మాయాబజార్ (1936 సినిమా)
తెలుగులో మాయాబజారు ఇతివృత్తంతో వచ్చిన తొలి సినిమా. 1936లో విడుదలైన ఈ తెలుగు సినిమాకు శశిరేఖా పరిణయమని కూడా ఇంకో పేరు ఉంది. సినిమాలో సాలూరి రాజేశ్వరరావు అభిమన్యుడి పాత్ర పోషించాడు. ఈ సినిమా శాంతకుమారి తొలిచిత్రము. చిత్రపు నరసింహారావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామిరెడ్డి (ఘటోత్కచుడు), ఎమ్.సుబ్బులు (రేవతి), లక్ష్మీరాజ్యం (సత్య), మాధవపెద్ది వెంకటరామయ్య, శ్రీరంజని సీనియర్, ఎస్.పి.లక్ష్మణస్వామి, కనకం (భానుమతి), రాజవదన (రుక్మిణి) నటించారు.
మాయా బజార్ (1936 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | చిత్రపు నరసింహారావు |
---|---|
నిర్మాణం | పి.వి.దాసు |
తారాగణం | సాలూరి రాజేశ్వరరావు, శాంతకుమారి, రామిరెడ్డి (ఘటోత్కచుడు), ఎమ్.సుబ్బులు (రేవతి), లక్ష్మీరాజ్యం (సత్య), మాధవపెద్ది వెంకటరామయ్య, శ్రీరంజని సీనియర్, ఎస్.పి.లక్ష్మణస్వామి, కనకం (భానుమతి), రాజవదన (రుక్మిణి) |
సంగీతం | గాలిపెంచల నరసింహారావు |
ఛాయాగ్రహణం | కె.రామనాథ్ |
కళ | ఎ.కె.శేఖర్ |
నిర్మాణ సంస్థ | వేల్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటవర్గం
మార్చు- సాలూరి రాజేశ్వరరావు (అభిమన్యుడు)
- శాంతకుమారి (శశిరేఖ)
- రామిరెడ్డి (ఘటోత్కచుడు)
- ఎమ్.సుబ్బులు (రేవతి)
- లక్ష్మీరాజ్యం (సత్య)
- మాధవపెద్ది వెంకటరామయ్య
- శ్రీరంజని సీనియర్
- ఎస్.పి.లక్ష్మణస్వామి
- కనకం (భానుమతి)
- రాజవదన (రుక్మిణి)
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: చిత్రపు నరసింహారావు
- నిర్మాణం: పి.వి.దాసు
- సంగీతం: గాలిపెంచల నరసింహారావు
- ఛాయాగ్రహణం: కె.రామనాథ్
- కళ: ఎ.కె.శేఖర్
- నిర్మాణ సంస్థ: వేల్ పిక్చర్స్
పాటలు
మార్చు- నను వీడగ గలవే బాల - ఎస్. రాజేశ్వరరావు
- కానరావా తరుణీ శశి - ఎస్. రాజేశ్వరరావు
- ఔరా ; చేజిక్కి నట్లు (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
- అతివా నీ వదన (పద్యం) - ఎస్.పి. లక్ష్మణస్వామి
- వరశశి వదనా పంకజనయనా - ఎస్.పి. లక్ష్మణస్వామి
- ఈ అవనతి భరియీంపన్ అయో భయప్రధమౌ, గానం.తుర్లపాటి ఆంజనేయులు
- కడు వినోదమయ్యేను సఖులారా వడిగ రండ, గానం:శాంతకుమారి
- కౌరవేంద్ర సుగుణ సాంద్ర కాంతి ప్రభా చంద్రమా,
- క్షీరాబ్ధి సూతా గీర్వాననూతా ప్రేమ సంభరిత, గానం.శ్రీరంజని
- చంద్రికా వైభవంబౌరా ప్రమోదోల్లాస దాయకమై, గానం.శాంతకుమారి
- చెడు పలుకులాడేగా జడమతి ధనమధాంధుడై , గానం. ఎస్ పి లక్ష్మణస్వామి
- తృటి నడతు కుటిలాత్ములన్ క్షుభితపటు, గానం: రాయప్రోలు సుబ్రహ్మణ్యం
- దుస్సహంబౌచున్నదాహా దుర్విషాగ్న విభంభునన్, గానం.శ్రీరంజని
- దేవా కృష్ణా దివ్య ప్రభావ దివిజ వినుత, గానం.శాంతకుమారి, ఎస్ పి లక్ష్మణస్వామి
- నూశార మనపెబువు సుందరం ఓహో , గానం.బృందం
- వరాత్ములారా ఆప్తులుగారా భవ్య గుణులు,
- మదిరాదా మనవికాదా హృదయములోగల , గానం.ఎం.సుబ్బులు
- మరచితే సుయోధనా మాధవున్ నిరుపమానుడే, గానం.కొత్తూరి సత్యనారాయణ
- వివాహభోజనంబు వింతైన పాయసంబు, గానం.ఆర్.రామిరెడ్డి
- శ్రీవర మారజనక కృష్ణా సుకృతిసారా, గానం.బృందం
- సుభద్రా విదిన్ దాటగతీరునా కానున్నదేదైనా, గానం.యడవల్లి నాగేశ్వరరావు
- శుభ విధానమున పోయిరమ్మా సుభద్రా విభవం, గానం.యడవల్లి నాగేశ్వరరావు .
పద్యాలు
మార్చు1..అన్నత దోషంభు నెరుగకే యగ్రజుండు , గానం.యడవల్లి నాగేశ్వరరావు
2.అన్నమున విషమిడి ఇంటికగ్గినెట్టి , గానం.ఆర్.రామిరెడ్డి
3.అన్నా సౌభ మాకు పాండవులు మేనత్త , గానం.తుర్లపాటి ఆంజనేయులు
4.ఇంద్రపురములోన నింపార మనవార , గానం.తుర్లపాటి ఆంజనేయులు
5.కటకట రాజ్యభోగపు సుఖంబుల హాయిగా, గానం.ఎం.సుబ్బులు
6.కోరికధీర పాండవుల కొమలితో వనికంపి, గానం.రాయప్రోలు సుబ్రహ్మణ్యం
7.తత బహుజన్మలబ్ధ సూకృతంభు ఫలించే , గానం.శ్రీరంజని
8.నిర్మలంబై హిమానీకరాభంభునై నెగడు , గానం.శాంతకుమారి
9.పారావారా విజృంభనోద్దతి ఘన వ్రాతార్భటిన్ , గానం.ఆర్.రామిరెడ్డి
10.భీమసుతుడు హిడింబకు ప్రేమకొడుకు ,
11ముగ్దక్రీడల మేనలవును వహింప, గానం.ఎస్.రాజేశ్వరరావు
12.మెచ్చిరే దేవకాంతలను మించిన రూపసి, గానం.ఎం.సుబ్బులు
13.వలదా సందియ మిట్టివేళ కనలేవా , గానం.కొత్తూరి సత్యనారాయణ .
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.