మాయా బందర్

అండమాన్ ద్వీపసమూహంలోని ఉత్తర భాగంలో ఉన్న ఒక పట్టణం.

మాయాబుందర్, భారతదేశం, అండమాన్ ద్వీపసమూహంలోని మధ్య అండమాన్ ద్వీపం ఉత్తర భాగంలో భారతీయ తీరరక్షక దళం జాతీయ రహదారి 4లో ఉన్న ఒక పట్టణం. ఇది తహసీల్ కేంద్రం .దీనిని మాయా బందర్ లేదా మాయాబుందరు అని కూడా పిలుస్తారు. 2001 నాటికి, ఈ విభాగంలో 23,912 మంది నివాసితులు ఉన్నారు, వారిలో 3182 మంది పట్టణంలో ఉన్నారు. [1] బ్రిటిష్ వలసరాజ్యాల కాలంలో మయన్మార్ నుండి వలస వచ్చినవాారు, భారత భౌగోళికం నుండి మాజీ దోషులు ఇక్కడ స్థిరపడ్డారు. పరిపాలనాపరంగా, మాయాబుందర్ ఉత్తర, మధ్య అండమాన్ జిల్లాకు ప్రధాన కార్యాలయస్థానం. ఇది అండమాన్ , నికోబార్ దీవుల భూభాగంలో ఒక భాగం. [2]మాయాబందర్ ఒక పెద్ద గ్రామం. ఇది ఉత్తర, మధ్య అండమాన్ జిల్లా, అండమాన్, నికోబార్ దీవులలోని మాయాబందర్ తహసీల్ లో ఉంది.భారతదేశం రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, మాయబందర్ గ్రామాన్ని గ్రామ ప్రతినిధిగా ఎన్నుకోబడిన సర్పంచ్ (గ్రామ అధిపతి) పరిపాలనను నిర్వహిస్తారు.[3]

మాయాబుందర్

మాయా బందర్
మాయాబుందర్ is located in Andaman and Nicobar Islands
మాయాబుందర్
మాయాబుందర్
బంగాళాఖాతంలో అండమాన్ నికోబార్ దీవుల స్థానం
మాయాబుందర్ is located in Bay of Bengal
మాయాబుందర్
మాయాబుందర్
మాయాబుందర్ (Bay of Bengal)
నిర్దేశాంకాలు: 12°56′00″N 92°56′00″E / 12.9333°N 92.9333°E / 12.9333; 92.9333Coordinates: 12°56′00″N 92°56′00″E / 12.9333°N 92.9333°E / 12.9333; 92.9333
దేశం భారతదేశం
రాష్ట్రంఅండమాన్ నికోబార్
జిల్లాఉత్తర మధ్య అండమాన్
జనాభా వివరాలు
 • మొత్తం1,05,539
భాషలు
 • అధికారఆంగ్లం, హిందీ, తమిళం
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
744204
వాహన నమోదు కోడ్AN 01
లింగ నిష్పత్తి1000:925

భౌగోళికంసవరించు

మాయాబుందర్, పోర్ట్ బ్లెయిర్‌తో అండమాన్ జాతీయ రహదారి 4 (242 కి.మీ.) ద్వారా ,  ఓడ ద్వారా (136 కిమీ) ప్రయాణసౌకర్యవసతి ఉంది.. [4]

జనాభాసవరించు

2011 భారత జనాభా లెక్కలు ఆధారంగా ఈగ్రామంలో మొత్తం 805 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం 2845 మంది జనాభా ఉన్నారు. ఇందులో 1493 మంది పురుషులు కాగా, 1352 మంది మహిళలు ఉన్నారు.

మాయాబందర్లో 0-6 సంవత్సరాల వయస్సు లోపు గల పిల్లల జనాభా 351, ఇది మొత్తం గ్రామ జనాభాలో 12.34%గా ఉంది. మాయబందర్ గ్రామం సగటు లింగ నిష్పత్తి 906, ఇది అండమాన్ నికోబార్ దీవుల రాష్ట్ర సగటు 876 కన్నా ఎక్కువగా ఉంది. మాయబందర్‌ గ్రామం పిల్లల లైంగిక నిష్పత్తి 918, అండమాన్ నికోబార్ దీవుల సగటు 968 కంటే తక్కువగా ఉంది. అండమాన్ నికోబార్ దీవులతో పోలిస్తే మాయబందర్ గ్రామంలో అక్షరాస్యత తక్కువ.గ్రామ అక్షరాస్యత రేటు 82.76%, అండమాన్ నికోబార్ దీవులలో 86.63%కు ఇది తక్కువగా ఉంది. పురుషుల అక్షరాస్యత 88.02% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 76.94%.గా ఉంది.[3]

ఆర్థిక వ్యవస్థసవరించు

మాయాబుందర్ అనేక పర్యాటక ఆకర్షణలకు ఒక మార్గం, మడ అడవులతో, పక్షిజాతుల సమూహంతో కూడిన ఆటుపోట్లుండే చిన్న సముద్రపు ఏరులో ఉన్న ద్వీపం.ఇక్కడనుండి పడవద్వారా 30 ని.ల.లో ఏవస్ ద్వీపం, సముద్ర తాబేలు గూడు మైదానంగా పేరుగాంచిన కరామాటాంగ్ సముద్రతీరం (13 కి.మీ) చేరుకోవచ్చు.పోర్ట్ బ్లెయిర్, మాయాబుందర్ నుండి మాత్రమే ప్రధాన ప్రయాణీకుల నౌకలను కలిగి ఉంటాయి.

సౌకర్యాలుసవరించు

మాయబందర్‌లో మహాత్మా గాంధీ ప్రభుత్వ కళాశాల అనే కళాశాల ఉంది. 2012 డిసెంబరు 24న, భారతీయ తీరరక్షక దళం స్టేషన్ మాయాబుందర్, ఉత్తర అండమాన్ దీవులలో మొదటి తీరరక్షక దళం స్టేషనును, రక్షణ కార్యదర్శి శశి కాంత్ శర్మ ప్రారంభించాడు

మూలాలుసవరించు

  1. Government of India (2001), 2001 Census - Population Finder. (Select "Mayabunder") Accessed on 2012-07-19.
  2. Government of India (2011), Andaman and Nicobar islands, Administrative divisions 2011. Accessed on 2012-07-29.
  3. 3.0 3.1 "Mayabunder Village Population - Mayabunder - North and Middle Andaman, Andaman and Nicobar Islands". www.census2011.co.in. Retrieved 2020-12-03.
  4. "MAYABUNDER ANDAMAN ISLANDS - HOW TO PLAN AND VISIT IN 2020". www.experienceandamans.com. Retrieved 2020-01-25.

వెలుపలి లంకెలుసవరించు