ఎక్కిరాల కృష్ణమాచార్య
ఎక్కిరాల కృష్ణమాచార్య (ఆగష్టు 11, 1926 - మార్చి 17, 1984) ఆంధ్రప్రదేశ్కు చెందిన రచయిత, ఆధ్యాత్మిక గురువు, హోమియో వైద్యుడు. ఆయన శిష్యులు ఆయనను మాస్టర్ ఇ. కె. అని పిలుచుకుంటుంటారు. ఈయన పేదవారికి వైద్య సహాయం అందించడం కోసం 100 కి పైగా ఉచిత హోమియో వైద్యశాలలను స్థాపించారు. 1971 లో వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే సంస్థను స్థాపించారు.
జననం
మార్చుఈయన 1926, ఆగష్టు 11వ తేదీన ఆంధ్రప్రదేశ్కు చెందిన గుంటూరు జిల్లా, బాపట్లలో అనంతాచార్యులు, బుచ్చమ్మ దంపతులకు జన్మించాడు. ఈయన తెలుగు, సంస్కృత, ఆంగ్ల భాషలలో పాండిత్యాన్ని సాధించాడు. 'పాండురంగ మాహాత్మ్యం' కావ్యంపై పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని రాసి డాక్టరేట్ సాధించాడు. గుంటూరులోని హిందూ కళాశాలలోను, తరువాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులోను తెలుగు ఉపన్యాసకుడుగా పనిచేశాడు. వీరి రచనలలో 'రాసలీల', 'ఋతుగానం', 'గోదా వైభవం', 'అశ్వత్థామ సుభద్ర', 'అపాండవము', 'స్వయంవరము', 'పురాణ పురుషుడు', 'పురుష మేధము', 'లోకయాత్ర' లు మంచి ప్రచారం పొందాయి. జయదేవుని 'గీత గోవిందము'ను 'పీయూష లహరి' అనే పేరుతో తెలుగులోకి అనువదించారు.
ఈయన ఐరోపాలో పర్యటించి సనాతన భారత ధర్మానికి అక్కడ ప్రచారాన్ని కల్పించి, జగద్గురువుగా ఖ్యాతిగాంచాడు. 'వరల్డు టీచర్స్ ట్రస్టు' (జగద్గురు పీఠం) అనే సంస్థను స్థాపించి తన బోధనలు తగు ప్రచారం పొందే ఏర్పాటుచేసాడు. ఈయన కృషి ఫలితంగా జెనీవా నగరంలో మొరియా విశ్వవిద్యాలయం రూపొందింది. ఇది మానవ జీవితానికి ఆవశ్యకాలైన తత్వశాస్త్ర, వైద్యశాస్త్రాలను సమగ్రంగా సమన్వయించే విద్యాపీఠం. హోమియోపతి వైద్యవిధానం భారత దేశ ఆర్థిక పరిస్థితికి చక్కగా సరిపోతుందని భావించి, ఈయన కొన్ని కేంద్రాలలో ఉచిత హోమియో వైద్యాలయాలను నెలకొల్పారు. ఈ వైద్యశాస్త్రాన్ని వివరించే సారస్వతాన్ని తెలుగులోను, ఆంగ్లంలోను రచించారు.
భగవద్గీత రహస్యాల మీద ఈయన వ్రాసిన శంఖారావం పుస్తకం అద్వైతానికి విస్తృత భాష్యం, వివరణ ఇస్తుంది.
మరణం
మార్చుమూలాలు
మార్చు- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
యితర లింకులు
మార్చువీడియో
మార్చు- Showers of Piousness in Vizag: (video) Showing Bhaktaraj Maharaj's relation with Master E K and Vishakhapattanam/Vizag