంబరు 2004, గుడ్ ఫ్రైడే మార్చి 2005
9."ఆటా "జనికాంచె... అమెరికా యాత్రా కవితలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . జూన్ 2006
10.జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం పిహెచ్. డి సిద్ధాంత గ్రంథం 1993 మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . ఏప్రిల్ 2007
11.గోసంగి దళిత దీర్ఘ కావ్యం అంబేద్కర్ సాహితీ విభాగం, బొబ్బిలి, విజయనగరం జిల్లా మే 2011
12.కథానాయకుడు జాషువా జీవిత చరిత్ర తెలుగు అకాడమి,హైదరాబాదు 2012
13.నవయుగ కవి చక్రవర్తి జాషువా మోనో గ్రాఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలుగు అకాడమి,హైదరాబాదు నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, డిసెంబరు 27, 27, 28 2012
14.కావ్యత్రయం దీర్ఘ కావ్య సంకలనమ్ మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి .
15.సాహితీ సుధ దళిత సాహిత్య వ్యాసాలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 9,నవంబరు,2016
16.తెలివెన్నెల సాహిత్య వ్యాసాలు మానస, మనోజ్ఞ ప్రచురణలు,రాజమండ్రి . 21-1-2017

ఉద్యోగంసవరించు

జీవిక కోసం రకరకాల వృత్తులు చేసాక, 1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్ లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్ గా ఉద్యోగం చేసారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు [1][2]లో వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం.నుంచి 2011 సం.వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే 'వాజ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా . సంపాదకుడిగా వ్యవహరించారు.అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ప్రొఫెసర్ గా ఆధునిక శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు. 2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి నేటి వరకు రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

పురస్కారాలుసవరించు

  • 2005లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే కొండేపూడి సాహితీ సత్కారం అందుకున్నాడు[3].

సూచికలుసవరించు

  1. పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయం
  2. సాహిత్యం పీఠం , నన్నయ ప్రాంగణం రాజమండ్రి
  3. పెనుగొండ లక్ష్మీనారాయణ (జనవరి 2020). గుంటూరుసీమ సాహిత్యచరిత్ర (1 ed.). గుంటూరు: ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ. pp. 283–284. Check date values in: |date= (help)

ఇవికూడా చూడండిసవరించు