మానస రవళి
మానసరవళి సామాజిక అంశాల పై తనదైన శైలి, ధోరణితో కవయిత్రి లక్కరాజు వాణి సరోజిని గారు రచించిన తెలుగు పద్య సంపుటి.
మానసరవళి | |
"మానసరవళీ" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | లక్కరాజు వాణి సరోజిని |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | కవితా సంపుటి |
ప్రచురణ: | |
విడుదల: | 2014 |
మానస రవళి
మార్చుఈ మానస రవళిలో అనేక కవితలు ఉన్నాయి, కొన్నిటిని ఈ క్రింద ఉదహరించటం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణ 11-Oct-2014 న విజయవాడ పట్టణంలో గాంధీనగర్ లోని ప్రెస్ క్లబ్ లో పలువురు రచయితల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ ఆవిష్కరణ సభలో పలువురు ప్రముఖులు మాట్లాడుతూ ఇలా ప్రశంసించారు.
మానస రవళి ఆవిష్కరణ
మార్చుమానసరవళి కవితా సంపుటిని ఎక్స్‌రే సాహిత్య, సాంస్కృతిక, సేవాసంస్థ ఆధ్వర్యంలో అక్టోబరు 11 2014న ప్రెస్ క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ శానసమండలి సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు ఆవిష్కరించారు.[1] ఈ కార్యక్రమంలో ఆయన కవిత్వం ప్రజల సమస్యలను ప్రతిబింబించాలనీ, సమస్యల మూలాలలోకి వెళ్లి వాటికి పరిష్కారాలు సుచించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి సంచాలకులు ముంజులూరి కృష్ణ కుమారి, ఎక్స్‌రే సాహిత్య సేవా సంస్థ అధ్యక్షుడు కొల్లురి, రచయిత పింగళి వెంకట కృష్ణారావు, కథారచయిత సర్వజిత్ తదితరులు పాల్గొన్నారు.[2] ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి కావూరి సత్యవతి పుస్తక సమీక్ష చేసారు.
చిత్రమాలిక
మార్చు-
సమాజాన్ని మార్చే కవిత్వాలు రాయాలి
-
కవిత్వం సామాజిక అంశాల వేదిక కావాలి
-
మానస రవళి కవిత పుస్తకావిష్కరణ
-
మానస రవళి చివరి పుట