మాస్టర్ ప్రభాకర్ రెడ్డి

మాస్టర్ ప్రభాకర్ రెడ్డి (జ. 1983, జనవరి 22) మార్షల్ ఆర్ట్స్ కళాకారుడు.[1] మార్షల్ ఆర్ట్స్ రంగంలో 29 గిన్నిస్ ప్రపంచ రికార్డులు సాధించిన తొలి భారతీయుడు. అనేక జాతీయ, అంతర్జాతీయ రికార్డులు సాధించాడు. ప్రస్తుతం ఇతను ఆరవ (6వ) బ్లాక్ డాన్.

మాస్టర్ ప్రభాకర్ రెడ్డి
Master Prabhakar Reddy. jpg.jpg
ఛాయాచిత్రపటం
జననం (1983-01-22) 1983 జనవరి 22 (వయస్సు 38)
జాతీయతభారతీయుడు
విద్యఆంధ్రా యూనివర్సిటీ
వృత్తిమార్షల్ ఆర్ట్స్ శిక్షకుడు
క్రియాశీల సంవత్సరాలు1994 - ప్రస్తుతం
సుపరిచితుడుఇండియన్ మార్షల్ మాంక్ వారియర్
జీవిత భాగస్వామిప్రతిమ
తల్లిదండ్రులుశంకర్ రెడ్డి, నాగేశ్వరం

బాల్యంసవరించు

ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు నగరంలోని ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు.[2] ప్రభాకర్ చిన్న వయసులోనే వారి కుటుంబం హైదరాబాద్ నగరానికి వలస వెళ్లారు. ప్రభాకర్ తన 11వ ఏట మార్షల్ ఆర్ట్స్ యుద్ధకళ లోకి అడుగు పెట్టాడు. ఒక వైపు చదువు కొనసాగిస్తూనే తన రంగంలో శిక్షణ తీసుకున్నాడు.

విద్యాభ్యాసంసవరించు

ప్రభాకర్ రెడ్డి తన ప్రాధమిక విద్యను నెల్లూరు లో పూర్తి చేశాడు. ఇంటర్ విద్యను హైదరాబాద్ లో చేసాడు. డిగ్రీ (బీ.ఏ) విద్యను విశాఖపట్నం లో ని ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశాడు.

వృత్తిసవరించు

ప్రభాకర్ రెడ్డి తాను శిక్షణ తీసుకున్న 6 సంవత్సరాలలో బ్లాక్ బెల్ట్ సాధించాడు. భారతదేశం లో ని వివిధ ప్రాంతాల్లో అతను శిక్షణ తీసుకున్నాడు. మార్షల్ ఆర్ట్స్ కళ యందు అపర నైపుణ్యుడు అయిన బోధి ధర్మ నుండి స్ఫూర్తి పొందాడు. అందుకు గాను షావోలిన్ టెంపుల్ కి వెళ్ళేటందుకు ఆసక్తి చూపించాడు. సుదీర్ఘ ప్రయత్నాల తరువాత అతనికి అవకాశం లభించింది. కొన్నాళ్ళు కఠిన శిక్షణ తీసుకున్న ప్రభాకర్ రెడ్డి మార్షల్ ఆర్ట్స్ నందు 'శీఫు' (శిక్షకుడు)గా మారాడు. ఆ తరువాత వివిధ దేశాలు పర్యటించి వివిధ యుద్ద కళా నైపుణ్యాలను నేర్చుకుని స్వదేశానికి వచ్చేశాడు. ప్రస్తుతం భారత యువతకు తన విద్యను నేర్పిస్తూ పలు రకాల రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.

కుటుంబంసవరించు

ప్రభాకర్ రెడ్డి 2010 లో 'ప్రతిమ' ను నెల్లూరు లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వినీల్ (9), హనీష్ శంకర్ (7).

రికార్డులుసవరించు

ప్రభాకర్ రెడ్డి 2013 నుండి రికార్డులు చేయడం ప్రారంభించాడు. ఈ రికార్డుల ద్వారా దేశానికి గుర్తింపు తీయకురావడం, యువత లో మానసిక, శారీరక బలాన్ని కల్పించవచ్చని భావించాడు.

 1. 2013లో యోగా లో భాగమైన వజ్రాసనం అతి ఎక్కవ సమయం వేసి యునిక్ వరల్డ్ రికార్డు సాధించాడు.
 2. 2015లో తన చేతి పంచులతో వెలిగించి ఉన్న కొవ్వుతులని ఆర్పి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించాడు.
 3. 2017లో అత్యధిక వాల్నట్స్ ఒక నిమిషంలో చేతితో పగులగొట్టి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు.[3]
 4. 2018లో అత్యధిక మార్షల్ ఆర్ట్స్ లో భాగమైన జావెలిన్ త్రోస్ ఒక నిమిషంలో అత్యధిక సంఖ్యలో వేసి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు.
 5. 2020లో కళ్ళకు గంతలు కట్టుకుని నేలపై ఒక యువకుడి చుట్టూ ఉన్న కొబ్బరికాయలను అత్యధికంగా ఒక నిమిషంలో పగులగొట్టి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు.[2]
 6. 2020లో ఒక నిమిషంలో 68 సీసాల మూతలను తలతో తీసి గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించాడు.[4][5]

మూలాలుసవరించు

 1. "LONGEST MARATHON KUNGFU PRACTICE". India Book of Records-US. 2012-10-11. Retrieved 2021-02-04.
 2. 2.0 2.1 "Guinness Record: Martial Arts Student Smashes 49 Coconuts in One Minute with a Blindfold". News18. 2020-10-15. Retrieved 2021-02-04.
 3. Reddy, Deepthi (2017-11-01). "Walnut Crush! Andhra man sets unique record". www.thehansindia.com. Retrieved 2021-02-04.
 4. "Nellore man sets Guinness world record, removes 68 bottle caps in a minute with head". ANI News. Retrieved 2021-02-04.
 5. "Nellore man bags world record title for removing 68 bottle caps in a minute with head. Watch". Hindustan Times. 2020-11-23. Retrieved 2021-02-04.

బయటి లింకులుసవరించు