మాలపల్లి అనేది ఉన్నవ లక్ష్మీనారాయణ 1922లో రాసిన తెలుగు నవల.[1] హరిజనోద్ధరణ ధ్యేయంగా రాయబడిన ఈ నవలను నగ్నముని 1974లో మాలపల్లి (నాటకం) నాటకీకరణ చేయగా ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వం వహించి ప్రదర్శించారు.[2] ఈ ప్రదర్శనలో 12 రంగస్థలాలు ఉంటాయి. అన్ని రంగస్థలాలలపై ఏకకాలంలో ప్రదర్శన జరుగుతూ ఉంటుంది. ఇన్ని దృశ్యాలు ఒకేసారి రంగస్థలాలపై కన్పించేసరికి ఒక గ్రామాన్ని చూస్తున్న భావం కలుగుతుంది. దీన్నే జీవనాటకం అంటారు.[3]

నాటక ప్రేరణ మార్చు

1973లో ఇరాన్ లో జరిగిన ప్రపంచ నాటకోత్సవంలో పాల్గొన్న ఎ.ఆర్.కృష్ణ అక్కడ జపాన్ వారి ’తెరియామా‘ నాటక ప్రయోగం చూడడం జరిగింది. ఒక పార్క్ లో, భవనం ముందు, భవనం మీద, చెట్లమీద భవనం లోపల రంగస్థలాలలుగా ప్రదర్శంచడం ఆయన్ని ఆశ్చర్యానికి లోను చేయడమేకాకుండా ప్రభావితుణ్ని చేసింది. కోటప్పకొండ ప్రభలు, గద్వాలలో మూడంతస్థుల పందిళ్లపై సంగీత నాటక కార్యక్రమాలు, షేక్స్ పియర్ నాటక రంగస్థలం, తెరియామా ప్రదర్శన మాలపల్లి రంగస్థల రచనకు ధైర్యం, ఆలోచలను కలిగించాయి.

మూలాలు మార్చు

  1. ABN (2021-12-05). "దళితుల జీవితాలను ప్రస్ఫుటించిన.. మాలపల్లి". Andhrajyothy Telugu News. Archived from the original on 2022-10-25. Retrieved 2022-10-25.
  2. "తెలుగు నాటక ప్రచురణలో విప్లవం". Prajasakti (in ఇంగ్లీష్). 2021-11-15. Archived from the original on 2021-11-15. Retrieved 2022-10-25.
  3. "నాటకం-వామపక్ష భావజాలం | జాతర | www.NavaTelangana.com". NavaTelangana. 2015-12-08. Archived from the original on 2020-03-27. Retrieved 2022-10-25.