ఉత్తర మధ్య అండమాన్ జిల్లా

అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మూడు జిల్లాలలో ఇది ఒకటి.

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా, బంగాళాఖాతంలోని భారతదేశ కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవులకు చెందిన మూడు జిల్లాలలో ఇది ఒకటి. దీని జిల్లా ప్రధాన కార్యాలయం మాయాబందర్ పట్టణంలో ఉంది. ఈ జిల్లా 3251.85 చ.కి.మీ.విస్తీర్ణంలో విస్తరించి ఉంది.

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా is located in India
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
ఉత్తర మధ్య అండమాన్ జిల్లా
Coordinates: 12°55′12″N 92°54′00″E / 12.92000°N 92.90000°E / 12.92000; 92.90000
దేశం భారతదేశం
రాష్ట్రంఅండమాన్ నికోబార్ దీవులు
రాజధానిమాయా బందర్
Time zoneUTC+05:30 (IST)

చరిత్ర

మార్చు

పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా 2006 ఆగస్టు 18న ఈ జిల్లా సృష్టించబడింది.[1] ఇందులో పూర్వ జిల్లాలోని మాయాబందర్ ఉపవిభాగానికి చెందిన మూడు తాలూకాలు ఉన్నాయి.

భౌగోళికం

మార్చు

ఉత్తర మధ్య అండమాన్ జిల్లా విస్తీర్నం 3,227 చ.కి.మీ 1,246 (చ.మైళ్లుకు సమానం).[2]

జనాభా

మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 105,597 జనాభా ఉంది, [3] ఇది సమారుగా టోంగా దేశానికి సమానం.[4] ఇది భారతదేశంలో 640 ర్యాంకులలో 614 వ ర్యాంకును కలిగిఉంది. జిల్లాలో జనాభా సాంద్రత చ.కి.మీ.కు 32 మంది (83 / చ. మై). 2001-2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు -0.07%. ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో ప్రతి 1000 మంది పురుషులకు లింగ నిష్పత్తి 925గా ఉంది. అక్షరాస్యత రేటు 84.25%గా ఉంది. జిల్లా జనాభాలో ఎక్కువ శాతం బెంగాలీలు .

చారిత్రక జనాభా వివరాలు

మార్చు
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19016,999—    
19116,807−0.28%
19216,874+0.10%
19317,417+0.76%
19418,225+1.04%
19517,317−1.16%
196118,901+9.96%
197135,605+6.54%
198158,716+5.13%
199184,312+3.68%
20011,05,613+2.28%
20111,05,597−0.00%
ఆధారం:[5]

భారత జనాభా లెక్కల ప్రకారం ఉత్తర మధ్య అండమాన్ జిల్లాలో 1901 నుండి 2011 వరకు జనాభా పెరుగదల, తరుగుదల వివరాలు ఈ దిగువ పట్టికలో వివరించిన ప్రకారం ఉన్నాయి.[5]

మాట్లాడే భాషలు

మార్చు

నికోబార్ దీవులలో ఎక్కువగా మాట్లాడే భాష బెంగాలీ. 2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లా జనాభాలో 53.79 శాతం బెంగాలీ మొదటి భాషగా మాట్లాడతారు. తరువాత హిందీ (17.06%), తమిళం (6.46%), కురుఖ్ (6.17%), తెలుగు (5.94%), మలయాళం (3.5%) ), నికోబారీస్ (0.57%), ఇతరులు 4.97% శాతం ఇతర భాషలను మాట్లాడుతారు.[6][6]

మయన్మార్‌లోని కైన్ స్టేట్ నుండి వచ్చిన సినో-టిబెటన్ జాతి సమూహానికి చెందిన కరెన్ ప్రజలు, మాయాబందర్, డిగ్లిపూర్ తహసిల్స్‌లోని ఎనిమిది గ్రామాల్లో సుమారు 2000 మంది ఉన్నారు.[7]

రెవెన్యూ విభాగాలు

మార్చు

ఈ జిల్లా 2006 ఆగస్టు 18న పూర్వపు అండమాన్ జిల్లాను విభజించడం ద్వారా సృష్టించబడింది.[8] wఇందులో ఈ పూర్వ జిల్లాలోని మాయాబందర్ సబ్-డివిజన్‌లోని 3 తహసీల్స్, డిగ్లిపూర్, మాయాబందర్, రంగత్ ఉన్నాయి.

మాయాబందర్ తహసీల్

మార్చు
  • వెబ్,
  • డియోపూర్,
  • లాటావ్,
  • లక్నో (బర్మాడెరా),
  • కర్మతాంగ్ -9
  • కర్మతాంగ్ -10

డిగ్లిపూర్ తహసీల్

మార్చు
  • బోరాంగ్
  • చిపోన్

రంగత్ తహసీల్

మార్చు

ఈ తహసీల్లో 79 గ్రామాలు, బకుల్తాలా అనే జనగణన పట్టణం ఉన్నాయి.[9]

ఆర్థిక వ్యవస్థ

మార్చు

2010 నాటికి, జిల్లా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు బియ్యం (సుమారు 6500 హెక్టార్లు), కొబ్బరికాయలు (3600 హెక్టార్లు), రబీ పప్పులు (2900 హెక్టార్లు), అరేకా గింజలు (1300 హెక్టార్లు), అరటిపండ్లు (650 హెక్టార్లు).[10]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  2. Srivastava, Dayawanti (2010). "States and Union Territories: Andaman Islands: Government". India 2010: A Reference Annual (54th ed.). New Delhi, India: Additional Director General, Publications Division, Ministry of Information and Broadcasting (India), Government of India. pp. 1208. ISBN 978-81-230-1617-7.
  3. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Tonga 105,916 July 2011 est.
  5. 5.0 5.1 Decadal Variation In Population Since 1901
  6. 6.0 6.1 "C-16 Population By Mother Tongue". Census of India 2011. Office of the Registrar General.
  7. Sameera Maiti (2004), "The Karen – A Lesser Known Community of the Andaman Islands" (PDF), ISLANDS of the WORLD VIII International Conference - "Changing Islands – Changing Worlds", 1–7 November 2004, Kinmen Island (Quemoy), Taiwan[permanent dead link]
  8. Law, Gwillim (2011-09-25). "Districts of India". Statoids. Retrieved 2011-10-11.
  9. "Villages & Towns in Rangat Tehsil of North and Middle Andaman, Andaman and Nicobar Islands". www.census2011.co.in. Retrieved 2023-09-26.
  10. Government of India (2011), Andaman and Nicobar Islands Statistical Hand-Book - North and Middle Andaman, 2007-08 To 2009-10

వెలుపలి లంకెలు

మార్చు