మాలినీ అవస్థి (జననం 1967 ఫిబ్రవరి 11) భారతీయ జానపద గాయని.[1][2] ఆమె భోజ్‌పురి, అవధి, హిందీ భాషలలో పాడింది. ఆమె తుమ్రీ, కజ్రీ వంటి శాస్త్రీయ శైలిలో కూడా ఆలపిస్తుంది. 2016లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆమె భోజ్‌పురి సంగీతంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది.

మాలిని అవస్థి
వ్యక్తిగత సమాచారం
జననం (1967-02-11) 1967 ఫిబ్రవరి 11 (వయసు 57)
కన్నౌజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మూలంలక్నో, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిభారతీయ జానపద సంగీతం
వృత్తిజానపద గాయకురాలు

కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ విధించిన జనతా కర్ఫ్యూపై ఆమె పాడిన పాటను ప్రధాని ట్విటర్‌ వేదికగా షేర్‌ చేయగా అప్పట్లో వైరల్ అయింది.[3]

బాల్యం, విద్యాభ్యాసం

మార్చు

మాలినీ అవస్థి ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో జన్మించింది. ఆమె లక్నోలోని భత్‌ఖండే విశ్వవిద్యాలయం నుండి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో బంగారు పతకం సాధించింది.[4][5] అలాగే ఆమె లక్నో విశ్వవిద్యాలయంలో ఎం.ఎ ఆధునిక చరిత్ర కు కూడా బంగారు పతకాన్ని సాధించింది. ఆమె లెజెండరీ హిందుస్థానీ క్లాసికల్ సింగర్, బనారస్ ఘరానాకు చెందిన పద్మవిభూషణ్ విదుషి గిరిజా దేవి విద్యార్థి. ఆమె ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన సీనియర్ IAS అధికారి అవనీష్ కుమార్ అవస్థిని వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు అద్వితీయ, కూతురు అనన్య ఉన్నారు.[6]

కెరీర్

మార్చు

మాలినీ అవస్థి ప్రసిద్ధ శాస్త్రీయ సంగీత ఉత్సవం జహాన్-ఎ-ఖుస్రూలో ప్రదర్శనలు ఇవ్వడం సర్వసాధారణమైంది.[7] హై పిచ్ గాత్రాన్ని కలిగిన ఆమె థుమరి, తారే రహో బాంకే శ్యామ్ పాటలకు ప్రసిద్ధి చెందింది.

ఆమె భోజ్‌పురి - మ్యూజికల్ రియాలిటీ షో సుర్ సంగ్రామ్ కి న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఎన్టీటీవీ ఇమాజిన్స్ జునూన్ కార్యక్రమంలో ఆమె పాల్గొంది.

ఎన్నికల కమిషన్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం 2012, 2014 సంవత్సరాలలో ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది.[8]

అను మాలిక్ సంగీతం అందించిన 2015 చిత్రం దమ్ లగా కే హైషాలో ఆమె సుందర్ సుశీల్ పాట పాడింది.

ఫిల్మోగ్రఫీ

మార్చు
  • జై హో ఛత్ మైయా - శైలేంద్ర సింగ్, మాలిని అవస్థి
  • భోలే శంకర్
  • బమ్ బంమ్ బోలే
  • ఏజెంట్ వినోద్
  • దమ్ లగా కే హైషా
  • భగన్ కే రేఖన్ కి – ఇస్సాక్ (2013 చిత్రం)
  • చార్ఫుటియా చోకరే (2014 చిత్రం)

అకడమిక్ గౌరవాలు, ఫెలోషిప్‌లు

మార్చు
 
2016లో న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో మాలినీ అవస్థికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ

పురస్కారాలు

మార్చు
  • 2016లో పద్మశ్రీ[9]
  • 2006లో యశ్ భారతి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం[10]
  • ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్
  • సంగీత నాటక అకాడమీ

బాహ్య లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Malini Awasthi mesmerises audience". The Times of India. Archived from the original on 2012-07-01.=
  2. "It's the villages where folk music is disappearing faster". The Times Of India. 2011-09-19.
  3. "జనతా కర్ఫ్యూపై పాట.. షేర్‌ చేసిన మోదీ". EENADU. Retrieved 2023-02-24.
  4. Mohita Tewari (Nov 3, 2020). "Malini Awasthi to collect gold medal from Lucknow University after 33 yrs | Lucknow News – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-05-31.
  5. "Low at Bhatkhande". The Times of India. 2009-09-09. Archived from the original on 2012-07-07.
  6. "Malini Awasthi slow interview". Gaon Connection. Archived from the original on 2023-02-10. Retrieved 2023-02-24.
  7. Tripathi, Shailaja (2010-02-25). "Hues of Hori". The Hindu. Chennai, India.
  8. "Election Commission 'sveeps' polls in first phase". The Times Of India. 2012-02-09.
  9. "IAS की बीवी ने भोजपुरी को दी पहचान, मिला पद्म श्री अवॉर्ड". Dainik Bhaskar. 28 March 2016.
  10. "Yash Bharti to 13 personalities". 17 January 2006.