మామాంగం 2019లో విడుదలైన తెలుగు సినిమా. కావ్య ఫిలింస్ బ్యానర్‌పై వేణు కున్నప్పిల్లి నిర్మించిన ఈ సినిమాకు ఎమ్.పద్మ కుమార్ దర్శకత్వం వహించాడు. మమ్ముట్టి, ఉన్ని ముకుందన్, ప్రాచీ తెహ్లాన్, అచ్చుతన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 9న విడుదల చేసి,[1] తెలుగుతో పాటు, హిందీ, మలయాళం, తమిళ్ భాషల్లో 12 డిసెంబర్ 2019న విడుదలైంది. [2]

మామాంగం
దర్శకత్వంఎమ్.పద్మ కుమార్
స్క్రీన్ ప్లేసంజీవ్ పిళ్ళై
శంకర్ రామకృష్ణన్
నిర్మాతవేణు కున్నంపల్లి
తారాగణంమమ్ముట్టి
ఉన్ని ముకుందన్
ప్రాచీ తెహ్లాన్
అచ్చుతన్
ఛాయాగ్రహణంమనోజ్ పిళ్ళై
కూర్పురాజా మొహమ్మద్
సంగీతంపాటలు:
ఎమ్.జయచంద్రన్
బ్యాగ్రౌండ్ స్కోర్:
సంచిత్ బల్హారా
అంకిత్ బల్హారా
నిర్మాణ
సంస్థ
కావ్య ఫిలిం కంపెనీ
పంపిణీదార్లుగీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ (తెలుగు)
విడుదల తేదీ
12 డిసెంబరు 2019 (2019-12-12)
సినిమా నిడివి
160 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కేరళ ప్రాంతంలో -చావేరుకల్ అనేది ఓ వీరుల జాతి. శతాబ్దాలుగా జమోరిన్ రాజ వంశానికి చెందిన పాలకులచే అణచివేతకు గురవుతారు. రాజవంశంపై పగ పెంచుకున్న చావేరుకల్ జాతి -పుష్కరానికోసారి భరతపూజ నదీ ఒడ్డున జరిగే మామాంగం మహోత్సవం సాక్షిగా జమోరిన్ పాలకుడిని తెగనరకాలని ప్రయత్నిస్తుంటుంది. అలా చావేరుకల్ జాతిలో వీరులంతా మామాంగం వెళ్లడానికే పుట్టడం, రాజుని హతమార్చే ప్రయత్నంలో వీరమరణం పొందటం జరుగుతుంటుంది. శతాబ్ధకాలంలో అదొక యుద్ధ సంప్రదాయమైపోతుంది. ఆ ప్రయత్నంలోనే జాతి వీరులంతా అంతమవటంతో -చివరిగా మిగిలిన ఒక యోథుడు, మరో బాలుడు జమోరిన్ రాజుని హతమార్చే ప్రయత్నంలో మామాంగానికి బయలుదేరుతారు. మధ్యలో ఆపదలో పడిన వాళ్లకు మహావీరుడైన చంద్రోత్ (మమ్ముట్టి) సహాయంగా నిలుస్తాడు. అసలు -చావేరుకల్ తెగకూ, జమోరిన్ రాజ వంశానికీవున్న వైరమేమిటి? చివరి వీరుడి (మాస్టర్ అచ్యుతన్) పగను చంద్రోత్ ఎందుకు పంచుకున్నాడు? మహావీరుడైన చంద్రోత్ నేపథ్యమేమిటి? అంతటి వీరుడైన చంద్రోత్ బృహన్నలను తలపించే కృపాచారిగా ఎందుకు మారాడు? చివరికి చావేరుకల్ తెగ వీరుడు రాజుని హతమార్చాడా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
  • బ్యానర్: కావ్య ఫిలింస్
  • నిర్మాత: వేణు కున్నప్పిల్లి
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎమ్.పద్మ కుమార్
  • సంగీతం: ఎమ్.జయచంద్రన్
  • బ్యాగ్రౌండ్ స్కోర్ : సంచిత్ బల్హారా, అంకిత్ బల్హారా
  • సినిమాటోగ్రఫీ: మనోజ్ పిళ్లై
  • ఎడిటింగ్: రాజా మొహమ్మద్

మూలాలు

మార్చు
  1. 10TV (9 November 2019). "మామాంగం - ట్రైలర్" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  2. 10TV (4 December 2019). "డిసెంబర్12న 'మామాంగం'" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  3. 10TV (12 December 2019). "మామాంగం - రివ్యూ" (in telugu). Archived from the original on 30 November 2021. Retrieved 30 November 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
"https://te.wikipedia.org/w/index.php?title=మామాంగం&oldid=4191095" నుండి వెలికితీశారు