మాయ కజాన్

అమెరికన్ నాటకరంగ, టీవి, సినిమా నటి

మాయ కజాన్ [1] అమెరికన్ నాటకరంగ, టీవి, సినిమా నటి. టెలివిజన్ ధారావాహిక ది నిక్ (2014–2015)లో నటించిన ఎలియనోర్ గాలింగర్ పాత్రతో ప్రసిద్ది పొందింది.

మాయ కజాన్
మాయ కజాన్ (2015)
జననం (1986-11-24) 1986 నవంబరు 24 (వయసు 38)
విద్యవెస్లియన్ విశ్వవిద్యాలయం
వృత్తినాటకరంగ, టీవి, సినిమా నటి
క్రియాశీల సంవత్సరాలు2008–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
టెడ్ ఫెల్డ్‌మాన్
(m. 2018)
పిల్లలు1
తల్లిదండ్రులునికోలస్ కజాన్
రాబిన్ స్వికార్డ్
బంధువులుజో కజాన్ (సోదరి)
ఎలియా కజాన్ (తాత)
మోలీ కజాన్ (నానమ్మ)

మాయ కజాన్ 1986, నవంబరు 24న[2][3] స్క్రీన్ ప్లే రచయిత నికోలస్ కజాన్, రాబిన్ స్వికార్డ్ ల దంపతులకు కాలిఫోర్నియాలోని లాస్ ఎంజిల్స్ నగరంలో జన్మించింది. సినీ దర్శకుడు ఎలియా కజాన్, నాటక రచయిత మోలీ కజాన్ మనవరాలు. [4] ఆమె సోదరి నటి జో కజాన్.

వృత్తిరంగం

మార్చు

నాటకరంగం

మార్చు

2012లో న్యూజెర్సీలోని విలియం షేక్‌స్పియర్ థియేటర్‌లో డేవిడ్ ఇవ్స్ రాసిన పియరీ కార్నెయిల్ ది లయర్‌లో లూక్రీస్‌గా నటించింది.[5][6]

2013లో న్యూయార్క్‌లోని వాకర్‌స్పేస్ థియేటర్‌లో మైఖేల్ రాబే రాసిన ది ఫ్యూచర్ ఈజ్ నాట్ వాట్ వాట్ వాస్‌ అనే నాటకంలో లారా పాత్రను పోషించింది.[7][8][9]

2014లో ఓల్డ్ గ్లోబ్ థియేటర్‌లో విలియం షేక్స్‌పియర్ రాసిన ది వింటర్స్ టేల్‌ నాటకంలో వయోజన పెర్డిటా పాత్రను పోషించింది.[10]

టెలివిజన్

మార్చు

2014లో సహనటులు క్లైవ్ ఓవెన్, ఈవ్ హ్యూసన్, గ్రేంగర్ హైన్స్‌లతో కలిసి స్టీవెన్ సోడర్‌బర్గ్ ది నిక్ ఆన్ సినిమాక్స్‌లో ఎలియనోర్ గ్యాలింగర్‌గా నటించింది.[11] 2014లో హెచ్.బి.ఓ. బోర్డ్‌వాక్ ఎంపైర్‌లో ఒక యువ నకీ థాంప్సన్ భార్య మాబెల్ థాంప్సన్ పాత్రను పోషించింది. సిరీస్ ఐదవ, చివరి సీజన్ అంతటా ఫ్లాష్‌బ్యాక్‌ల స్ట్రింగ్‌లో నటించింది.

