కామి (ఆంగ్లం: Kami) (జపనీస్: 神, [kaꜜmi]) (సాధారణంగా కామి అంటే "దేవుడు" అనే అర్థంలో వాడినా, ఈ పదంలో అంతకు మించిన భావనలు మిళితమై ఉన్నాయి.) అంటే ఆత్మలు, దృగ్విషయాలు లేదా షింటో మతంలో పూజలు అందుకొన్న 'అద్భుత శక్తులు' కావచ్చు. అవి ప్రకృతి దృశ్యాలు, ప్రకృతి శక్తులు, ప్రాణులు, అవి వ్యక్త పరిచే గుణాలు; అవి చనిపోయిన పూర్వీకుల ఆత్మలు కావొచ్చు. కామిగా పిలుచుకునే వారిలో ఎక్కువగా తమ వంశ పూర్వీకులే ఉంటారు (కొంత మంది పూర్వీకులు తమ సద్గుణాల ద్వారా, పుణ్య కార్యాల ద్వారా కామిగా పూజనందుకుంటారు). గొప్ప, సంచలనాత్మక నాయకులు అంటే చక్రవర్తుల లాంటి వారు సాంప్రదాయకంగా కామిగా ఉండటమో, అవ్వటమో జరుగుతుంది.[1] 

షింటోలో, కామి ప్రకృతి నుండి వేరుగా కాకుండా, దాని స్వభావాలైన సానుకూల, ప్రతికూల, శుభ, అశుభ లక్షణాలను కలిగి ఉంటాయి. అవన్నీ ముసబి(musubi) వ్యక్తీకరణలుగానూ, [2] విశ్వాన్ని అనుసంధానం చేసే శక్తిగానూ, మానవజన్మ అంతిమ లక్ష్యంగానూ పరిగణిస్తారు. కామి ఈ ప్రపంచం నుండి "అదృశ్యంగా" ఉండి, తమ స్వంత ఉనికిని ప్రతిబింబించే పరిపూరకరమైన ఉనికిని కలిగి ఉన్నట్టు నమ్ముతారు: షింకై (shinkai)("ద వరల్డ్ ఆఫ్ ద కామి". [3] : 22 ప్రకృతి లోని విస్మయం కలిగించే అంశాలు అనుభూతిలోకి రావాలంటే, ప్రకృతితో సామరస్యత పెంచే, కన్నగార నో మిచ్చి (కామి మార్గం) గురించిన అవగాహన ఉండాలి. [2]

పాశ్చాత్య తత్వశాస్త్రంలో అతీంద్రియమైన విస్మయపు ఆత్మాశ్రయ భావాన్ని, ఆ భావాన్ని రేకెత్తించే ఏదైనా అస్తిత్వ విషయాన్ని అనేక విధాలుగా వివరిస్తూ ఇదే భావన స్ఫురింపచేసే పదం నుమినవుస్ (అలౌకికము) కనిపిస్తుంది.

వ్యుత్పత్తి శాస్త్రం మార్చు

 
అమతెరసు, షింటో విశ్వాసం లో ఒక కేంద్ర కామి

కామి అనేది దేవుడు, దేవత, దైవత్వం లేదా ఆత్మకు సంబంధించిన జపనీస్ పదం. [4] ఇది, మనస్సు (心霊), దేవుడు (ゴッド), సర్వోన్నత జీవి (至上者), ఒక షింటో దైవం, ఒక దిష్టిబొమ్మ, ఒక సిద్ధాంతం,లేదా పూజలందుకునే దేనినైనా వివరించడానికి ఉపయోగించే పదం. [5]

కామి అనే పదానికి సాధారణ వివరణ దేవత అయినప్పటికీ, అటువంటి అనువాదం పదం యొక్క అపార్థానికి కారణమవుతుందని కొంతమంది షింటో పండితులు వాదించారు. [6]  దేవుడు, దేవతలు, దేవదూతలు, లేదా ఆత్మలను సూచించే సంస్కృతంలోని దేవ, హిబ్రూలోని ఎలోహిమ్ (Elohim) పదాలకు అనేక రకాలుగా వాడుకలో ఉన్న కామి పదానికి పోలికలు కనిపిస్తాయి .

కొన్ని శబ్దవ్యుత్పత్తి సూచనలు:

  • కామి మూలంలో, కేవలం ఆత్మ, లేదా ఆధ్యాత్మిక అంశం అని అర్ధం కావొచ్చు. దీనిని కంజి , సైనో-జపనీస్ విధానంలో షిన్ లేదా జిన్ గా ఉచ్చరిస్తారు. చైనీస్ భాషలో, పాత్ర అంటే దేవత . [7]
  • ఐను భాషలో, కముయ్ అనే పదం జపనీస్ కమీకి సమానమైన సర్వాత్మ (యానిమిస్టిక్) భావనను సూచిస్తుంది. పదాల మూలాల విషయం ఇప్పటికీ చర్చనీయాంశమైనా; దీనిని పూర్వపు జపనీస్ పదమైన కమి నుంచి ఐను అరువుగా స్వీకరించిన పదంగానే సూచిస్తారు. [8]
  • తన కోజికి-డెన్ (Kojiki -den),లో మోటూరి నోరినగా (Motoori Norinaga) కామి యొక్క ఒక నిర్వచనాన్ని ఇలా పేర్కొన్నాడు : "... ఏ జీవి అయినా సాధారణ లక్షణాలకు భిన్నమైన అసాధారణ, విస్మయ పూరితమైన లక్షణాలు కలిగి ఉంటే, కామి అంటారు." [9]

