మార్టినిక్‌లో హిందూమతం

మార్టినిక్‌లో ఇండో-మార్టినిక్కులు హిందూమతాన్ని ఆచరిస్తారు. 2007 నాటికి, మార్టినిక్ జనాభాలో హిందువులు 0.3% మంది ఉన్నారు. [1]

చరిత్ర

మార్చు

1848లో బానిసత్వాన్ని రద్దు చేసిన తరువాత, తోటల యజమానులు 1853 నుండి ఉపఖండం నుండి భారతీయులను దిగుమతి చేసుకోవడం ద్వారా తమ కార్మిక అవసరాలను తీర్చుకున్నారు. ఈ వలసదారులు తమ హిందూమతాన్ని తమతో పాటు తెచ్చుకున్నారు. అనేక హిందూ దేవాలయాలు ఇప్పటికీ మార్టినిక్‌లో వాడుకలో ఉన్నాయి. 1987లో, వారి రహస్య వేడుకల గురించిన వ్యక్తిగత వివరణను ఆ వేడుకల్లో పాల్గొన్న ఒక హిందువు ప్రచురించాడు.

1887లో మార్టినిక్‌ని సందర్శించిన ఫ్రెంచ్ కళాకారుడు పాల్ గాగిన్‌కు ఇక్కడి హిందూమతం యొక్క చిహ్నాలు, సంజ్ఞలు, పురాణాలు ఒక ముఖ్యమైన ప్రేరణ కలిగించాయి.

జనాభా వివరాలు

మార్చు

అయితే ఇండో-మార్టినిక్కులు ద్వీప జనాభాలో సుమారు 10% వరకు ఉన్నారు. వారిలో 15% మాత్రమే ఇప్పటికీ హిందువులుగా ఉన్నారు. [2]

హిందువులు, క్వింబోయిజర్‌లు (మార్టినిక్‌లోని మరొక మతం) ప్రపంచవ్యాప్తంగా హిందువులతో సంబంధం లేకపోవడం వల్ల తమను తాము క్యాథలిక్కులుగా పరిగణిస్తారు. [3] మాల్డెవిడాన్ స్పిరిటిస్ట్స్ అనేది మార్టినిక్‌లోని ఒక సింక్రెటిక్ మతం. ఇది హిందూమతంలోని అంశాలను, క్రైస్తవం లోని అంశాలనూ కలగలిసి ఉంటుంది. ఇది ప్రధాన దేవత మాల్డెవిడాన్ (మదురై వీరన్) ను జీసస్ క్రైస్ట్‌తో, రెండవ అతి ముఖ్యమైన దేవత మారి-ఎమాన్ ( మరియమ్మన్ ) వర్జిన్ మేరీతో అనుబంధిస్తుంది. ఇది ద్వీపపు ఉత్తర ప్రాంతాలలో సర్వసాధారణంగా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో చాలా పుణ్యక్షేత్రాలు, సమావేశ స్థలాలూ ఉంటాయి. ఆచారాలలో డప్పులు వాయించడం, పదును పెట్టిన కొడవళ్లపై నృత్యం చేయడం, కోళ్ళు, గొర్రెలు వంటి జంతువులను బలి ఇవ్వడం వంటివి ఉన్నాయి. [4]

సమకాలీన స్థితి

మార్చు

మార్టినిక్‌లోని హిందూమతం అనేది తమిళ హిందూమత రూపం. జంతుబలి ఆచారం, గ్రామ దేవతలను పూజించడం, తమిళ భాషను ఆచార భాషగా ఉపయోగించడం ఈ మతావలంబికుల్లో ఉంది. అయితే, ఈ భాష తోటల కాలంలోను, ఆ తరువాతి కాలం నాటి సమాజంలోనూ వాడుక కోల్పోయింది. [5]

ఇక్కడి ప్రధాన హిందూ దేవతలు మరియమ్మన్ (స్థానికంగా మారిమెన్ అని పిలుస్తారు), మదురై వీరన్ (స్థానికంగా మాదేవిలెన్ అని పిలుస్తారు). [6] మార్టినిక్‌లోని బస్సే-పాయింట్‌లో 19వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రిక హిందూ దేవాలయం ఉంది. ఇది ఇప్పటికీ వాడుకలో ఉంది. [7] [8]

ఇటీవలి సంవత్సరాలలో మార్టినిక్‌లో హిందూ మేళా కార్యక్రమాలతో సహా హిందూమతం పునరుద్ధరణ జరిగింది. [9]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. http://www.worldmap.org/uploads/9/3/4/4/9344303/martinique_profile.pdf
  2. "Tamil (Christian traditions) in Martinique".
  3. "Culture of Martinique - history, people, women, beliefs, food, customs, family, social, dress".
  4. http://www.worldmap.org/uploads/9/3/4/4/9344303/martinique_profile.pdf
  5. Taylor, Patrick; Case, Frederick I. (2013-04-30). The Encyclopedia of Caribbean Religions: Volume 1: A - L; Volume 2: M - Z (in ఇంగ్లీష్). University of Illinois Press. ISBN 9780252094330.
  6. Taylor, Patrick; Case, Frederick I. (2013-04-30). The Encyclopedia of Caribbean Religions: Volume 1: A - L; Volume 2: M - Z (in ఇంగ్లీష్). University of Illinois Press. ISBN 9780252094330.
  7. "Martinique".[permanent dead link]
  8. "Basse-Pointe Review - Martinique Caribbean - Sights | Fodor's Travel".
  9. "Culture of Martinique - history, people, women, beliefs, food, customs, family, social, dress".