మాయామాళవగౌళ రాగము
మాయామాళవగౌళ రాగము కర్ణాటక సంగీతంలో 15వ మేళకర్త రాగము.[1] దీనినే మాళవగౌళ రాగము అని కూడా అంటారు. ఇది సుమారు మూడు నాలుగు వందల సంవత్సరాల నుండి వాడుకలోనున్న ప్రాచీన రాగము. ఇది హిందుస్థానీ సంగీతం లోని భైరవ రాగంతో సమానమైనది.యిది అగ్ని యని మూడవ చక్రమునకు చెందినది. ఆ చక్రములో మూడవ శ్రేణి లోనిది.
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రిగా మ ప ధని స
- (S R1 G3 M1 P D1 N3 S)
- అవరోహణ : సని ధ ప మగా రి స
- (S N3 D1 P M1 G3 R1 S)
ఈ రాగం స్వరాలు షడ్జమము, శుద్ధ రిషభము, అంతర గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ ధైవతము, కాకలి నిషాధము. ఇది 51వ మేళకర్త కామవర్ధిని (పంతువరాళి) రాగానికి సమానమైన శుద్ధ మధ్యమ రాగము.
రక్తి రాగము
మార్చుసర్వస్వర గమక వరిక రాగము. ప్రాచీన రాగము. అన్ని వేలల యందును పాడదగు రాగము. అనురాగగుణనును హాయినిచ్చు రాగము. ఉత్తమోత్తమ రాగము. సంగీత కళకు పునాది రాగము, కర్ణాటక సంగీత విద్యార్థులు దీనినే ప్రప్రథమముగా నేర్చుకుందురు.
శుద్ధ రాగము, హిందూస్తానీ సంగీతములో దీనిని పోలిన రాగము "భైరవ రాగము".
పెక్కు జన్య రాగ సంతానము గల జనక రాగము. గాంధార నిషాదములు జీవ స్వరములు. గాంధార పంచమములు విశ్రాంతి స్వరములు. దోషరహిత రాగము. షడ్జమము, గాంధారము, దైవతము, నిషాధములపై రచనలు ప్రారంభించును. సంగీత రత్నాకరమందును పేర్కొనబడిన రాగము. పూర్వము దీనిని మాళవ గౌళ అనియే పేరు. 15 వ మేళముగా సరిదిద్దుకొనుటకు "మాయా" అను పదములు చేర్చబడినవి.
ఆగల స్వరములు, కంపిత స్వరములు కలిగిన రాగము. నెమ్మదిగా నైననూ, తీవ్రముగానైననూ జంటస్వరములు, దాటు స్వరములు పాడవచ్చును.
ఉదాహరణలు
మార్చు- s:నిన్ను నమ్మియున్నవాడను - రామదాసు కీర్తన.
- దేవీ శ్రీ తులసమ్మ - త్యాగరాజు కీర్తన.
- తులసీ దళములచే సంతోషముగా పూజింతు - త్యాగరాజు కీర్తన.
మాయామాళవగౌళ జన్యరాగాలు
మార్చుఈ రాగంలో కొన్ని ప్రముఖమైన జన్యరాగాలు: బౌళి, జగన్మోహిని, గౌళ, గౌళిపంతు, లలిత, నాథనామక్రియ, రేవగుప్తి, సావేవి, మళహరి.
కొన్ని ప్రసిద్ధ రచనలు
మార్చురచన | నామము | తాళము | రచయిత |
లక్షణ గీతము | రవికోటి తేజ | మఠ్య తాళం | వేంకటమఖి |
కృతి | మేరుసమాన | మధ్యాది | త్యాగరాజు |
కృతి | తులసీ దళములచే | రూపకము | త్యాగరాజు |
కృతి | విదులకు మ్రొక్కెద | ఆది | త్యాగరాజు |
కృతి | శ్రీ నతాది | ఆది | ముత్తుస్వామి దీక్షితులు |
కృతి | దేవాదిదేవ | ఆది | మైసూరు సదాశివరావు |
నాదనామక్రియ రాగము
మార్చు- ఉదాహరణలు
- ఏతీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా - రామదాసు కీర్తన.
- కోదండ రామ కోదండ రామ - రామదాసు కీర్తన.
- ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ - రామదాసు కీర్తన.
- ఇతరము లెరుగనయ్యా నా - గతి నీవే శ్రీరామయ్యా - రామదాసు కీర్తన.
- నారాయణ యనరాదా మీ - నాలుకపై ముల్లు నాటియున్నదా - రామదాసు కీర్తన.
- రామ పరాకు రఘురామ పరాకు - రామదాసు కీర్తన.
- ఎంతపనిచేసితివి రామ నిన్నేమందు - రామదాసు కీర్తన.
సావేరి రాగము
మార్చు- ఉదాహరణలు
- సీతారామస్వామి నే జేసిన నేరంబేమి - రామదాసు కీర్తన.
- అమ్మ నను బ్రోవవే రఘురాముని - రామదాసు కీర్తన.
- శ్రీరాముల దివ్యనామ స్మరణ చేయుచున్న - రామదాసు కీర్తన.
తెలుగు సినిమా పాటలలో
మార్చు- కీలు గుర్రం చిత్రంలో ఎవరు చేసిన ఖర్మ - రచనః తాపీ ధర్మారావు; సంగీతం, గానంః ఘంటసాల
- లవకుశ చిత్రంలో ఏ నిముషానికి ఏమి జరుగునో - రచనః కొసరాజు; సంగీతం, గానంః ఘంటసాల
- జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమలో "యమహో నీ యమా యమా అందం" పాట.
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్