జపనీస్ వ్యాకరణంలో నామవాచకాలకు సంఖ్యను సూచించే రూపాలు లేవు (జపనీస్‌లో నామవాచకాల ఏకవచన, బహువచన రూపాలు ఒకేలా ఉంటాయి), కొన్నిసార్లు కామి సూచించే అస్థిత్వాలు ఒకటా లేక అనేకమా అనేది అస్పష్టంగా ఉంటుంది. అయితే ఏకవచన భావన అవసరమైనప్పుడు, కామి ప్రత్యయం లాగాను, బహు వచన సూచిత పదానికి కామి పదం సాధారణంగా కామిగామి అని, పునరావృతంగాను ప్రయోగిస్తారు.[3] : 210–211 

కామి అనే పదానికి లింగ రూపాలు కూడా లేవు. ఏ రూపలింగానికైనా కామి అనే పదమే వాడతారు. 

చరిత్ర మార్చు

షింటోకు స్థాపకుడు లేడు, విస్తృతమైన సిద్ధాంతం లేదు, అలాగే మతపరమైన గ్రంథాలు లేవు. 712 సా.శ.లో వ్రాసిన కోజికి (పురాతన విషయాల గ్రంధం), 720 సా.శ.లో వ్రాసిన జపాన్ఇతిహాసం గా పేర్కొనే నిహోన్ షోకి (జపాన్ క్రానికల్స్) జపనీస్ యొక్క తొలి పురాణ గ్రంధాలు. కోజికిలో వివిధ కామి ల వర్ణనలు కూడా చేర్చారు. [3] : 39 

పురాతన సంప్రదాయాలలో కమిని నిర్వచించే ఐదు లక్షణాలు ఉన్నాయి: [10]

  1. కామికి రెండు మనసులు. గౌరవాన్ని పొందినప్పుడు ప్రేమను పంచుతాయి, ఆదరిస్తాయి. విస్మరిస్తే విరసత్వాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తాయి. కామి కోపాన్ని తగ్గించి,అనుగ్రహం పొందడానికి వాటిని శాంతి పరచాలి. సాంప్రదాయకంగా, కామికి రెండు ఆత్మలు ఒకటి సున్నితమైన నిగి- మిటమ( nigi-mitama ), రెండవది క్షుధ్రమైన (అరా-మిటమ); అదనంగా, యమకేజ్ షింటోలో ( కో- షింటా చూడండి), కామిలో మరో రెండు అదనపు ఆత్మలు దాగి ఉన్నాయి: ఒకటి సంతోషకరమైన ( సాకి-మిటమా ),మరొకటి రహస్యమైన ( కుషి-మిటమా ). [3] : 130 
  2. కామి మానవుల కంటికి కనిపించవు. కానీ, అవి పవిత్ర స్థలాలను, సహజ దృగ్విషయాలను, లేదా వారి ఆశీర్వాదం కోసం జరిపే ఆచారాలను అంటి పెట్టుకుని ఉంటాయి.
  3. అవి సంచరిస్తూ ఉంటాయి, వారి ప్రార్థనా స్థలాలను సందర్శిస్తాయి, వాటిలో అనేకం ఉంటాయి, కానీ, ఎప్పటికీ అక్కడే ఉండిపోవు.
  4. కామిలో అనేక రకాలు ఉన్నాయి. కోజికిలో 300 విభిన్న వర్గీకరణల కమీ జాబితా ఉంది. అవన్నీ కామి ఆఫ్ విండ్, కమీ ఆఫ్ ఎంట్రీవేస్, కమీ ఆఫ్ రోడ్స్ వంటి విభిన్న విధులను కలిగి ఉన్నాయి.
  5. చివరగా, తమ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల భిన్నమైన సంరక్షక బాధ్యతను, లేదా విధిని కలిగి ఉంటాయి . కామిని సంతోషంగా ఉంచడానికి ప్రజలకు బాధ్యత ఉన్నట్లే, కామి తాను నివసించే వస్తువు, స్థలం లేదా, తన ఆలోచనకు చెందిన నిర్దిష్ట విధిని నిర్వహించాలి.

కామి అనేది నిరంతరం మారుతూ ఉండే భావన, కానీ, జపనీస్ జీవితంలో దాని ఉనికి మాత్రం అలాగే స్థిరంగా ఉంది. కామి ప్రారంభంలో భూమిని ఆంటి పెట్టుకున్న ఆత్మలుగా మాత్రమే ఉంటూ, ఆనాటి వేటగాళ్ల సమూహాలకు వారి రోజువారీ జీవితంలో సహాయపడేవి. వారు భూ(పర్వతాలు), సముద్ర దేవతలుగా పూజలందుకొనేవారు. క్రమంగా జపాన్‌లో వరి సాగు చాలా ముఖ్యమైన, ప్రధానమైన వనరుగా మారడంతో, కామి పాత్ర పంటల పెరుగుదలలో ప్రత్యక్షంగా, మరింత స్థిరమైనదిగా మారింది; వర్షం, భూమి, బియ్యం వంటి పాత్రలు. [10] ప్రారంభ జపనీస్ ప్రజలకు, కామీలకు మధ్య ఉన్న ఈ సంబంధం, పంటలను పండించమనీ, వాటిని రక్షించమనీ వేడుకుంటూ చేసే వేడుకలు, పాటించే ఆచారాలలో స్పష్టమవుతుంది. ఈ ఆచారాలు ప్రారంభంలో చక్రవర్తులక శక్తికి,బలానికి చిహ్నంగా కూడా మారాయి. [11] (చూడండి నీనేమ్ -సాయ్ Niiname-sai.)

