మా ఇంటి మహాలక్ష్మి (1959 సినిమా)
మా ఇంటి మహాలక్ష్మి హైదరాబాదులో నిర్మించిన తొలి తెలుగు సినిమా. 1959లో విడుదలైన ఈ సినిమాలో హరనాధ్ కథానాయకుడుగానూ, జమున నాయకిగాను నటించారు. ఈ సినిమాను హైదరాబాదులో అప్పట్లో కొత్తగా నిర్మించిన సారథి స్టూడియోలో నిర్మించారు.
మా ఇంటి మహాలక్ష్మి (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | గుత్తా రామినీడు |
---|---|
తారాగణం | హరనాధ్, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, రమణారెడ్డి, పి.లక్ష్మీకాంతమ్మ |
సంగీతం | జి.అశ్వత్థామ |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | నవశక్తి ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
తారాగణం
మార్చుహరనాథ్
జూలూరి జమున
గుమ్మడి వెంకటేశ్వరరావు
తిక్కవరపు రమణారెడ్డి
పెరుమాళ్లు
సూర్యాకళ
గిరిజ
లక్ష్మీకాంతమ్మ
సాంకేతిక వర్గం
మార్చుదర్శకుడు: గుత్తా రామినీడు
సంగీతం: గుడిమెట్ల అశ్వద్ధామ
నిర్మాత: పి.గంగాధరరావు
నిర్మాణ సంస్థ: నవశక్తి ఫిలింస్
పాటలు: మల్లాది, సుంకర,ఆరుద్ర
మాటలు: తాపీ, కె.ప్రత్యగాత్మ
కధ: కె.ప్రత్యగాత్మ
నేపథ్య గానం: పి.బి.శ్రీనివాస్, ఘంటసాల, పి సుశీల, పిఠాపురం, జిక్కి, వైదేహి,
కెమెరా: ఎం.కె.రాజు
ఆర్ట్: సూరన్న
ఎడిటింగ్: సంజీవి
నృత్యం: వేణుగోపాల్
విడుదల:1959: జూన్ :11.
పాటలు
మార్చు- తన కన్నవారికి జనని ఆశోజ్యోతి - జిక్కి - రచన: మల్లాది
- ఆమనీ మధు యామినీ - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: మల్లాది
- మారిందిలే కథ మారిందిలే - జిక్కి - రచన: మల్లాది
- పలికే చక్కెర చిలకలు కులికే రాజహంసలు - పి.సుశీల - రచన:మల్లాది
- చివురుల్లో చిలుకలాగ జుంటితేనె చినుకులాగ - రావు బాలసరస్వతి దేవి, పి.ఎస్.వైదేహి - రచన:మల్లాది
- ఓ ఈల వేసి - ఘంటసాల వెంకటేశ్వరరావు_రచన:ఆరుద్ర
- మనమే నందన వనమౌగదా - జిక్కి_రచన:మల్లాది
- నువ్వంటేనే నాకు మోజు అలా రాసిస్తానే దస్తావేజు _పిఠాపురం_రచన:ఆరుద్ర.
మూలాలు
మార్చు1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.