మా ఇంటి దేవత
'మా ఇంటి దేవత' తెలుగు చలన చిత్రం 1980. నవంబర్ 1 న విడుదల.పద్మనాభం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ జూలూరి జమున, హరనాథ్,రామకృష్ణ, ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
మా ఇంటి దేవత (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | పద్మనాభం |
తారాగణం | కృష్ణ, హరనాధ్, జమున |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | చిరంజీవి చిత్ర |
భాష | తెలుగు |
కథ
మార్చుఓ జమీందారిణి కొడుకు మురళి ఏరికోరి శోభను పెండ్లి చేసుకుంటాడు. మురళి ఇంట్లో లోగడ గుమాస్తాగా పని చేసిన వ్యక్తి సంతానం చంద్రం, శాంత నివసిస్తూ వుంటారు. ఇంట్లో శాంతదే దాదాపు పెత్తనమంతా. చంద్రం ఒక ప్రమాదంలో మరణిస్తాడు. శాంతను మురళి స్వంత చెల్లెలు లాగానే అదరిస్తూ ఉంటాడ్దు. శోభ వారిద్దరి ప్రవర్తనను అనుమానిస్తుంది. శాంత ఆత్మహత్య చేసుకోబోగా హరి అనే యువకుడు ఆమెను రక్షిస్తాడు. శాంతను హరికిచ్చి వివాహం చేస్తారు. హరి ఎవరో కాదు. జమీందారిణి అసలు కొడుకు. అసలు కథ ఏమిటంటే జమీందారిణి ఇంట్లో లోగడ తోటమాలిగా పనిచెసిన నాగన్న ఆ కుటుంబంపై కక్షగట్టి జమీందారు బిడ్డ హరిని ఎత్తుకుపోయి, ఎందుకూ పనికిరాని వాడిగా, ఒక త్రాగుబోతుగా పెంచుతాడు. జమీందారిణి గుమాస్తా సంతానంలో ఒకడైన మురళిని పెంచుకుంటుంది. నాగన్న ఈ విషయం బయట పెట్టడంతో వారి కుటుంబం పెత్తనం హరి తన చేతిలోకి తీసుకుని ఎప్పుడూ త్రాగుతూ, చివరకు నాగన్నను నమ్మి తాళాలు కూడా వప్పగిస్తాడు. దానితో ఆ ఇంటిని ఓ దారికి తీసుకుని రావలసిన బాధ్యత మురళిపై పడుతుంది. శాంత నిజంగా ఆ ఇంటికి దేవత అవుతుంది[1].
నటీనటులు
మార్చు- కృష్ణ
- జమున
- హరనాథ్
- పద్మప్రియ
- శాంతకుమారి
- సత్యనారాయణ
- మోహన్‌బాబు
- రామకృష్ణ
- పద్మనాభం
- రమణమూర్తి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు: పద్మనాభం
- నిర్మాతలు: మహ్మద్ రంజాన్ అలీ, మహ్మద్ ఖమ్రుద్దీన్
- సంగీతం: మాస్టర్ వేణు
- నిర్మాణ సంస్థ: చిరంజీవి చిత్ర
- పాటలు:దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి కృష్ణమాచార్య,రాజశ్రీ, వేటూరి
- నేపథ్య గానం:ఘంటసాల వెంకటేశ్వరరావు, వాణి జయరాం, పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
- విడుదల:01:11:1980.
పాటలు
మార్చు- ఎంత తీయని పెదవులే ఇంతి నీవి తిట్టుచున్నప్పుడున్ (సాకీ) - ఘంటసాల - రచన: దాశరథి
- ఓ అన్నా నీకన్నా పెన్నిధి ఎవరన్నా ఈ ఇంటికి మా కంటికి వెలుగే - సుశీల_రచన: దాశరథి
- తారలెల్ల పగలు పరదాల దాగె రాత్రివేళనవి (సాకీ) - ఘంటసాల - రచన: దాశరథి
- నీ లేత గులాబీ పెదవులతో కమ్మని మధువును తాకాలి విందులు చేసే నీ అందాలు, నా మదిలోనే చెందాలి - ఘంటసాల - రచన: దాశరథి
- ఇది ఎంత వింత రాతిరి ఇది కొత్త జీవితపు వాకిలి - ఎస్.పి.బాలు, ఎస్. జానకి_రచన:దేవులపల్లి
- ఉరిమే మేఘములో మెరపుతీగ నీవేలే - ఎస్.పి. బాలు, సుశీల_రచన: దాశరథి కృష్ణమాచార్య
- ఏత్వక్షర మనుద్వేషం ఆవ్యక్త (భగవద్గీత శ్లోకం) - సుశీల
- . ఏతు సర్వాణి కర్మాణి మయిసన్యస్యవత్పర (భగవద్గీత శ్లోకం) - సుశీల
- ఒక తీయని మాట ఒక రాయని పాట - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
- కాకినాడ చిన్నదాని కందిపోని కుర్రదాని కనుగీటి చూడు - సుశీల_రచన: రాజశ్రీ
- నిను చూసిన మా నయనాలు అందాలొలికే బృందావనాలు - సుశీల_రచన:వేటూరి
మూలాలు
మార్చు- ↑ పి.ఎస్. (6 November 1980). "చిత్ర సమీక్ష: మా ఇంటి దేవత". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 67, సంచిక 213. Retrieved 30 January 2018.[permanent dead link]
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.