షింటో విశ్వాసంలో పురాణ-చరిత్రల సంప్రదాయం బలంగా ఉంది; అలాంటి ఒక పురాణంలో, సూర్య దేవత అమతెరాసు మనవడైన మొదటి చక్రవర్తి వర్ణన కనిపిస్తుంది. ఈ పురాణంలో, అమతేరాసు తన మనవడిని భూమికి పరిపాలించడానికి పంపుతూ, అతనికి స్వర్గపు పొలాల్లో పండిన (తకమగహర)ఐదు వరి ధాన్యపు గింజలను ఇచ్చింది . ఈ ధాన్యంతో అతనికి భూమి మీది "ఆటవీకత"ని మార్చడం సాధ్యం అయ్యింది. [11]

కామి కొత్త రూపాల, ప్రత్యేకంగా గోర్యో -షిన్ (పవిత్రాత్మ కామి) అభివృద్ధిలో సామాజిక, రాజకీయ కలహాలు కీలక పాత్ర పోషించాయి. గోర్యో లు అతి చిన్న వయస్సులోనే జీవితాలను ముగించిన వారి ప్రతీకార ఆత్మలు, కానీ షింటో అనుచరుల భక్తితో శాంత పడి, ఇక అవి అందరినీ కాకుండా, కామిని గౌరవించని వారిని మాత్రమే శిక్షిస్తాయని నమ్ముతారు. [11]

కామి దేవగణం, కామి లానే నిరంతరం నిర్వచనాన్ని, పరిధిని మార్చుకుంటూనే ఉండది. ప్రజల అవసరాలు మారినట్టుగానే, వివిధ కామి పరిధులు, పాత్రలు కూడా మారాయి. వీటి ఉదాహరణలు ఆరోగ్యానికి సంబంధించినవి, అవి, మశూచి యొక్క కమీ పాత్ర పరిధిలోకి అన్నీ అంటు వ్యాధులూ చేరాయి. అలాగే కురుపులు,కణితుల కామి అధికార పరిధి లో క్యాన్సర్లు, క్యాన్సర్ చికిత్సలూ చేరాయి. [11]

పురాతన యానిమిస్టిక్ మతాలలో, కామి ని ప్రకృతి యొక్క దైవిక శక్తులుగానే భావించారు. పురాతన జపాన్‌లోని ఆరాధకులు ప్రత్యేక సౌందర్యాన్ని, శక్తిని ప్రదర్శించే జలపాతాలు, పర్వతాలు, బండరాళ్లు, జంతువులు, చెట్లు, గడ్డి వరి వంగడం వంటి ప్రకృతి సృష్టిని గౌరవించారు. ఆత్మలు లేదా కామి నివాసాలుగా భావించే వాటిని గౌరవానికి అర్హమైనవిగా వారు దృఢంగా విశ్వసించారు.

927సా.శ.లో, ఎంగి-షికి(Engi-shiki) (ఎంగి శకపు పద్ధతులు) యాభై సంపుటాలుగా ప్రకటించారు. ఇది, మనుగడలో ఉన్న షింటో ఆచారాలు, నోరిటో (ఆరాధనా విధానాలు, ప్రార్థనలు) ఉన్న మొదటి అధికారిక క్రోడీకరణ. ఇది తదనంతరం షింటో ఆరాధనా అభ్యాసాలకు, విధానాలకు ఆధారం అయింది. దీనిలో ఆ సమయంలో ఉన్న 2,861 షింటో పుణ్యక్షేత్రాలను, 3,131 అధికారిక గుర్తింపు పొందిన, ప్రతిష్టించిన కామి లను నమోదు చేశారు . [12] తరువాతి తరాలలో ఈ కామి సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఒక్క టోక్యో లోని యసుకుని (Yasukuni) పుణ్యక్షేత్రం లోనే 2,446,000 పైగా వ్యక్తిగత కామి లను ప్రతిష్టించారు.[13]

షింటో విశ్వాసం మార్చు

షింటో విశ్వాసంలో కామి ప్రధాన ఆరాధన సాధనం. పురాతన జపాన్ సర్వాత్మ (ఆనిమిస్టిక్) ఆధ్యాత్మికత ఆధునిక షింటోకు నాంది, తరువాత అన్య మతపరమైన ఆలోచనల ఆక్రమణల నుండి తమ సాంప్రదాయ విశ్వాసాలను కాపాడే ప్రయత్నంలో ఇది ఒక అధికారిక ఆధ్యాత్మిక సంస్థగా మారింది. ఫలితంగా, కామి అని పిలుచుకుంటున్న దాని స్వభావం చాలా సాధారణమైనదిగా, విభిన్నమైన అనేక భావనలు, దృగ్విషయాలను కలిగినదిగా కనిపిస్తుంది.

