మిన్నసోటా విశ్వవిద్యాలయం

మిన్నసోటా విశ్వవిద్యాలయం, అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని మిన్నసోటా రాష్ట్రంలో కల ఒక ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల వ్యవస్థ. అందులో ప్రధానమైన, అతి పెద్ద క్యాంపస్ జంటనగరాలుగా ప్రసిధ్ది గాంచిన మిన్నియాపొలిస్, సెయింట్ పాల్లో ఉంది. [1] ట్విన్ సిటీస్ క్యాంపస్ మిన్నెసోటా విశ్వవిద్యాలయ వ్యవస్థలో అత్యంత పురాతనమైనది, అతిపెద్దది. ప్రధాన క్యాంపస్ విద్యార్థుల సంఖ్యలో ఇది అమెరికా లోకెల్లా ఆరవ అతిపెద్దది. 2019-20లో ఇందులో 51,327 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది మిన్నెసోటా విశ్వవిద్యాలయం లోని ప్రధాన సంస్థ. దీన్ని 19 కళాశాలలు, పాఠశాలలు, ఇతర ప్రధాన విద్యా విభాగాలుగా విభజించారు.

మిన్నియాపాలిస్లోని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో 717 డెలావేర్ భవనం.

మిన్నెసోటా విశ్వవిద్యాలయం అసోసియేషన్ ఆఫ్ అమెరికన్ యూనివర్సిటీలలో సభ్యురాలు. పరిశోధన కార్యకలాపాల్లో ఇది అమెరికాలో 17 వ స్థానంలో ఉంది, 2018 ఆర్థిక సంవత్సరంలో పరిశోధనపై 954 మిలియన్లు వ్యయం చేసింది.

మిన్నెసోటా విశ్వవిద్యాలయ లోని అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, పరిశోధకులు మొత్తం 26 నోబెల్ బహుమతులు,[2] మూడు పులిట్జర్ బహుమతులూ గెలుచుకున్నారు . [3] మిన్నెసోటా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల్లో ఇద్దరు హుబెర్ట్ హంఫ్రీ, వాల్టర్ మోండేల్ లు అమెరికా ఉపాధ్యక్షులయ్యారు. 2016 లో సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన బాబ్ డైలాన్ కూడా ఇక్కడి పూర్వ విద్యార్థే. [4]

చరిత్ర

మార్చు

మిన్నెసోటా విశ్వవిద్యాలయాన్ని మిన్నియాపాలిస్‌లో 1851 లో, మిన్నెసోటా రాష్ట్రం ఏర్పడడానికి ఏడు సంవత్సరాల ముందు, కళాశాల సన్నాహక పాఠశాలగా స్థాపించారు. [5] తొలినాళ్ళలో ఇది పలు కష్టాలు పడింది. దక్షిణ కెరోలినా గవర్నరు విలియం ఐకెన్ జూనియర్ వంటి సహా వివిధ దాతలు ఇచ్చే విరాళాలపై ఆధారపడింది.[6] [7] 1867 లో, విశ్వవిద్యాలయం 1862 నాటి మోరిల్ చట్టం ద్వారా భూమి మంజూరు చేయించుకునే హోదాను పొందింది.

పిండి మిల్లు సొంతదారు జాన్ ఎస్. పిల్స్‌బరీ, 1876 లో ఇచ్చిన విరాళం, పాఠశాలను కాపాడిన ఘనత పొందింది.[8] [9] అప్పటి నుండి, పిల్స్‌బరీని ఈ "విశ్వవిద్యాలయ పితామహుడు"గా ప్రసిద్ధి చెందాడు. [10] అతని గౌరవార్థం పిల్స్‌బరీ హాలుకు ఆ పేరు పెట్టారు. [11] [12]

మూలాలు

మార్చు
  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :0 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. "University of Minnesota Scholars Walk: Nobel Prize". University of Minnesota. Archived from the original on 2018-09-08. Retrieved December 15, 2016.
  3. "University of Minnesota Scholars Walk: Pulitzer Prize". University of Minnesota. Archived from the original on 2017-07-12. Retrieved December 15, 2016.
  4. "The Nobel Prize in Literature 2016".
  5. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :02 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. Lehman, Christopher P (2017). "Slaveholder Investment in Territorial Minnesota". Minnesota History. 65 (7): 270–272. JSTOR 26368724.
  7. Brown, Curt (June 20, 2016). "Minnesota History: Southern slave owner helped revive University of Minnesota". Star-Tribune. Minneapolis, Minn. Retrieved March 17, 2020.
  8. Lehman, Christopher P (2017). "Slaveholder Investment in Territorial Minnesota". Minnesota History. 65 (7): 270–272. JSTOR 26368724.
  9. Brown, Curt (June 20, 2016). "Minnesota History: Southern slave owner helped revive University of Minnesota". Star-Tribune. Minneapolis, Minn. Retrieved March 17, 2020.
  10. Carney, Mary Vance (1918). Minnesota: the star of the North. D. C. Heath & co. p. 218.
  11. Minnesota. University (1921). Bulletin. Minnesota. University. p. 67.
  12. Millett, Larry (2007). AIA Guide to the Twin Cities: The Essential Source on the Architecture of Minneapolis and St. Paul. Minnesota Historical Society. p. 132. ISBN 9780873515405.

వెలుపలి లంకెలు

మార్చు