రాగం
భారతీయ సంగీతంలో కొన్ని స్వరాల సమూహము రాగం. రాగమనగా, స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల చిత్తమును ఆనందింపచేయునట్టి ధ్వని.
రాగ సృష్టి సంగీత ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుకగా భావిస్తారు. రాగాలకు సంబంధించిన మూల భావాలు సామవేదంలో ఉన్నట్లు సంగీతకోవిదులు చెబుతారు. మన సంప్రదాయ సంగీతములోని రెండు స్రవంతులకు కూడా రాగమే ఆధారం. రాగమేళకర్త ప్రణాళికననుసరించి రాగాలను 12 రాశులు లేదా సముహాలుగా వర్గీకరిస్తారు. ఒక్కొక్క సమూహాంలో ఆరు రాగాలు వరకు ఉంటాయి. వానిని జనక రాగాలు అంటారు. అనేక జన్యరాగాలకు ఆధారం జనకరాగాలే. ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమహి. హిందుస్థానీ సంగీతంలో కూడా ఈ 72 రాగాలలో ఓ పదింటిని విస్తృతంగా వాడతారని పరిశీలకుల భావన. 72 రాగాలకు ధీర శంకరాభారణం, కీరవాణి, నట భైరవి, గౌరీ మనోహరి వంటి ప్రత్యకనామాలున్నాయి. హిందుస్తానీ, కర్ణాటక సంగీతాలు ఒకే సంప్రదాయం నుండి పుట్టినప్పటికీ వానిని ఆలపించడంలోను, సాధన చేయడంలోను ఎంతో వైరుధ్యం ఉంది. భాషాపరమైన ప్రాంతీయమైన, సాంకేతికమైన, సామాజిక రాజకీయ కారణాలు ఈ వైరుధ్యానికి హేతువులని అంటారు.
రాగాలు-రకాలు
మార్చుఆరోహణ, అవరోహణలను బట్టి రాగాలను రెండుగా విభజించారు.
జనక రాగాలు
మార్చుజనక రాగాలను మేళకర్త రాగాలు, సంపూర్ణ రాగాలు అంటారు. ఇవి 72 ఉన్నాయి. వీటి లక్షణాలు:
- ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలు ఉంటాయి.
- ఆరోహణ, అవరోహణలోని సప్తస్వరాలు క్రమ పద్ధతిలో వరుస మారకుండా ఉంటాయి.
- ఆరోహణలో ఏఏ అంతర గాంధారాది క్రమం ఉంటే, అవరోహణలో కూడా అదే క్రమం ఉంటుంది.
ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.
12 చక్రాలు
మార్చుపూర్వ, ప్రతి మధ్యమ రాగాలలో ఒక్కొక్క విభాగాన్ని ఆరు సూక్ష్మ విభాగాలుగా చేసి, 12 భాగాలు ఏర్పరచారు. వీటిని 'చక్రములు' అంటారు. ఒక్కొక్క చక్రంలో ఆరు రాగాలు ఉండేలా విభజన చేశారు. ఈ పన్నెండు చక్రాల పేర్లు:
1. ఇందు చక్రం : కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి రాగాలు.
2. నేత్ర చక్రం : సేనాపతి, హనుమతోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి రాగాలు.
3. అగ్ని చక్రం : గాయకప్రియ, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యకాంతం, హాటకాంబరి రాగాలు.
4. వేద చక్రం : ఝుంకారధ్వని, నఠభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి, వరుణప్రియ రాగాలు.
5. బాణ చక్రం : మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణం, నగ నందిని రాగాలు.
6. ఋతు చక్రం : యాగప్రియ, రాగవర్ధిని, గాంగేయభూషిణి, వాగదీశ్వరి, శూలిని, చలనాట రాగాలు.
7. ఋషి చక్రం : సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ రాగాలు.
8. వసు చక్రం : గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్వితమార్గిణి, సువర్ణాంగి, దివ్యమణి రాగాలు.
9. బ్రహ్మ చక్రం : ధనళాంబరి, నామనారాయణ, కామవర్ధిని, రామప్రియ, గమనశ్రమ, విశ్వంభరి రాగాలు.
10. దిశ చక్రం : శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమ, హేమవతి, ధర్మవతి, నీతిమతి రాగాలు.
11. రుద్ర చక్రం : కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకళ్యాణి, చిత్రాంబరి రాగాలు.
12. ఆదిత్య చక్రం : సుచరిత్ర, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధిని, నాసికాభూషణి, కోసలము, రసికప్రియ రాగాలు.
జన్య రాగాలు
మార్చుమేళకర్త రాగాల నుండి పుట్టినవి ఈ జన్య రాగాలు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు.
- ఉపాంగ రాగాలు : ఇది 15వ మేళకర్త రాగమైన మాయామాళవ గౌళ రాగం యొక్క జన్యం. ఉదాహరణ - సావేరి, మలహరి రాగాలు.
- భాషాంగ రాగాలు : ఇది నఠభైరవి అనే 20 మేళకర్త రాగం యొక్క జన్యం. ఉదాహరణ - భైరవి, ఆనందభైరవి రాగాలు.
- వర్జ రాగాలు : ఉదాహరణ - sivaranjani
- , మోహన, శుద్ధ సావేరి రాగాలు.
- వక్ర రాగాలు : రాగంలో స్వరాల అమరిక క్రమ పద్ధతిలో ఉండకపోవడమే వక్ర రాగ లక్షణం. ఉదాహరణ - ఆనంద భైరవి, సారంగ, శహన రాగాలు.
- నిషాదాంత్య రాగాలు : కొన్ని రాగాలు నిషాదంతో అంతమవుతాయి. అటువంటి రాగాలు తారాస్థాయిని చేరుకోవు. ఉదాహరణ - నాదనామ క్రియ రాగం.
- పంచమాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి పంచమంతో అంతమవుతాయి. ఉదాహరణ - నవరోజు రాగం.
- దైవతాంత్య రాగాలు : కొన్ని రాగాలు మధ్యస్థాయి దైవతంలో అంతమవుతాయి. ఉదాహరణ - కురంజి రాగం.
రాగాల సంఖ్య
మార్చుఒక జనకరాగం నుంచి పైన చెప్పిన లక్షణాలను పాటిస్తూ దాదాపుగా 484 జన్య రాగాలు పుట్టవచ్చు. ఇలా 72 మేళకర్తల నుంచి 34, 848 జన్య రాగాలు పుట్టే అవకాశం ఉంది. ఇక వక్రరాగాలు, భాషాంగరాగాలు లెక్కించుకుంటూ పోతే వాటికి అంతే ఉండదు. అందుకే రాగాలు అనంతాలంటారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు- A step-by-step introduction to the concept of raga for beginners
- Rajan Parrikar Music Archive – detailed analyses of ragas backed by rare audio recordings
- Comprehensive reference on raagas
- Krsna Kirtana Songs Ragamala – an informative database with over ninety rāgas (audio clips coming soon), tutorial on the North Indian notation system, rāga classification, and explanation of how rāgas work.
- Hindustani Raga Sangeet Online A rare collection of more than 800 audio & video archives from 1902. Radio programs dedicated to famous ragas.
- Online quick reference of rāgams Archived 2015-01-14 at the Wayback Machine in Carnatic music.
- Basics of Hindustani Classical Music for Listeners: a downloadable PDF, and an online video talk.
- ONLINE Data Base of 1200+Ragas with user-friendly Search Tools and Illustrative Audio Samples