కామిగా పేర్కొన్న కొన్ని వస్తువులు లేదా దృగ్విషయాలు పెరుగుదల, సంతానోత్పత్తి, ఉత్పత్తి లక్షణాలతోను; గాలి, ఉరుము లాంటి సహజ దృగ్విషయాలు; సూర్యుడు, పర్వతాలు, నదులు, చెట్లు, రాళ్ళు వంటి ప్రకృతి వనరులు ; కొన్ని జంతువులు ; పూర్వీకుల ఆత్మలు, పూర్వీకుల ఆత్మల హోదాలో జపాన్ ఇంపీరియల్ హౌస్ కు చెందిన పూర్వీకుల ఆత్మలు ఉన్నాయి. అలాగే, గొప్ప కుటుంబాల, ప్రజలందరి పూర్వీకుల ఆత్మలు కూడా ఉన్నాయి. ఆ ఆత్మలను వారి వారసుల సంరక్షకులుగా నమ్ముతారు.[3] : 150 

కామిగా హోదా పొందిన ఇతర ఆత్మలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, భూమిని సంరక్షించే ఆత్మలు, వృత్తులు, నైపుణ్యాలు; జపనీస్ వీరుల ఆత్మలు, అత్యుత్తమ కార్యాలు చేసిన లేదా సద్గుణాలు కలిగిన వ్యక్తులు, నాగరికత, సంస్కృతి, మానవ సంక్షేమానికి దోహదపడిన వారు; రాష్ట్రం కోసం లేదా సమాజం కోసం మరణించిన వారు; [14] దయనీయమైన మృతులు. ఉన్నతమైన మనిషి ఆత్మలు మాత్రమే కాకుండా, దయనీయమైన, బలహీనమైన వారి ఆత్మలు కూడా కామి గా షింటో పరిగణిస్తుంది.

అనాదిగా వున్న కామి గురించిన భావాల్లో ఎన్నో మార్పులు, చేర్పులూ చోటు చేసుకున్నాయి. అయితే, ఏవైతే కామి అని పురాతన కాలంనుంచి భావిస్తున్నారో, వాటిని ఇప్పటికీ అధునాతన షింటో లో కామి గానే పరిగణిస్తున్నారు. ఆధునిక షింటోలో కూడా, ఇప్పటికీ కామిగా దేనిని పూజించాలో, దేనిని పూజించకూడదో అనేదానికి స్పష్టమైన ప్రామాణిక నిర్వచనం లేదు. ఆధునిక షింటోకి, పురాతన యానిమిస్టిక్ మతాల మధ్య వ్యత్యాసం ప్రధానంగా సంస్కరించిన కామి -భావన లోనే తప్ప,వాటి నిర్వచనాలలో మాత్రం తేడా లేదు.

ఆధునిక షింటోలో చాలా మంది పూజారులు కామి కి ఉన్న పురాతన హోదాలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నప్పటికీ, కామిని గొప్పతనం, అధికారంతో కూడిన మానవరూప ఆత్మలుగానే పరిగణిస్తారు. ఉదాహరణకు పురాతన అమతెరసు-ఓమికామి(Amaterasu-ōmikami), షింటో దేవ గణంలో సూర్య దేవత. ఈ కామిలను దేవతలుగా తలచినా, వారిని సర్వశక్తిమంతులుగానూ, సర్వజ్ఞులుగానూ పరిగణించరు, పైగా గ్రీకు దేవుళ్లలాగా, వారు లోపభూయిష్ట వ్యక్తిత్వాలను కలిగి, హీనమైన చర్యలకు పాల్పడతారు. ఉదాహరణకు, పురాణాలలో అమతేరాసు మానవ ప్రపంచంలోని సంఘటనలను చూడగలిగింది, కానీ భవిష్యత్తును చూడటానికి ఆమె కూడా దైవీయమైన అనుష్టానాలను పాటించాల్సి వచ్చింది.

కామి ని ప్రధానంగా మూడు వైవిధ్య రూపాలుగా పరిగణిస్తారు: అమాత్సుకామి (Amatsukami)( స్వర్గీయ దేవత), కునిత్సుకామి (Kunitsukami)( సాంసారిక దేవత), య ఓ యోరుజు నో కామి(ya-o-yorozu no kami )( మితం లేని కామి). ("八百万" అర్ధం అక్షరాలా ఎనిమిది మిలియన్లు అని, కానీ భాషీయంగా ఇది "లెక్కించ లేనంత " "అన్నింటిలో" అనే అర్థాలను వ్యక్తపరుస్తుంది). అనేక తూర్పు ఆసియా సంస్కృతుల్లో లాగే , జపనీయులు సర్వవ్యాప్తికి ప్రతీకగా క్రమ సంఖ్యా పరంగా, వరుస సంఖ్యా పరంగా దిశలను సూచిస్తూ తరచుగా 8 సంఖ్యను ఉపయోగిస్తారు. ) కామికి ఉన్న ద్రవ, అస్థిర గుణాల కారణంగా ఈ వర్గీకరణలు ఖచ్చితమైన విభజనలని చెప్పలేము. కానీ, ఇవి వాటిని సమూహ పరచటానికి మార్గదర్శకాలుగా ఉంటాయి. [3] : 56 

