జగదేకవీరుడు అతిలోకసుందరి

1990 సినిమా

జగదేకవీరుడు అతిలోకసుందరి 1990 లో కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వచ్చిన ఒక సోషియో ఫాంటసీ చిత్రం. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.

జగదేకవీరుడు- అతిలోక సుందరి
(1990 తెలుగు సినిమా)
Jagadekaveerudu atilokasundari.jpg
దర్శకత్వం కె. రాఘవేంద్ర రావు
నిర్మాణం సి. అశ్వినీదత్
రచన కె. రాఘవేంద్ర రావు,
జంధ్యాల
తారాగణం చిరంజీవి (రాజు),
శ్రీదేవి (ఇంద్రజ),
అమ్రీష్ పురి (మహాద్రష్ట),
కన్నడ ప్రభాకర్,
అల్లు రామలింగయ్య,
తనికెళ్ళ భరణి,
బ్రహ్మానందం (విచిత్ర),
జె. నాగరాజ్ (పోలీస్ ఇనస్పెక్టర్),
రామిరెడ్డి,
సంగీత,
షాలిని (బేబీ శాలిని),
శామిలి (బేబీ శామిలి),
ఆర్.ఎస్. శివాజీ (మాలోకం)
సంగీతం ఇళయరాజా
నేపథ్య గానం కె.ఎస్.చిత్ర,
ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం,
ఎస్.జానకి
నృత్యాలు ప్రభుదేవా
గీతరచన వేటూరి
ఛాయాగ్రహణం అజయ్ విన్సెంట్
నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్
విడుదల తేదీ మే 9, 1990
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కథసవరించు

ఆంజనేయస్వామి భక్తుడైన రాజు (చిరంజీవి) ఒక గైడ్. అనాథ పిల్లలని నలుగురిని తనతో బాటు పెంచుకుంటూ ఉంటాడు. ఆ పిల్లలలో ఒక అమ్మాయికి ఒక ప్రమాదంలో కాలు విరిగిపోతుంది. హిమాలయాల్లో మాత్రమే లభ్యమయ్యే ఒక మూలికతో ఆ అమ్మాయిని మళ్ళీ నడిచేలా చేయవచ్చని ఒక స్వామి చెప్పటంతో రాజు హిమాలయాలకి బయలుదేరతాడు. ఆ మూలికను సంపాదించి తిరిగి వస్తుండగా, దారి తప్పి మానససరోవరానికి వస్తాడు. స్వర్గలోకాన ఇంద్రుని పుత్రిక అయిన ఇంద్రజ (శ్రీదేవి) భూలోకాన మానససరోవరం అందంగా ఉంటుందని తెలుసుకొని తండ్రి వద్ద అనుమతి తీసుకొని అక్కడకు వస్తుంది. తిరిగి వెళ్ళు సమయంలో స్వర్గలోక ప్రవేశం గావించే ఉంగరాన్ని జారవిడుచుకొంటుంది. దానితో ఆమెకి స్వర్గలోక ద్వారాల వద్దే నిషేధం కలుగుతుంది. రాజు వద్ద తన ఉంగరం ఉందని తెలుసుకొన్న ఇంద్రజ పిల్లల ద్వారా అతనికి చేరువై ఆ ఉంగరాన్ని సంపాదించే ప్రయత్నంతో నిజంగానే అతనిని ప్రేమిస్తుంది. మహాదృష్ట (అమ్రిష్ పురి) అనే దృష్ట మాంత్రికుడు దేవకన్యను బలిస్తే తనకి మరిన్ని శక్తులు వస్తాయని ఇంద్రజని అపహరిస్తాడు. ఇంద్రజ అమాయకత్వానికి, స్వచ్ఛమైన ప్రేమకి ముగ్ధుడైన రాజు మహాదృష్ట నుండి ఆమెను రక్షించటంతో, ఉంగరాన్ని, స్వర్గలోక ప్రవేశాన్ని త్యజించి, మనిషిగా రాజుతోనే జీవించాలని నిర్ణయించుకోవటంతో చిత్రం సుఖాంతమౌతుంది.

ప్రత్యేకతలుసవరించు

 • ఈ చిత్రం విడుదలకు ముందు రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకొంది.
 • శాలిని, శామిలి[1] ఇందులో బాలతారలు. శాలిని సఖి ద్వారా కథానాయిక గా పరిచయం అయితే, శామిలి ప్రియురాలు పిలిచిందిలో చిన్న పాత్రని పోషించింది. ఓయ్ సినిమాతో కథానాయికగా పరిచయం అయింది.వారి సోదరుడు రిషికూడా బాలనటుడిగా నటించారు.

సంభాషణలుసవరించు

 • ఇంద్రజ: మానవా!
 • రాజు: నువ్వా పిలుపు మానవా?
 • ఈ మానవుని చెంత చేరి, అచ్చిక బుచ్చికలాడి, మచ్చిక చేసుకొని, నా అంగుళీయకము సంపాదించెద.
 • ఇంద్రజ: ఒక్క పర్యాయము నీ వామ హస్తాన్ని నా దక్షిణ హస్తానికి అందించెదవా?

ఈ చిత్రంలోని పాటలుసవరించు

ఈ చిత్రంలోని అన్ని పాటలు అత్యంత జనాదరణ పొందినవి.

 • మన భారతంలో
 • అందాలలో అహో మహోదయం
 • జై చిరంజీవా! జగదేకవీరా!
 • యమహో నీ యమా యమా అందం
 • అబ్బనీ తీయనీ దెబ్బ
 • ప్రియతమా, నను పలకరించు ప్రణయమా
 • ధినక్కుతా కసక్కురో

ఇవి కూడా చూడండిసవరించు

చిరంజీవి నటించిన సినిమాల జాబితా

 1. ఈనాడు, సినిమా (18 April 2019). "ఇలా వచ్చారు.. అలా వెళ్ళారు". మూలం నుండి 5 January 2020 న ఆర్కైవు చేసారు. Retrieved 5 January 2020. Cite news requires |newspaper= (help)