మియా మిష్క్ మసీదు
మియా మిష్క్ మసీదు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉన్న మసీదు. పురానపూల్ కు సమీపంలో ఉన్న ఈ మసీదు 17వ శతాబ్దంలో కుతుబ్ షాహి పరిపాలకాలంలో నిర్మించబడింది.[1]
మియా మిష్క్ మసీదు | |
---|---|
మియా మిష్క్ మసీదు లోపలి దృశ్యం | |
ప్రదేశం | పురానపూల్, హైదరాబాదు, భారతదేశం |
నిర్మాణ సమాచారం | |
మీనార్/మీనార్లు | 2 |
భవన సామాగ్రి | గ్రానైట్, సున్నం, మోర్టార్ |
చరిత్ర
మార్చు1678లో గోల్కొండ ఆరవ రాజు అబ్దుల్లా కుతుబ్ షా కు అంతరంగిక కార్యదర్శిగా, నవాబు అంతఃపురానికి సైన్యాధికారిగా పనిచేసిన మిష్క్‌మియా దీనిని నిర్మించాడు.[2] ఇథియోపియాలోని హబ్సీ తెగకు చెందిన అతడిని ప్రజలు బడే మాలిక్ అని గౌరవంగా పిలిచేవారు. 1680లో మిష్క్‌మియా చనిపోయినపుడు ఈ మసీదు ప్రాంగణంలో అతడిని సమాధి చేసారు.[3]
నిర్మాణం
మార్చుమసీదు ప్రధాన ద్వారంపైన స్తంభాలతో ఒక శాసనం అలంకరించబడి ఉంది. మసీదు వెనుక భాగంలో మసాజ్, వేడి నీటితో కూడిన స్నానాల గదులు ఉండేవి. మధ్యభాగంలో ఫౌంటెన్‌తో కూడిన వజుఖానా ఉంది. మసీదు మధ్యలో రెండు భారీ స్తంభాలు మొత్తం భవనాన్ని పట్టుకున్నట్లు కనిపిస్తాయి. సన్నని గ్రిల్స్‌తో గాజు తలుపులు మసీదు ముందు భాగంలో ఉన్నాయి. కొన్ని తివాచీలు, లైట్లు అలంకరించి ఉన్నాయి. మసీదు కుడివైపున మియాన్ మిష్క్ సమాధి ఉంది. రాజుకు అంతరంగిక కార్యదర్శిగా, నవాబు అంతఃపురానికి సైన్యాధికారిగా బాధ్యత వహించాడని మియాన్ మిష్క్ సమాధిపై ఉన్న శాసనంపై రాయబడివుంది. లోపలి భాగంలో చుట్టూ రాతి స్తంభాలు, బ్రాకెట్లు, సజ్జాలు ఉన్నాయి. ప్రధాన సమాధి ఎడమ వైపున అనేక చిన్న సమాధులు ఉన్నాయి.[4]
ఇతర వివరాలు
మార్చుహైదరాబాద్ పట్టణాభివృద్ధి అథారిటీ సూచించిన హైదరాబాదు వారసత్వ జాబితాలో ఇది కూడా ఉంది, కానీ పురావస్తు సర్వే ఆఫ్ ఇండియాలో భాగం మాత్రం కాదు.
మూలాలు
మార్చు- ↑ "Hot bath lies in neglect". The Hindu. Archived from the original on 16 ఫిబ్రవరి 2008. Retrieved 18 April 2020.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "'Mushk Mahal' is in ruins". The Hindu. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 18 April 2020.
- ↑ నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (3 April 2016). "కార్వాన్: అంగళ్ల రతనాలు అమ్మినారిచట!". పరవస్తు లోకేశ్వర్. Archived from the original on 28 మే 2019. Retrieved 18 April 2020.
- ↑ Deccan Chronicle, Nation/Current Affairs (20 May 2018). "Hyderabad: Mian Mishk Masjid left to decay by caretakers". Lalita Iyer I. Archived from the original on 20 మే 2018. Retrieved 18 April 2020.