హరనాథ్

(హరనాధ్ నుండి దారిమార్పు చెందింది)

బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు

హరనాథ్
హరనాథ్
జననం
బుద్ధరాజు అప్పల వెంకట రామ హరనాథ్ రాజు

(1936-09-02)1936 సెప్టెంబరు 2
మరణం1989 నవంబరు 1(1989-11-01) (వయసు 53)
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1959 - 84
పిల్లలు2, 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ
బంధువులుజి.వి.జి.రాజు (అల్లుడు)

(సెప్టెంబర్ 2, 1936 - నవంబర్ 1, 1989) తెలుగు సినిమా కథానాయకుడు.

ఈయన 1936లో సెప్టెంబర్ 2 న తూర్పుగోదావరి పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో బుద్దరాజు వరహాలరాజు దంపతులకు జన్మించాడు. ఈయనకు 1 కుమారుడు : శ్రీనివాస రాజు, 1 కుమార్తె : పద్మజ ఉన్నారు. తండ్రి అయిన బుద్ధరాజు వరహాలరాజు శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గ్రంథ రచయిత.

కాకినాడ పిఠాపురం రాజా (పి.ఆర్.) కళాశాల లో చదువుకునే రోజుల్లో హరనాథ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి[1] వంటి అనేక నాటకాల్లో నటించి బహుమతులు అందుకున్నాడు. 60 వ దశకంలో హరనాథ రాజు తెలుగు సినిమాల్లో రొమాంటిక్ ఐకాన్ గా పేరొందాడు. ఈయన తొలి సినిమా అయిన మా ఇంటి మహాలక్ష్మి 1959 లో హైదరాబాద్ సారథీ స్టూడియోస్ లో చిత్రీకరించారు. మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో ఎన్టీయార్, ఏఎన్నార్ తరువాత తెలుగులో హరనాథ్ ప్రముఖ హీరో అని అనిపించుకున్నాడు.[2] నందమూరి తారక రామారావు నిర్మించిన సీతారామకళ్యాణం అనే సినిమాలో శ్రీరాముడుగా నటించాడు. 1967 లో నిర్మించిన భీష్మలో శ్రీకృష్ణుడుగా నటించాడు. సుమారు 117 తెలుగు సినిమాలు, 12 తమిళం, 1 హిందీ, 1 కన్నడం సినిమాల్లో నటించాడు. చివరి దశలో మద్యపానానికి అలవాటు పడడంతో కేవలం అతిథి పాత్రలలో నటించే అవకాశాలే వచ్చాయి. హరనాథ్ చివరి సినిమా చిరంజీవి నటించిన, నాగు సినిమా. నాగు సినిమా లో ఆయన తండ్రి పాత్ర పోషించాడు.

ఈయన 1989, నవంబర్ 1 న మరణించాడు.

నటించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. ఉత్తమ నాటకం ఇన్‌స్పెక్టర్ జనరల్, (నాటకం-అమరావతీయం), డా. కందిమళ్ళ సాంబశివరావు, ఆంధ్రజ్యోతి, గుంటూరు ఎడిషన్, 7 ఆగస్టు 2017, పుట.14
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-03-03. Retrieved 2009-04-25.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హరనాథ్&oldid=3788016" నుండి వెలికితీశారు