మాస్టర్ శరత్ చంద్ర

మాస్టర్ శరత్ చంద్ర చిక్కడపల్లి ఘంటసాల సంగీత కళాశాల వ్యవస్థాపకులు. శ్రీకాకుళం జిల్లా గార మండలం లంకపేట గ్రామంలో శ్రీశివశక్తి క్షేత్ర సంగీత ‘ఘంటసాల స్మారక పీఠ మందిరాన్ని’’ 2008లో శరత్‌ చంద్ర ఏర్పాటు చేసారు. దానిని ఓ పుణ్యక్షేత్రంగా పర్యాటక దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దేందుకు ఆయన నిరంతరం కృషిచేస్తున్నారు. 2009లో ఘంటసాల సంగీత కళాశాలను హైదరాబాద్‌లో ప్రారంభించారు. 2011లో జీవీఆర్‌ ఆర్ట్‌‌స అకడమీని శరత్‌ చంద్ర ప్రారంభించారు. సంగీతంలోని సప్తస్వరంలో ‘స-రి-గ-మ-ప-ద-ని’ని ప్రతీకగా తీసుకుని రాష్ర్త్టంలో ఏడు సంగీత కళాశాలలను ఆయన ప్రారంభించి ఎందరో శిష్యులను తయారు చేస్తున్నారు. ఘంటసాల పాటలపై అధ్యయనం చేస్తున్నారు.

మాస్టర్ శరత్ చంద్ర

జీవిత విశేషాలు

మార్చు

మాస్టర్ శరత్ చంద్ర శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం లంకపేట గ్రామంలో జన్మించారు. ఈయన తల్లిదండ్రులు పద్మావతి, బ్రహ్మంలు. ఈయన తండ్రి కూడా సంగీత కళాకారుడే. తన తండ్రి వద్ద తన 11 వ యేటనే హార్మోనియం నేర్చుకుని పౌరాణిక నాటకాలలో తన తండ్రితో పాటు వెళ్ళి హార్మోనిస్టుగా రాణించారు. 1994 లో గరివిడి ప్రాంతంలో ఎలిశెట్టి రాంబాబు గారి వద్ద చేరి సంగీతం నేర్చుకున్నారు. తదుపరి ఆయన సహకారంతో ఘంటశాల సంగీత సమాఖ్యను ఏర్పాటు చేశారు. అనేక సంగీత విభారలును నిర్వహించారు. ఈయన గానం, కీ బోర్డు ప్లే ఎందరో సంగీత అభిమానులను, కళా ప్రియులను, సినీ దిగ్గజాలను అబ్బురపరచింది. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు, డాక్టర్‌. సి నారాయణరెడ్డి , జమున, అంజలీదేవి, ప్రసిద్ధ సినీ సంగీత దర్శకులు, గాయకుల ఆశీస్సులు అందుకున్నారు. వారి అభినందనలు పొందారు. డాక్టర్‌ ఎన్‌ జాగృతి కోరమండల్‌ సిమెంట్‌ అధినేతలు లక్ష్మీచంద్రమోహన్‌ దంపతులు, కళాపోషకులు ఎన్‌.ఆనంద్‌నాయుడు సహకారంతో రాష్ర్త్టంలోని అన్ని జిల్లాల్లో ఘంటసాల స్వర జైత్రయాత్ర చేసి అపరఘంటసాలగా కీర్తిని పొందారు శరత్‌చంద్ర.

ఘంటసాల స్వర సంగీత కోర్సులు

మార్చు

హైదరాబాద్‌ చిక్కడపల్లి లోని ఘంటసాల సంగీత కళాశాలలో మాప్టర్‌ శరత్‌ చంద్ర ఆధ్వర్యంలో పలు ఘంటసాల స్వర సంగీత కోర్సులు ప్రారంభించారు. పలు నగరాలలో కూడా ఈకోర్సులను తాను ప్రారంభించిన కళాశాలలో ప్రారంభించారు .

ఆశయాలు

మార్చు
  • నిత్యస్వరారాధన, ప్రతి తెలుగింటిలో ఘంటసాల పాటలు నిత్యపారాయణంగా మల్చడం.
  • శ్రీకాకుళం జిల్లా గార మండలలంకపేట గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీశివశక్తి క్షేత్ర సంగీత ‘‘ఘంటసాల స్మారక పీఠాన్ని, మందిరాన్ని’’ ఓ పుణ్యక్షేత్రంగా పర్యాటక దర్శనీయ స్థలంగా తీర్చిదిద్దడం.
  • ఘంటసాల స్వరం, సంగీతం దివ్యఔషధంగా మ్యూజిక్‌ థెరపితో మానసిక ప్రశాంతిని పొందేలాప్రజలకు వైద్యం అందించడం .
  • ఘంటసాల విజయనగరం నుంచి తన గానప్రస్థానాన్ని ప్రారంభించారు. అక్కడినుంచే ఘంటసాల ప్రశస్తిని విశ్వవ్యాప్తం చేయడానికి పలు ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం.

మూలాలు

మార్చు