ఒక నిర్దిష్ట కుటుంబానికి చెందిన పూర్వీకులు కూడా కామిగా పూజలందుకుంటారు. ఈ కోణంలో,ఈ కామిలను వారి దైవిక శక్తుల వల్ల కాక, విలక్షణమైన వారి సుగుణం లేదా పాటించిన ధర్మం కారణంగా పూజిస్తారు. ఈ కామిలకు ప్రాంతీయంగానే వేడుకలు జరుపుకుంటారు, అలాగే వారి గౌరవార్థం అనేక లఘు పుణ్యక్షేత్రాలు ( hokora ) నిర్మించారు. ఒకప్పుడు జీవించి ఉన్న వ్యక్తులు ఈ విధంగా అనేక సందర్భాల్లో కామి గౌరవాన్ని అందుకున్నారు; దీనికి ఉదాహరణ టెన్జిన్,నిజ జీవితంలో అతడు సుగవారా నో మిచిజాన్ (845–903 సా.శ.).

ఈ మానవ జీవితాన్నికామి ప్రారంభించిన కారణంగా షింటోలో మానవ జన్మ పవిత్రమైనదని నమ్ముతారు. అయితే అందరూ కామి సృష్టించిన ఈ దివ్య స్వభావాన్ని తమకు తాముగా గ్రహించలేరు; కనుక, దైవిక ప్రకృతిని గ్రహించడానికి మగోకోరో (magokoro) లేదా శుద్ధీకరణ అవసరం. [15][నమ్మదగని మూలాలు]ఈ శుద్దీకరణ కేవలం కామి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది . కామిని సంతోషపెట్టి మగోకోరోను పొందడానికి, షింటో అనుయాయులకు ఈ విషయంలో సమర్థించవలసిన నాలుగు ధృవీకరణలను బోధిస్తారు.

సాంప్రదాయాలతో, కుటుంబం తో గట్టి బంధం కలిగి ఉండటం మొదటి ధృవీకరణ. సంప్రదాయాలను సంరక్షించే ప్రధాన యంత్రాంగంగా కుటుంబాన్ని పరిగణిస్తారు. ఉదాహరణకు, వివాహంలోను, పుట్టుకలోను, సంప్రదాయం సంభావ్యంగా భావిస్తారు, తద్వారా దానిని భవిష్యత్ తరాలకు చేరవేస్తారు. రెండవ ధృవీకరణ, ప్రకృతిని ప్రేమించడం. ప్రాకృతిక వనరులన్నీ పవిత్రమైనవిగా పూజించటం. కారణం వాటిలో కామి నివసిస్తుంది. కాబట్టి, ప్రకృతితో సంబంధం కలిగి ఉండటం అంటే దేవతలతో సంబంధం కలిగి ఉండటం. శారీరక పరిశుభ్రతను కాపాడుకోవడం మూడవ ధృవీకరణ. షింటో అనుచరులు స్నానాలు చేయడం, చేతులు కడుక్కోవడం, తరచుగా నోరు శుభ్రపరచుకోవడం చేస్తారు. కామికి, వారి పూర్వీకుల ఆత్మలకు మత్సూరిని(matsuri) ఆచరిస్తూ వారు చేసే ఆరాధన, ఇచ్చే గౌరవం చివరి ధృవీకరణ. [15]

కామి ఒక వ్యక్తికి ఆశీర్వాదాలను లేదా శాపాలు ఇవ్వగలదని కూడా షింటో అనుచరులు నమ్ముతారు. షింటోని విశ్వసించే వారు చెడు తలపెట్టే కామిలో "మంచిని చేసే తలంపు కలిగించడానికి" శాంతింపజేయాలని, అలాగే మంచి చేసే కామిని కూడా సంతోషపెట్టాలని కోరుకుంటారు. ప్రతిరోజూ నాలుగు ధృవీకరణలను అభ్యసించడంతో పాటు, షింటో విశ్వాసులు స్వచ్ఛంగా, సురక్షితంగా ఉండటానికి సహాయపడే ఒమామోరీ(omamori) ని కూడా ధరిస్తారు. మమోరి(Mamori) అందాలు, చెడు కామి కలిగించే అనారోగ్యాలనుంచి, వాటి ద్వారా ప్రాప్తించె విపత్తులనుంచి రక్షిస్తాయి. [15]

షింటో మతంలో కామిని పూజిస్తారు, గౌరవిస్తారు. షింటో విశ్వాసుల జీవిత లక్ష్యం మగోకోరోను పొందడం, స్వచ్ఛమైన,నిష్కపటమైన హృదయం, ఇది కామి ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. [16] తత్ఫలితంగా, షింటో అనుచరులు, మానవజాతి జీవించి ఉన్నవాటిని, జీవం లేనివాటిని సమానంగా ఆరాధించాలని బోధిస్తారు. ఎందుకంటే, రెండూ తమలో దివ్యమైన ఉన్నతమైన ఆత్మను కలిగి ఉంటాయి: కామి. [17] 

