మాళవిక సరుక్కై
మాళవిక సరుక్కై ఒక భరతనాట్య కళాకారిణి, నృత్య దర్శకురాలు.[1][2][3]ఈమెకు 2002లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[4] 2003లో భారతప్రభుత్వం నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో ఈమెను సత్కరించింది.[5]
మాళవిక సరుక్కై | |
---|---|
జననం | 1959 తమిళనాడు, భారతదేశం |
వృత్తి | శాస్త్రీయ నృత్యకళాకారిణి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరతనాట్యం |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
జీవిత విశేషాలు
మార్చుఈమె 1959, జూన్ 15వ తేదీన బొంబాయిలో జన్మించింది.[6] ఈమె తన 7వ యేటి నుండి కె.కళ్యాణసుందరం పిళ్ళై వద్ద తంజావూరు బాణీలో, ఎస్.కె.రాజరత్నం పిళ్ళై వద్ద వళువూర్ బాణీలో భరతనాట్యం నేర్చుకుంది.[7][8][9] ఇంకా ఈమె కళానిధి నారాయణన్ నుండి అభినయాన్ని, కేలూచరణ్ మహాపాత్ర, రమణి రాజన్ జెనాల నుండి ఒడిస్సీ నృత్యాన్ని నేర్చుకుంది.[7][8][9] ఈమె తన 12వ యేట ముంబైలో తొలి ప్రదర్శన ఇచ్చింది.[7][10] తరువాత దేశంలోని అనేక ప్రాంతాలలో[11][12] విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చింది.[13][14] వాటిలో న్యూయార్క్‌లోని లింకన్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, [15] జాన్ ఎఫ్.కెన్నెడి సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, [16] చికాగో[17]లలో ఇచ్చిన ప్రదర్శనలు ముఖ్యమైనవి. ఈమె జీవితాన్ని, నాట్యప్రదర్శనలను సమర్పణం పేరుతో భారత ప్రభుత్వం డాక్యుమెంటరీ సినిమా రూపంలో రికార్డు చేసింది.[7][8][13] ఈమెపై బి.బి.సి. డాన్సింగ్ పేరుతో 9 గంటల టెలివిజన్ డాక్యుమెంటరీని నిర్మించింది.[7][8][10] నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ముంబై ఈమెపై ద అన్‌సీన్ సీక్వెన్స్ - ఎక్స్‌ప్లోరింగ్ భరతనాట్యం త్రూ ద ఆర్ట్ ఆఫ్ మాళవిక సరుక్కై మరొక డాక్యుమెంటరీని నిర్వహించింది.[10]
అవార్డులు, గుర్తింపులు
మార్చుఈమెకు కేంద్ర సంగీత నాటక అకాడమీ 2002లో భరతనాట్యంలో అవార్డును ప్రకటించింది.[4][7] ఈమె ఇంకా "తమిళనాడు ఐయల్ ఇసై నాటక మన్రమ్" నుండి కళైమామణి పురస్కారాన్ని, మృణాళినీ సారాభాయ్ అవార్డును, [13] నృత్య చూడామణి బిరుదును, సంస్కృతి అవార్డును, హరిదాస్ సమ్మేళన్ అవార్డును పొందింది.[2][7] 2003లో భారతప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి సత్కరించింది.[2][5][7]
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "INK Talks". INK Talks. 2015. Retrieved 8 February 2015.
- ↑ 2.0 2.1 2.2 "Kennedy Center". Kennedy Center. 2015. Retrieved 8 February 2015.
- ↑ "Walk The Talk with Malavika Sarukkai". NDTV. February 2006. Retrieved 8 February 2015.
- ↑ 4.0 4.1 "Sangeet Natak AKademi Award". Sangeet Natak AKademi. 2015. Archived from the original on 30 మే 2015. Retrieved 26 ఏప్రిల్ 2021.
- ↑ 5.0 5.1 "Padma Awards" (PDF). Padma Awards. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 26 ఏప్రిల్ 2021.
- ↑ web master. "Malavika Sarukkai". Oxford Reference. Retrieved 26 April 2021.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 7.6 7.7 "Indian Arts". Indian Arts. 2015. Archived from the original on 24 సెప్టెంబరు 2015. Retrieved 8 February 2015.
- ↑ 8.0 8.1 8.2 8.3 "Bengal Foundation". Bengal Foundation. 2015. Archived from the original on 8 February 2015. Retrieved 8 February 2015.
- ↑ 9.0 9.1 Malavika Sarukkai (2015). "Interview" (Interview). Interviewed by Veejay Sai. Retrieved 8 February 2015.
- ↑ 10.0 10.1 10.2 "Blouin Art Info". Blouin Art Info. 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2015. Retrieved 8 February 2015.
- ↑ "Malavika Sarukkai: A tribute to Thimmakka". INKTalks. 13 November 2013. Retrieved 8 February 2015.
- ↑ "Padmashri Malavika Sarukkai Performs Bharatanatyam - Yaksha 2014". Isha Foundation. 21 February 2014. Retrieved 8 February 2015.
- ↑ 13.0 13.1 13.2 "Canary Promo". Canary Promo. 2015. Archived from the original on 8 ఫిబ్రవరి 2015. Retrieved 8 February 2015.
- ↑ "TOI India performance". TOI. 27 June 2012. Retrieved 8 February 2015.
- ↑ "Huffington Post". Huffington Post. 21 December 2013. Retrieved 8 February 2015.
- ↑ Seibert, Brian (18 November 2012). "Stories Told With a Leap, Even a Shake". New York Times. Retrieved 18 May 2017.
- ↑ "Pulse Connects". Pulse Connects. 2015. Archived from the original on 8 February 2015. Retrieved 8 February 2015.
బయటి లింకులు
మార్చు- "Malavika Sarukkai: A tribute to Thimmakka". INKTalks. 13 November 2013. Retrieved 8 February 2015.
- "Padmashri Malavika Sarukkai Performs Bharatanatyam - Yaksha 2014". Isha Foundation. 21 February 2014. Retrieved 8 February 2015.
- "Walk The Talk with Malavika Sarukkai". NDTV. February 2006. Retrieved 8 February 2015.