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2008 క్రిస్టీ మే క్రిస్టీ మే షార్ట్ ఫిల్మ్
2008 లెనోర్ లెనోర్ షార్ట్ ఫిల్మ్
2009 ఐ విల్ నెవర్ స్మైల్ అగెయిన్ అమీ షార్ట్ ఫిల్మ్
2011 లవ్ ఈజ్ లైక్ లైఫ్ బట్ లాంగర్ యువ సన్యాసి షార్ట్ ఫిల్మ్
2011 త్రీ థింగ్స్ షార్ట్ ఫిల్మ్
2012 ట్రయల్ బై కంబత్ ఎమిలీ షార్ట్ ఫిల్మ్
2012 ఎవ్రీ స్టాటర్డే హన్నా
2012 వేర్ ది షార్పెస్ట్ నైఫ్ వాస్ కెప్ట్ కార్లా షార్ట్ ఫిల్మ్
2012 ఫ్రాన్సిస్ హా కరోలిన్
2013 బ్లడ్ మూన్ మాన్య
2015 ప్రిజం ఆభరణాలు
2018 దొ యునికార్న్ కేటీ
2019 ప్లస్ వన్ షైనా
2020 లవ్ ఈజ్ లవ్ ఈజ్ లవ్ కరోలిన్
2020 అలియాస్ బర్త్ జెన్నా
2020 యూజ్ లెస్ మ్యూమన్స్ వెండి
2021 ది లిటిల్ థింగ్స్ రోండా రాత్‌బన్

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
2013 కంపెనీ టౌన్ మార్లా టీవీ చిత్రం
2014 బోర్డువాక్ ఎంఫైర్ మాబెల్ జెఫ్రీస్-థాంప్సన్ 4 ఎపిసోడ్‌లు
2014–15 ది నిక్ ఎలియనోర్ గాలింగర్ 13 ఎపిసోడ్‌లు
2015–16 స్లీపీ హాలో జో కోరింత్ పునరావృతం (సీజన్ 3)
2017 జేన్ ది వర్జిన్ క్లోయ్ పునరావృతం (సీజన్ 3)
2017 జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లివి హార్ట్ పునరావృతం (సీజన్ 1)
2018 మొజాయిక్ లారా హర్లీ 8 ఎపిసోడ్‌లు
2018 ఇంపోస్టర్స్ డిప్యూటీ కిమ్ బుల్లక్ ఎపిసోడ్: "ఫిలియన్ బోలార్ కింగ్"
2020 యుతోపియా ఒలివియా ఎపిసోడ్: "లైఫ్ బిగిన్స్"
2020 హోమ్ కమింగ్ కాయ ఎపిసోడ్:"గతంలో"
2021 లవ్ లైఫ్ ఎమిలీ హెక్స్టన్ సీజన్ 2

మూలాలు

మార్చు
  1. Dictionary.com – Kazan
  2. "South Coast Repertory: Keeping Up with the Kazans". South Coast Repertory. December 10, 2013. Retrieved 2023-06-16.
  3. "Happiest birthday @maya_kazan !!!". Twitter. November 25, 2014. Retrieved 2023-06-16.
  4. McGlone, Peggy (July 6, 2012). "East of Hollywood: Actress Maya Kazan enters the family business". NJ.COM. Retrieved 2023-06-16.
  5. SOMMERS, MICHAEL (July 13, 2012). "A Tangled Web of Tall Tales, Told in Verse A Review of 'The Liar,' at the Shakespeare Theater of New Jersey". New York Times. Retrieved 2023-06-16.
  6. Rendell, Bob. "The Liar: David Ives 2010 Verse "Translaptation" of Obscure 1643 Corneille Comedy". talkinbroadway.com. Retrieved 2023-06-16.
  7. Gates, Anita (January 25, 2013). "A Dead Date: That'll Kill a Romance The Future Is Not What It Was, at Walkerspace". New York Times. Retrieved 2023-06-16.
  8. Evans, Suzy (January 21, 2013). "The Future Is Not What It Was' Is Messy but Promising". Backstage (magazine). Retrieved 2023-06-16.
  9. Barbour, David (January 22, 2013). "Theatre in Review: The Future is Not What it Was (Kindling Theatre Company/Walkerspace)". Lighting & Sound America. Retrieved 2023-06-16.
  10. McNulty, Charles (February 19, 2014). "Review: 'The Winter's Tale' thaws the heart with magic, melodrama". Los Angeles Times. Retrieved 2023-06-16.
  11. "8 things to watch this week". New York Post. September 7, 2014. Retrieved 2023-06-16.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మాయ_కజాన్&oldid=3921793" నుండి వెలికితీశారు