వేడుకలు, పండుగలు మార్చు

మనకు తెలిసిన మొదటి నమోదిత ఆచారాలలో నీనామె-సాయి (Niiname-sai) ఒకటి, [11] తమకు సదా పంటలు సమృద్ధిగా పండడం కోసం కామి ఆశీర్వాదాన్ని కోరుతూ చక్రవర్తి కొత్త పంటలోని బియ్యాన్నిఅందించే వేడుక. ఇది వార్షిక పండుగ, కొత్త చక్రవర్తి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నీనామె-సాయిని నిర్వహిస్తారు, ఈ సందర్భంలో దీనిని డాయిజో-సాయి(Daijō-sai)గా పిలుస్తారు. ఈ వేడుకలో, చక్రవర్తి కొత్త పంటకోత నుండి కామికి బియ్యం, చేపలు, పండ్లు, సూప్, వంటకంతో సహా తమ పంటలను సమర్పిస్తాడు. చక్రవర్తి మొదట దేవతలతో, తరువాత అతిథులతో విందు ఆరగిస్తాడు. ఆ విందు కొంత సమయం వరకు కొనసాగవచ్చు; ఉదాహరణకు, చక్రవర్తి షోవా విందు రెండు రోజుల పాటు కొనసాగింది. [11]

 
ఇట్సుకుషిమా షింటో పుణ్యక్షేత్రం, మియాజిమా ద్వీపం, హిరోషిమా ప్రిఫెక్చర్, జపాన్. ఈ పుణ్యక్షేత్రం కామి నివసించే ప్రదేశం అని నమ్ముతారు.అనేక వేడుకలను, పండుగలను నిర్వహిస్తారు.

షింటో మందిరానికి సందర్శనకు వచ్చే భక్తులు తమను తాము కామికి సమర్పించుకునే ముందు శుద్దీకరణ ఆచారాన్ని అనుసరిస్తారు. ఈ ఆచారంలో భాగంగా చేతులు కడుక్కోవడం, నీటిని మింగడం, తరువాత కొద్ది నీటిని మందిరం ముందు ఉమ్మి వేయడం ద్వారా తమ శరీరం, హృదయం, మనస్సును శుద్ధి చేసుకుంటారు. ఇది పూర్తయిన తర్వాత వారు తమ దృష్టిని కామి దృష్టిని ఆకర్షించడం వైపు మళ్లిస్తారు. దీనికి వారు పాటించే సాంప్రదాయ పద్ధతిలో, రెండుసార్లు వంగి నమస్కరించడం, రెండుసార్లు చప్పట్లు కొట్టడం తిరిగి మళ్లీ నమస్కరించడం ద్వారా తమ ఉనికిని, తమ కోరికను కామికి తెలియ చేస్తారు. ఆఖరి సారి వంగి నమస్కరిచే సమయంలో ఆ ప్రార్థకుడు కృతజ్ఞతా పూర్వకమైన ప్రశంసల ద్వారా కామిని వేడుకుంటాడు. కామి సహాయం కోసం ప్రార్థన చేస్తే, వారు తమ పేరు, చిరునామాను కూడా తెలియజేస్తారు. ప్రార్థన లేదా ఆరాధన తర్వాత వారు తిరిగి రెండు సార్లు వంగి నమస్కరించి, రెండు సార్లు చప్పట్లు చరిచి, చివరికి మరో సారి ముగింపుగా వంగి నమస్కరిస్తారు.[3] : 197 

షింటో అభ్యాసకులు ఇంట్లో కూడా పూజలు చేస్తారు. ఇది ఒక కమిదానా (గృహ పూజా మందిరం) వద్ద జరుగుతుంది, దానిపై వారి రక్షక కామి, లేదా పూర్వీకుల కామి పేరుతో ఓఫుడా ఉంచుతారు. వారి రక్షక కామిని వారు తమకి , లేదా తమ పూర్వీకులకు కామితో ఉన్న సంబంధం ద్వారా నిర్ణయించుకుంటారు. [3] : 28, 84 

షింటో భక్తులు జరుపుకునే జపనీస్ పండుగలు, సన్యాసి పద్ధతులు, పుణ్యక్షేత్ర ఆచారాలు, వేడుకలు కామికి పూజలు అందించే అత్యంత బహిరంగ మార్గాలు. కామికి ప్రత్యేకించిన పండుగలను సాధారణంగా వారి ఆరాధనకు అంకితమైన పుణ్యక్షేత్రాలలో, ఆ పండుగల సమయంలో జరుపుకుంటారు. చాలా పండుగలలో ఎంతో మంది విశ్వాసులు పాల్గొంటారు, వారు సాధారణంగా మత్తులో, ఊరేగింపుగాను, కొన్నిసార్లు పరగులు పెడుతూ, మికోషి ( దేవుని పల్లకి) ని తీసుకువెళ్ళేటప్పుడు దాని వైపు పరుగులు తీస్తారు. సుబాకి గ్రాండ్ పుణ్యక్షేత్రంలోని ప్రధాన పూజారి యమమోటో గుజీ, ఈ అభ్యాసం కామిని గౌరవించేదిగా పేర్కొంటూ ఇలా చెప్పారు , "ఇది పండుగలో ఒక భాగం, మాత్సురి, షింటో ప్రపంచంలో చూడగలిగే జీవితంలోని ఓ గొప్ప ఉత్సవం. ఇది అన్ని ప్రజా సమూహాలు బృందాలుగా హాజరయ్యే వేడుక, మొత్తం అంతా ఒకే గ్రామంలా కామి పిల్లలుగా తమ సామర్థ్యాలను వెలికితీయాలని కోరుతున్నారు". [2] కొత్త సంవత్సరం సందర్భంగా, కుటుంబాలు రాబోయే సంవత్సరానికి సన్నాహకంగా తమ ఇళ్లను శుద్ధి చేసి, శుభ్రపరుచుకుంటాయి. పూర్వీకులకు కూడా నైవేద్యాలు సమర్పిస్తారు, తద్వారా వారు రాబోయే సంవత్సరంలో కుటుంబాన్ని ఆశీర్వదిస్తారని నమ్ముతారు. 

