మామిడికాయ (పచ్చి కొబ్బరి) పచ్చడి

మామిడికాయ పచ్చడి ఒక శాకాహార ఆహార పదార్థం. ఇది మామిడికాయలు, పచ్చికొబ్బరితో తయారుచేస్తారు.

మామిడికాయ, పచ్చి కొబ్బరి పచ్చడి
మామిడికాయలు

కావలసిన పదార్థాలు

మార్చు
  1. మామిడికాయలు
  2. పచ్చి కొబ్బరి

తయారీ విధానం

మార్చు
 
పచ్చి కొబ్బరి

మామిడికాయ చిన్నది చెక్కు తీసి, చిన్న ముక్కలుగా తరుగుకోవాలి. పచ్చి కొబ్బరి (1/2 చిప్ప) వెనుకభాగం వీలయితే పీలర్ తీసుకుని పెచ్చు తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇందులోకి పచ్చి మిరప కాయలు (6) కావాలి.

తాలింఫు సామాను

మార్చు

1. చాయమినపప్పు 2. ఎండు మిర్చి (8-10) 3. ఆవాలు 4. మెంతులు 5. నూనె (3 స్పూన్లు) 6. ఉప్పు 7. పసుపు (కొద్దిగా) 8. ఇంగువ (కొద్దిగా) తీసుకోవాలి.

తయారీ విధానం

మార్చు

బేసిన్ వేడి చేసి, నూనె వేడి ఎక్కాక, తాలింఫు సామాను వరుసగా చాయమినపప్పు, మెంతులు, ఆవాలు వేగాక, ఎండు మిర్చి వేసి దోరగా వేయించాలి. పచ్చడికి సరిపడ ఎండుమిర్చి వేసుకోవాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి దింపేసి చల్లారనివ్వాలి. చల్లారిన 3/4 పోపుని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, సరిపడ ఉప్పు, పసుపు వేసి ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇవి నలిగిన తర్వాత, మామిడికాయ, కొబ్బరి ముక్కల్ని వేసి, చిటికెడు పచ్చి ఇంగువ వేసి ఒకసారి మాత్రం గ్రైండ్ చేయాలి. ముక్కల్ని వేసిన తదుపరి ఎక్కువ మిక్సీ పట్టకూడదు, పచ్చడి పేస్ట్ అయిపోతుంది. దీనిలో చివరిలో మిగిలిన 1/4 పోపు సామాను పైన వేసుకోవాలి. ఒక తడిలేని గట్టిమూత ఉన్న గాజుసీసా లోనికి తీసుకోవాలి. ఇది సరిగ్గా చేస్తే వారం రోజులు వరకు పాడవకుండా ఉంటుంది. [1] [2]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.sailusfood.com/pachi-mamidikaya-kobbari-pachadi-raw-mango-coconut-chutney/
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-12-29. Retrieved 2018-03-21.