మార్కో (2025 సినిమా)
మార్కో (ఆంగ్లం: Marco), మలయాళంలో విజయవంతమైన ఈ సినిమా 2025 జవనరి 1న తెలుగులో విడుదల అయింది.[1] హనీఫ్ అడేని దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మార్కోని క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్, ఉన్ని ముకుందన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రంలో సిద్దిక్, జగదీష్, అభిమన్యు ఎస్ తిలకన్, కబీర్ దుహాన్ సింగ్, అన్సన్ పాల్, యుక్తి తారేజా ప్రధాన పాత్రల్లో నటించారు. రవి బస్రూర్ సంగీతం సమకూర్చగా, ఛాయాగ్రహణం చంద్రు సెల్వరాజ్, ఎడిటింగ్ షమీర్ ముహమ్మద్ నిర్వహించారు.
మార్కో | |
---|---|
దర్శకత్వం | హనీఫ్ అదేని |
రచన | హనీఫ్ అదేని |
నిర్మాత | షరీఫ్ ముహమ్మద్ |
తారాగణం | ఉన్ని ముకుందన్ |
ఛాయాగ్రహణం | చంద్రు సెల్వరాజ్ |
కూర్పు | షమీర్ ముహమ్మద్ |
సంగీతం | రవి బస్రూర్ |
నిర్మాణ సంస్థ | క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ |
పంపిణీదార్లు | క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్ |
విడుదల తేదీ | 1 జనవరి 2025 |
దేశం | భారతదేశం |
మార్కో 2024 డిసెంబరు 20న ప్రపంచవ్యాప్తంగా మలయాళ భాషలో విడుదలై, విమర్శకుల ప్రశంసలు అందుకుంది, ఇది కమ్మటిపాదం (2016) చిత్రాన్ని అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన ఎ-రేటెడ్ మలయాళ చిత్రంగా నిలిచింది.[2] అలాగే, ఇది అన్ని కాలాలలో అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రాలలో ఒకటిగా కూడా నిలిచింది.
తారాగణం
మార్చు- మార్కో డి'పీటర్‌గా ఉన్ని ముకుందన్
- మార్కో పెంపుడు అన్నయ్య జార్జ్ డి'పీటర్‌గా సిద్ధిక్
- రస్సెల్ తండ్రి టోనీ ఐజాక్‌గా జగదీష్
- టోనీ కొడుకు రస్సెల్ ఐజాక్‌గా అభిమన్యు ఎస్ తిలకన్
- టోనీ దత్తపుత్రుడు సైరస్ ఐజాక్‌గా కబీర్ దుహన్ సింగ్
- అన్సన్ పాల్ దేవరాజ్ / దేవ్, టోనీ యొక్క అనుచరుడు
- యుక్తి తరేజా మారియాగా, మార్కోకు కాబోయే భార్య
- మార్కో పెంపుడు తమ్ముడు విక్టర్ డి'పీటర్‌గా ఇషాన్ షౌకత్
- ఇషా డి'పీటర్‌గా దుర్వా థాకర్, విక్టర్ స్నేహితురాలు, భార్య
- మాథ్యూస్, మార్కో బావగా శ్రీజిత్ రవి
- మార్కో పెంపుడు తండ్రి పీటర్ డి మార్కోగా మాథ్యూ వర్గీస్
- జహంగీర్‌గా అజిత్ కోశి, టోనీ అనుచరుడు
- సీఐ అశోక్, విచారణ అధికారిగా దినేష్ ప్రభాకర్
- తారిక్ అనే అవినీతిపరుడైన వ్యాపారవేత్తగా అర్జున్ నందకుమార్
- లిషోయ్ అడట్టు వర్గీస్, జార్జ్ మేనమామ
- మార్కో స్నేహితుడిగా రియాజ్ ఖాన్
- మీరా నాయర్
- జార్జ్ భార్య సెలీనాగా బిందు సంజీవ్
- మార్కో పెంపుడు సోదరి ఆన్సి మాథ్యూస్‌గా సజిత శ్రీజిత్
- చిత్ర ప్రసాద్
- ఎస్‌ఐ షాహుల్ హమీద్‌గా సునీష్ నంబియార్
మూలాలు
మార్చు- ↑ "Marco Review: రివ్యూ: మార్కో.. మలయాళ హిట్ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందా? | marco-review-unni-mukundan". web.archive.org. 2024-12-31. Archived from the original on 2024-12-31. Retrieved 2024-12-31.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Marco box office collection Day 1: Unni Mukundan's film beats Dulquer Salmaan's Kammatipaadam". OTTPlay (in ఇంగ్లీష్). Retrieved 2024-12-24.