షింటో వేడుకల విధానాలు చాలా దీర్ఘంగాను, సంక్లిష్టంగాను ఉంటాయి. కొన్ని పుణ్యక్షేత్రాలలో పూజారులకు వాటిని అభ్యాసం చేయటానికి పది సంవత్సరాల కాలం పడుతుంది. అర్చకత్వం సాంప్రదాయకంగా వారసత్వంగా వస్తుంది. కొన్ని పుణ్యక్షేత్రాలు వంద తరాలకు పైగా ఒకే కుటుంబానికి చెందిన వారిని పూజారులుగా కొనసాగిస్తున్నాయి . అలాగే మతాచార్యులుగా మహిళా పూజారిణులు ఉండటం అసాధారణం మేమీ కాదు. [18] పురోహితుల( కన్నూషి )కు మికో లు, అంటే యువ అవివాహిత స్త్రీలు పుణ్యక్షేత్ర కన్యలుగా వ్యవహరిస్తారు. [19] పూజారులు లేదా పురోహితులు సన్యాసులుగా జీవించరు; నిజానికి, వారు వివాహం చేసుకోవడం సర్వసాధారణం. [18] వారు సాంప్రదాయకంగా ధ్యానం చేసే వారిగా కాకుండా , వారిని కామికి , ప్రజలకు మధ్య సంబంధాన్ని కొనసాగించే కళలలో నిపుణులుగా పరిగణిస్తారు. [18]

పుణ్యక్షేత్రాలలో ఈ పండుగలతో పాటుగా, ఆచారాలను సూచించే వేడుకలు కూడా నిర్వహిస్తారు. అలాంటి రెండు వేడుకలు, ఒకటి పిల్లల పుట్టుక, రెండవది షిచి-గో-సాన్. బిడ్డ పుట్టినప్పుడు వారిని పుణ్యక్షేత్రానికి తీసుకువస్తారు, తద్వారా వారు కామి కి విశ్వాసిగా, తమ భవిష్యత్ జీవితానికి కామి దీవెనలు అందుకుంటారు. ఇక రెండవ వేడుక, షిచి-గో-సాన్ (ఏడు-ఐదు-మూడు) అనేది ఐదు సంవత్సరాల వయస్సు గల అబ్బాయిలు, మూడు లేదా ఏడు సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం పాటించే ఆచారం. చిన్నపిల్లలు వ్యక్తిగతంగా, తమకు కామి అందించే రక్షణకు కృతజ్ఞతలు చెప్పడానికి, తమ నిరంతర ఆరోగ్యం కోసం ప్రార్థించే వేడుక.[20] 

షింటో విశ్వాసులు పాటించే అనేక ఇతర ఆచారాలు, పండుగలు కూడా ఉన్నాయి. షింటో అనుచరుల ఈ వేడుక ఆచారాలకు ముఖ్య కారణం వీటి ద్వారా కామి ని ప్రసన్నం చేసుకుని తద్వారా మగోకోరో ను అందుకోవటం.[16] : 205 మగోకోరో కమీ ద్వారా మాత్రమే అందుకోవచ్చు. కామి ని సంతృప్తి పరచాలంటే అవి పరిపూర్ణంగా ఉండాలి. అందుకే వేడుకలు, పండుగలు సుదీర్ఘమైనవిగా, సంక్లిష్టమైనవిగా ఉంటాయి. షింటో విశ్వాసుల వేడుకలతో కామి సంతృప్తి చెందకపోతే, వారికి మగోకోరోను ప్రసాదించదు.

ప్రముఖ కామి మార్చు

 జపాన్ దేవతల జాబితా

ఇది కూడ చూడు మార్చు

  • ఐను మతం Ainu religion
  • ఫిలిప్పీన్ పురాణం Philippine mythology
  • అనిటో, ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని కామికి ప్రతిరూపాలు Anito, counterparts of kami in northern Philippines
  • అనిమిజం Animism
  • చైనీస్ జానపద మతం Chinese folk religion
  • అనిటో|దివాత, మధ్య, దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని కామి యొక్క ప్రతిరూపాలు Diwata, counterparts of kami in central and southern Philippines
  • గీస్ట్ Geist
  • జీనియస్ లోకీ, న్యూమెన్, పురాతన రోమ్ యొక్క సారూప్య భావనలు * Genius loci and Numen, similar concepts of ancient Rome
  • గ్లోసరీ ఆఫ్ షింటో Glossary of Shinto
  • హైయాంగ్, ఇండోనేషియా విశ్వాసంలో కామి యొక్క సమాంతర భావనలు Hyang, parallel concepts of kami in Indonesian faith
  • ఐయే İye
  • కముయ్ Kamuy
  • కొరియన్ షమానిజం Korean Shamanism
  • కోషింటో Koshintō
  • కోటోడమా Kotodama
  • ల్యాండ్‌వట్టిర్, నార్స్ మతంలో ఇలాంటి సహజ, ఆధ్యాత్మిక జీవులు Landvættir, similar natural and spiritual beings in Norse religion
  • జపనీస్ పురాణాల్లోని దైవాంశాల జాబితా#షింటో|షింటో కామి జాబితా List of Shinto kami
  • మన Mana
  • న్యుమా Pneuma
  • జపాన్‌లో మతం Religion in Japan
  • ర్యుక్యువాన్ మతం Ryukyuan religion
  • షెన్ (చైనీస్ మతం) Shen (Chinese religion)
  • షింతై (Shintai)
  • టావోయిజం Taoism

ప్రస్తావనలు మార్చు

 

  1. Tamura, Yoshiro (2000). Japanese Buddhism: A Cultural History (1st ed.). Tokyo: Asher Publishing. ISBN 4333016843.
  2. 2.0 2.1 2.2 Boyd, James W.; Williams, Ron G. (1 January 2005). "Japanese Shintō: An Interpretation of a Priestly Perspective". Philosophy East and West. 55 (1): 33–63. doi:10.1353/pew.2004.0039. JSTOR 4487935.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 3.6 3.7 Yamakage, Motohisa; Gillespie, Mineko S.; Gillespie, Gerald L.; Komuro, Yoshitsugu; Leeuw, Paul de; Rankin, Aidan (2007). The Essence of Shinto: Japan's Spiritual Heart (1st ed.). Tokyo: Kodansha International. ISBN 978-4770030443.
  4. "Kanji details – Denshi Jisho". 2013-07-03. Archived from the original on 2013-07-03. Retrieved 2017-05-02.
  5. Holtom, D. C. (January 1940). "The Meaning of Kami. Chapter I. Japanese Derivations". Monumenta Nipponica. 3 (1): 1–27. doi:10.2307/2382402. JSTOR 2382402.
  6. Ono, Sokyo; Woodard, William P. (2004). Shinto, the Kami Way (in ఇంగ్లీష్) (1st ed.). Boston, Massachusetts: C.E. Tuttle. ISBN 978-0-8048-3557-2.
  7. "神 - Yahoo奇摩字典 搜尋結果". Yahoo Dictionary. 2013-01-01. Retrieved 2017-01-01.
  8. Nonno, Tresi (2015). "On Ainu etymology of key concepts of Shintō: tamashii and kami" (PDF). Cultural Anthropology and Ethnosemiotics. 1 (1): 24–35. Retrieved 5 June 2016.
  9. Gall, Robert S. (January 1999). "Kami and Daimon: A Cross-Cultural Reflection on What Is Divine". Philosophy East and West. 49 (1): 63–74. doi:10.2307/1400117. JSTOR 1400117.
  10. 10.0 10.1 Jones, Lindsay (2005). Encyclopedia of Religion (2nd ed.). New York: Macmillan [u.a.] pp. 5071–5074. ISBN 978-0-02-865734-9.
  11. 11.0 11.1 11.2 11.3 11.4 11.5 Ohnuki-Tierney, Emiko (July 1991). "The Emperor of Japan as Deity (Kami)". Ethnology. 30 (3): 199–215. doi:10.2307/3773631. JSTOR 3773631.
  12. Picken, Stuart D.B. (2011). Historical Dictionary of Shinto (2nd ed.). Lanham: Rowman & Littlefield Publishing Group. p. 92. ISBN 978-0-8108-7372-8.
  13. "Deities". Yasukuni Shrine (in ఇంగ్లీష్). Retrieved 2016-06-29.
  14. Ono, Motonori; Woodard, William P. (1962). Shinto: the Kami Way. Tokyo: Rutland, Vt: C.E. Tuttle Co. p. 23. ISBN 0804835578.
  15. 15.0 15.1 15.2 "Shinto". ReligionFacts. 2016-11-17. Retrieved 2017-01-01.
  16. 16.0 16.1 Halverson, Dean C. (1996). The Compact Guide to World Religions. Minneapolis, Minnesota: Bethany House Publishers. p. 205. ISBN 1-55661-704-6.
  17. Hopfe, Lewis M.; Woodward, Mark R. (2009). Religions of the World (11th ed.). New York: Vango Books. ISBN 978-0-13-606177-9.
  18. 18.0 18.1 18.2 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; Britannica అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  19. "Shinto – The Way of the Gods". Archived from the original on 2013-07-30. Retrieved 2017-05-02.
  20. "SHINTO". Religious Tolerance. Archived from the original on 2016-08-30. Retrieved 2017-01-01.

మరింత చదవడానికి మార్చు

  • చాంబర్‌లైన్, బాసిల్ హెచ్. (అనువదించినది). 1919. కోజికి, పురాతన విషయాల రికార్డులు . ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ జపాన్.
  • క్లార్క్, రోజర్. 2000 " [1][permanent dead link] ". ది ఇండిపెండెంట్ . 7 ఏప్రిల్ 2000.
  • ఫిషర్, మేరీ పి. 2008. లివింగ్ రిలిజియన్స్ ఏడవ ఎడిషన్.

బాహ్య లింకులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=కామి&oldid=3938813" నుండి వెలికితీశారు